Unlimited Data Offers
-
ఎయిర్ టెల్ 5G అంలిమిటెడ్ డేటా...అదిరిపోయి ప్లాన్
-
5జీ అన్లిమిటెడ్ డేటా: ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ప్లాన్లు!
తక్కువ టారిఫ్‌తో అన్లిమిటెడ్ 5జీ డేటా ఆనందించాలనుకునే వారి కోసం ఎయిర్‌టెల్‌లో అదిరిపోయే ప్లాన్లు ఉన్నాయి. ఎయిర్టెల్ ఇటీవల డేటా వినియోగంపై రోజువారీ పరిమితిని ఎత్తేస్తూ అన్లిమిటెడ్ 5జీ డేటాను ప్రకటించింది. ఎయిర్టెల్ 5జీ ప్లస్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఉంటున్న ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఎటువంటి పరిమితులు లేకుండా అన్లిమిటెడ్ 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇదీ చదవండి: కార్యాలయాలకు కేరాఫ్ హైదరాబాద్! ఆఫీస్ స్పేస్ లీజుల్లో టాప్ అన్లిమిటెడ్ 5జీ డేటా అందించే ప్లాన్లు ఎయిర్‌టెల్‌లో రూ.500 లోపే చాలానే ఉన్నాయి. రూ.239 ప్లాన్: ఈ ప్లాన్ కింద 1GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అర్హత ఉన్న కస్టమర్లు అపరిమిత 5జీ డేటా వాడుకోవచ్చు. రూ. 265 ప్లాన్: ఈ ప్లాన్‌తో 1GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రూ. 296 ప్లాన్: ఈ ప్లాన్ 30 రోజుల పాటు అపరిమిత కాలింగ్, ఎస్సెమ్మెస్‌లతో పాటు మొత్తం 25GB డేటా అందిస్తుంది. అర్హత ఉన్న యూజర్లు అపరిమిత 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. రూ. 299 ప్లాన్: ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత కాలింగ్‌తో 1.5GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు 28 రోజుల పాటు లభిస్తాయి. అర్హులైన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. రూ. 319 ప్లాన్: ఒక నెల వాలిడిటీ ఉండే ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ ఉంటాయి. రూ. 359 ప్లాన్: ఇది కూడా ఒక నెల వాలిడిటీ, 2GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ అందిస్తుంది. అదనంగా ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు ఉచిత సభ్యత్వం లభిస్తుంది. రూ. 399 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్లాన్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు ఉచిత సబ్స్క్రిప్షన్, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5GB రోజువారీ డేటా లభిస్తాయి. రూ. 479 ప్లాన్: ఈ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్‌తో 56 రోజుల పాటు 5జీ డేటాను, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందిస్తుంది. రూ. 489 ప్లాన్: మొత్తం 50GB డేటాతో ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 100 ఎస్సెమ్మెస్‌లు 30 రోజుల పాటు లభిస్తాయి. రూ. 499 ప్లాన్: ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, 3GB రోజువారీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 28 రోజుల ప్యాక్ వాలిడిటీతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచిత సభ్యత్వం పొందవచ్చు. ఇదీ చదవండి: ధూమ్మచాలే.. హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది! -
ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా!
భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ 5జీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లు అపరిమితంగా 5జీ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. విస్తృతమైన తమ 5జీ నెట్‌వర్క్‌ను కస్టమర్లకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: SVB: దివాలా తీసిన బ్యాంకులో మనోళ్ల డిపాజిట్లు ఎంతంటే.. డేటా వినియోగంపై పరిమితులను ఎయిర్టెల్ తొలగించింది. దీంతో కస్టమర్లు ఇక అల్ట్రాఫాస్ట్, సురక్షితమైన 5జీ ప్లస్ సర్వీసును అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు అందరితోపాటు రూ.239 ఆపైన డేటా ప్లాన్లను కలిగిన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? ఎయిర్టెల్ 5జీ ప్లస్ సర్వీస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉంది. ఈ అన్లిమిటెడ్ డేటా ఆఫర్‌ను వినియోగించుకునేందుకు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే 5జీ నెట్వర్క పరిధిలో ఉండాలి. ఇందు కోసం ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! -
జియో నుంచి అన్లిమిడెట్ డేటా ప్లాన్స్
హైదరాబాద్ : అపరిమిత డేటా ప్లాన్స్ ప్రకటించింది జియో. ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్లాన్లపై రోజువారి లిమిట్ ఉంది. తాజాగా రోజువారీ డేటా లిమిట్ లేకుండా కొత్త ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ ఉచితంగా ఇచ్చే డేటాను పరిమిత కాలంలో ఎప్పుడైనా వాడుకునే అవకాశం కల్పించింది. ఆఫర్లు ఇలా అపరిమిత డేటా ప్లాన్స్‌లో భాగంగా రూ. 127 తో రీఛార్జీ చేయిస్తే 15 రోజుల వాలిడిటీతో పాటు 12 జీబీ డేటా వస్తుంది. 15 రోజుల్లో ఎప్పుడైనా ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ. 247 ప్లాన్‌లో 30 రోజుల వాలిడిటీ 25 జీబీ డేటాను అందిస్తోంది. ఇలా రూ. 447 నుంచి రూ. 2,397 వరకు వివిధ రకాల ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. ఓటీటీ యూజర్లు హ్యాపీ జియో ప్రకటించిన నూతన డేటా ప్లాన్‌తో ఉపయోగం ఉంటుందని వినియోగదారులు అంటున్నారు. ఓటీటీలో ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు చాలా సార్లు డైలీ డేటా లిమిట్ కారణంగా మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుతం అన్లిమిటెడ్ డేటా కావడంతో ఆ ఇబ్బంది తొలగిపోతుందంటున్నారు. చదవండి: Ott Netflix : ఈ టెక్నిక్ తో మీకు నచ్చిన సినిమాల్ని ఒక్క క్లిక్ తో చూడొచ్చు -
హైదరాబాద్‌లో ఎయిర్టెల్ ‘అపరిమిత’ డేటా
న్యూఢిల్లీ : టెలికాం రంగంలో మరో బిగ్గెస్ట్ గేమ్ ఛేంజర్‌గా రిలయన్స్ జియో తన ఫైబర్ ఆప్టికల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు ‘జియోగిగాఫైబర్’ ను గత రెండు రోజుల క్రితమే లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. జియో ప్రకటించిన ఈ సేవలకు, గట్టి పోటీ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ రంగంలోకి దిగింది. తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై ఎఫ్‌యూపీ(ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితిని ఎత్తివేసింది. తొలుత ఈ పరిమితిని హైదరాబాద్‌లో తొలగించినట్టు ఎయిర్టెల్ పేర్కొంది. దీంతో హైదరాబాద్ సర్కిల్లో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై కూడా అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ డేటాను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుంది. అంటే మీ కనెక్షన్‌పై హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సస్‌ను ఎలాంటి డేటా పరిమితి లేకుండా పొందవచ్చు. హైదరాబాద్ సర్కిల్లో రూ.349 నుంచి రూ.1299 మధ్యలో నాలుగు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఆరు నెలలు, ఏడాది కాలానికి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంపిక చేసుకునే వారికీ ఈ కంపెనీ 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు కూడా గత నెలలోనే ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు అన్ని సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ అపరిమిత డేటా ఆఫర్ హైదరాబాద్ సర్కిల్ మినహాయించి మరే ఇతర సర్కిల్లోనూ లేదు. ఢిల్లీలో రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై 100 జీబీ బ్రాడ్‌బ్యాండ్ డేటా పరిమితి ఉంది. హైదరాబాద్ సర్కిల్లో రూ.349 ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే, 8 ఎంబీపీఎస్ వరకు స్పీడులో అపరిమిత డేటా లభ్యమవుతుంది. అదేవిధంగా రూ.1,299 ప్లాన్‌పై 100ఎంబీపీఎస్ స్పీడులో డేటా పొందవచ్చు. ఈ స్పీడులో ఈమెయిల్ నుంచి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవడం, ఆడియో, వీడియో ఫైల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, వెబ్‌ను సర్ఫ్ చేసుకోవడం చేయొచ్చు. జియోగిగాఫైబర్ ద్వారా 1జీబీపీఎస్ స్పీడులో డేటాను అందించనున్నట్టు రిలయన్స్ జియో రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
బెస్ట్ 'అన్ లిమిటెడ్ డేటా' ఆఫర్లేమిటో తెలుసా?
సంచలన ఆఫర్లతో రిలయన్స్ జియో టెలికాం మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో టెలికాం దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ లన్నీ ఒక్కసారిగా రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. ఇక ఏప్రిల్ 1 నుంచి రిలయన్స్ జియో తన ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఛార్జీల విధింపుకు సిద్ధమైంది. అయినప్పటికీ కంపెనీలు మాత్రం తన కస్టమర్లను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వారికి కౌంటర్ గా జియో కూడా బెస్ట్ డీల్స్ నే ప్రకటిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందిస్తున్న బెస్ట్ అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లేమున్నాయో ఓ సారి చూద్దాం... రిలయన్స్ జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్+రూ.303 రీఛార్జ్ ప్యాక్: రిలయన్స్ జియో తన ప్రైమ్ కస్టమర్లకు రూ.303 ప్రీపెయిడ్ రీఛార్జ్ తో 28జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ డేటా 28 రోజుల వరకు వాలిడిటీలో ఉండనుంది. జియో ప్రైమ్ పోస్ట్ పెయిడ్ యూజర్లకైతే, ఇదే ధర కింద 30జీబీ డేటాను కంపెనీ అందించనుంది. ఈ ప్లాన్ కింద కస్టమర్లు రూ.99 జియో ప్రైమ్ ప్లాన్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే, రోజుకు 1జీబీ 4జీ డేటా కూడా పొందవచ్చు. దాంతో పాటు అపరిమిత ఉచిత కాల్స్. 1జీబీ డేటా సరిపోదనుకునే ప్రీపెయిడ్ యూజర్లు రూ. 499 జియో ప్రైమ్ రీఛార్జ్ ప్యాక్ ను వేసుకుంటే 56జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ వాడుకోవచ్చు. ఇదే బిల్లింగ్ సైకిల్ కింద పోస్ట్ పెయిడ్ కస్టమర్లైతే 60జీబీ 4జీ డేటాను పొందవచ్చని కంపెనీ తెలిపిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ రూ.345 రీఛార్జ్ ప్యాక్: రూ.345 తో రీఛార్జ్ చేసుకునే ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు 28 రోజుల వరకు 28జీబీ హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు. అదేవిధంగా డైలీ ఎఫ్‌యూపీ కింద 1జీబీ పొందవచ్చు. రోజంతా 500 ఎంబీని వాడుకొని, అర్థరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మరో 500 ఎంబీని వాడుకునేలా ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఒకవేళ ఎలాంటి టైమింగ్ నిబంధనలు లేకుండా రోజంతా 1జీబీ వాడుకోవాలనుకునే వారు రూ.549 రీఛార్జ్ ప్యాక్ ను వేసుకోవాల్సి ఉంటుంది. రూ.345, రూ.549 రీఛార్జ్ ప్యాక్ లపై ఉచిత కాల్స్ ను కూడా పొందవచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి. 1200 నిమిషాలకు పైగా కాల్స్ ను వాడుకునే వారికి నిమిషానికి 30పైసల ఛార్జ్ పడుతుంది. 30 పైసల ఛార్జ్ వేసిన తర్వాత ఎయిర్ టెల్ రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్ ను అందిస్తోంది. అటు పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఎయిర్ టెల్ మార్చి 13 నుంచి ఉచిత డేటా అందించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కానీ ఎంత మేరకు ఉచిత డేటా అందిస్తోందో తెలుపలేదు. అయితే ఈ ఉచిత డేటాను పొందాలంటే మైఎయిర్ టెల్ యాప్ ను సబ్ స్క్రైబర్లు ఓపెన్ చేసుకోవాలని సూచించింది. వొడాఫోన్ రూ.346 రీఛార్జ్ ప్యాక్ : రూ.346 రీఛార్జ్ ప్యాక్ ను లాంచ్ చేసిన వొడాఫోన్ 28జీబీ మొబైల్ డేటాను, అపరిమిత ఉచిత కాల్స్ ను అందించనున్నట్టు తెలిపింది. ప్రత్యర్థుల మాదిరిగానే రోజూ 1జీబీ ఉచిత డేటాను వాడుకునే అవకాశం కల్పించిన వొడాఫోన్, అంతకంటే ఎక్కువ వాడితే ఛార్జ్ చేయనున్నట్టు పేర్కొంది. ఐడియా రూ.348 రీఛార్జ్ ప్యాక్ : ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా రూ.348 రీఛార్జ్ తో 14జీబీ ఉచిత డేటా, రోజుకు 500 ఎంబీ డేటాను వాడుకునే అవకాశాన్ని పొందనున్నారు. వీటితో పాటు అపరిమిత కాల్స్ ను పొందవచ్చు. 4జీ హ్యాండ్ సెట్ ఉన్న వారికి మాత్రమే ఈ కొత్త ఆఫర్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది.