
హైదరాబాద్ : అపరిమిత డేటా ప్లాన్స్ ప్రకటించింది జియో. ఇప్పటి వరకు దాదాపు అన్ని ప్లాన్లపై రోజువారి లిమిట్ ఉంది. తాజాగా రోజువారీ డేటా లిమిట్ లేకుండా కొత్త ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ ఉచితంగా ఇచ్చే డేటాను పరిమిత కాలంలో ఎప్పుడైనా వాడుకునే అవకాశం కల్పించింది.
ఆఫర్లు ఇలా
అపరిమిత డేటా ప్లాన్స్‌లో భాగంగా రూ. 127 తో రీఛార్జీ చేయిస్తే 15 రోజుల వాలిడిటీతో పాటు 12 జీబీ డేటా వస్తుంది. 15 రోజుల్లో ఎప్పుడైనా ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ. 247 ప్లాన్‌లో 30 రోజుల వాలిడిటీ 25 జీబీ డేటాను అందిస్తోంది. ఇలా రూ. 447 నుంచి రూ. 2,397 వరకు వివిధ రకాల ప్లాన్లను జియో అందుబాటులోకి తెచ్చింది.
ఓటీటీ యూజర్లు హ్యాపీ
జియో ప్రకటించిన నూతన డేటా ప్లాన్‌తో ఉపయోగం ఉంటుందని వినియోగదారులు అంటున్నారు. ఓటీటీలో ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు చాలా సార్లు డైలీ డేటా లిమిట్ కారణంగా మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వచ్చేదని చెబుతున్నారు. ప్రస్తుతం అన్‌లిమిటెడ్ డేటా కావడంతో ఆ ఇబ్బంది తొలగిపోతుందంటున్నారు.
చదవండి: Ott Netflix : ఈ టెక్నిక్ తో మీకు నచ్చిన సినిమాల్ని ఒక్క క్లిక్ తో చూడొచ్చు
Comments
Please login to add a commentAdd a comment