ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.
రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్‌కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment