విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. 5జీ సర్వీసులు ప్రారంభం | Airtel launches 5G Services in Vizag | Sakshi
Sakshi News home page

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. 5జీ సర్వీసులు ప్రారంభం

Published Fri, Dec 23 2022 7:46 AM | Last Updated on Fri, Dec 23 2022 1:43 PM

Airtel launches 5G Services in Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం : దేశంలోని ప్రముఖ టె­లికమ్యూనికేషన్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ భా­రతీ ఎయిర్‌టెల్‌ వైజాగ్‌లో అత్యాధునిక 5జీ ప్లస్‌ సేవలను గురువారం నుంచి  ప్రా­­రంభించినట్లు ప్రకటించింది. సంస్థ త­న 5జీ నెట్‌వర్క్‌ని దశలవారీగా విశాఖ నగ­రంలోని వినియోగదారులకు అందుబా­టులోకి తీసుకురానున్నట్లు ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో శివన్‌ భార్గవ వెల్లడించారు.

5జీ నెట్‌వర్క్‌ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్‌ ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ నెట్‌వర్క్‌ని ఉచితంగా పొందవచ్చని సీఈవో శివన్‌ వివరించారు. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌ సిమ్‌తోనే 5జీ సేవల్ని 5జీ ఫోన్‌లో పొందేలా వినియోగదారులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 

చదవండి: (Yanamala Brothers: అన్నదమ్ముల అస్త్రసన్యాసం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement