స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్‌ఎంఎస్ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.
ఈ కొత్త భద్రతా ఫీచర్‌తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్‌ఎన్‌ఎల్ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్‌లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.
కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త టెక్నాలజీ..
బీఎస్‌ఎన్‌ఎల్ యూసీసీ కంప్లయింట్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో మోసపూరిత ఎస్‌ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్‌ను నివేదించవచ్చు. ఈ ఫీచర్ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్‌లు ఏవీ ఇలాంటి ఫీచర్‌ను అందించడం లేదు.
కంప్లయింట్ ఇలా ఫైల్ చేయండి
» బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను తెరవండి.
» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.
» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్' ఆప్షన్‌ను ఎంచుకోండి.
» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.
» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్' ఎంచుకోండి.
» 'న్యూ కంప్లయింట్'పై నొక్కండి.
» మీ కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.
» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్‌ను సబ్‌మిట్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment