ఉప్పు నుంచి పప్పుదాకా..పెట్రోల్ నుంచి వంట నూనె దాకా. ఇలా పెరుగుతున్న నిత్యవసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో సామాన్యుడిపై ధరల భారం పడనుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది.
దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజాలన్నీ గతేడాది నవంబర్ నెలలో 20, 25 శాతం (కంపెనీని బట్టి) టారిఫ్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు మరోసారి యూజర్లపై ధరల భారం మోపేందు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా... ఎవరతై తక్కువ ప్లాన్ టారిఫ్ ప్లాన్‌లను వినియోగించడం, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల బేస్‌ను తగ్గించాలని చూస్తున్నాయి. అదే జరిగితే యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్‌పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాయి.
యూజర్లు తగ్గడం లేదు
గతేడాది నవంబర్ నెల నుంచి ఆయా టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని పెంచాయి. అయినా సరే గత కొన్ని నెలలుగా యాక్టీవ్ యూజర్ల సంఖ్య పెరగడం, గతంలో పెంచిన టారిఫ్ ధరల గురించి యూజర్లు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయడం లేదనే భావనలో టెలికాం సంస్థలున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
జియో, ఎయిర్‌టెల్
రిలయన్స్ జియో నెట్ వర్క్ నుంచి ఇన్ యాక్టీవ్ నెంబర్లు తగ్గారు. దీంతో యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల సంఖ్య పెరిగింది. 94శాతంతో ఇది ఫిబ్రవరి చివరి నాటికి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికు చేరుకుంది. మరోవైపు ఎయిర్‌టెల్ సైతం తన ఏఆర్‌పీయూని పెంచడంపై దృష్టి సారించింది. గత డిసెంబర్ నెల సమాయానికి ఎయిర్‌టెల్ ఏఆర్‌పీయూ రూ.163 ఉండగా..టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా ఈ ఏడాది ఏఆర్‌పీయూని రూ.200 ఏఆర్‌పీయూకి పెంచుకోవాలని చూస్తుంది. అదేవిధంగా వొడాఫోన్ ఐడియా సైతం ఏఆర్‌పీయూని పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆ సంఖ్య ఎంతనే స్పష్టం చేయలేదు.
మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు
ఈ సందర్భంగా టెలికాం నిపుణులు..గతంలో పెంచిన టారిఫ్ ధరలతో కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. అయితే మరికొన్ని నెలల్లో స్పెక్ట్రమ్ వేలం తర్వాత టెలికాం ఆపరేటర్లు లాభాల్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అందుకే దాన్ని అధిగమించేందుకు ముందస్తుగా మనదేశ టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు 'దేశంలో 5జీ నెట్ వర్క్ విజయవంతం కావాలంటే ఏఆర్‌పీయూ మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి👉ఎగబడి మరీ కొంటున్నారు, మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్‌లు ఇవే!
Comments
Please login to add a commentAdd a comment