
న్యూఢిల్లీ: టెలికం చందాదారులు జూన్ చివరికి 117.29 కోట్లకు పెరిగారు. రిలయన్స్ జియో ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించింది. వైర్‌లెస్ చందాదారులు మే చివరికి 114.55 కోట్లుగా ఉంటే, జూన్ చివరికి 114.73 కోట్లకు పెరిగారు. రిలయన్స్ జియో కొత్తగా 41.3 లక్షల కస్టమర్లను జూన్‌లో సొంతం చేసుకుంది.
దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 41.3 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి 7.93 కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 36.29 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా జూన్‌లో 18 లక్షల మందిని కోల్పోయింది. సంస్థ పరిధిలో 25.66 కోట్ల కస్టమర్లు మిగిలారు. బీఎస్‌ఎన్‌ఎల్ 13.27 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment