ప్రముఖ టెలికం నెట్‌వర్క్ జియోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న యూజర్లు వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, స్నాప్‌చాట్, యూట్యూబ్, గూగుల్‌ను వినియోగించుకోలేక పోతున్నామంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ మేరకు..మొబైల్ ఇంటర్నెట్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని 54 శాతం ఫిర్యాదు, 38 శాతం జియో ఫైబర్, 7 శాతం మొబైల్ నెట్‌వర్క్‌లో సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం.
మరోవైపు యూజర్లకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ జియో కస్టమర్ కేర్ విభాగం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్‌లు జియో సంస్థ తీరుకు నిరసనగా మీమ్స్ షేర్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment