
ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ వార్షిక సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ సంస్థ 5జీ నెట్ వర్క్‌తో పాటు ఇతర సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
ఏజీఎం సమావేశంలో పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్స్‌ను అప్ గ్రేడ్ చేసుకునే అవసరం లేకుండా రిలయన్స్ జియో క్లౌడ్ పీసీ అనే కొత్త ప్రొడక్టన్‌ను లాంచ్ చేయనున్నట్లు రిలయన్స్ సంచలన ప్రకటన చేసింది.జియో 5జీ సేవల్లో ఒక భాగమైన జియో ఫైబర్‌ను ఉపయోగించి క్లౌండ్ ఉంచిన వర్చువల్ పీసీని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. వినియోగం బట్టి ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని రిలయన్స్ సంస్థలో ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
'జియో ఎయిర్ ఫైబర్'
జియో సంస్థ 'జియో ఎయిర్ ఫైబర్' అనే డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ సింగిల్ డివైజ్‌తో సులభంగా ఇంట్లో వైఫై హాట్ స్పాట్, ఆల్ట్రా హై స్పీడ్ 5జీ నెట్ వర్క్ ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అతి తక్కువ సమయంలో గిగా బైట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో వందల సంఖ్యలో ఇళ్లు, కార్యాలయాల్లో కనెక్ట్ అవుతుందని తెలిపింది.