శామ్‌సంగ్, షియోమీ,మోటోరోలా, రియల్‌మీ, వన్‌ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్‌తో కుమ్మక్కై ఈ-కామర్స్ సంస్థల భారతీయ వెబ్‌సైట్‌లలో యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రత్యేకంగా ఉత్పత్తులను లాంచ్ చేశాయని రాయిటర్స్ ఒక నివేదికలో వెల్లడించింది.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వహించిన యాంటీట్రస్ట్ పరిశోధనలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చట్టాలను ఉల్లంఘించాయని, ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్దిష్ట జాబితాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తులను బాగా తగ్గించడం, ఇతర కంపెనీలను దెబ్బతీసినట్లు రాయిటర్స్ నివేదికలో వెల్లడించింది.
ఇదీ చదవండి: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు
రాయిటర్స్ నివేదికపై స్మార్ట్‌ఫోన్ తయారీదారులు స్పందించలేదు. అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు కూడా ఇప్పటివరకు వ్యాఖ్యానించలేదు. అయితే రెండు సీసీఐ నివేదికల పరిశోధనల సమయంలో అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేకమైన లాంచ్‌ల ఆరోపణలను వ్యతిరేకించాయి. నివేదిక వెల్లడైన తరువాత స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment