సెల్‌ఫోన్ దొంగల ముఠా గుట్టురట్టు
వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యవహారం
31 మందిని అరెస్టు చేసిన టాస్‌్కఫోర్స్ పోలీసులు
రూ.2 కోట్ల విలువైన 713 సెల్‌ఫోన్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల సెల్‌ఫోన్ చోరీలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు చోరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–సూడాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ నేర బంధం వెలుగులోకి వచి్చంది. ఇక్కడ చోరీకి గురైన స్మార్ట్‌ఫోన్లను థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి సూడాన్‌కు స్మగ్లింగ్ చేస్తున్న వ్యవస్థీకృత ముఠా వ్యవహారాలు బయట పడుతున్నాయి. గత నెల ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్‌ఫోన్లు స్వా««దీనం చేసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు.. తాజాగా మరో 31 మందిని పట్టుకుని వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ ముఠాల వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాళ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చోరీ చేసి.. వ్యాపారులకు విక్రయం
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. విలాసాలకు అవసరమైన డబ్బును తేలిగ్గా సంపాదించడానికి సెల్‌ఫోన్ల చోరీలు చేయాలని పథకం వేశారు. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసుకుని ప్రజల సెల్‌ఫోన్లు చోరీ చేస్తారు. వాటిని జగదీశ్ మార్కెట్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలో కొందరు వ్యాపారులకు విక్రయిస్తుంటారు.
ఆపై వాటిని ఏం చేస్తున్నారు?
ఇలా చోరీ చేసిన ఫోన్లలో దాదాపు అన్నీ లాక్ చేసే ఉంటాయి. వీటిని అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు సెల్‌ఫోన్ టెక్నీíÙయన్లు పని చేస్తున్నారు. వీళ్లు చోరీ ఫోన్ల లాక్‌లు తీయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపర్ చేస్తుంటారు. అంటే.. తక్కువ ఖరీదు ఉండే బేసిక్ ఫోన్లకు చెందిన ఐఎంఈఐ నంబర్లను ఖరీదైన ఫోన్లలో వేసి పోలీసుల సాంకేతిక ని«ఘాకు చిక్కకుండా చేస్తారు. ఆపై ఆ ఫోన్లను వ్యాపారులు సూడానీయులకు అమ్మేస్తున్నారు. ఆ దేశంలోని వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉండే వీళ్లు.. సెకండ్ హ్యాండ్ ఫోన్ల పేరుతో థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి, తప్పుడు పత్రాలతో సముద్ర మార్గంలో అక్కడకు పంపేస్తున్నారు.
ఈ నెట్‌వర్క్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారు?
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు.. సయ్యద్ ఘయాజ్ హషి్మ, మహ్మద్ దస్తగిర్, సయ్యద్ సాజిద్, సయ్యద్ షరీఫ్, సయ్యద్ సలావుద్దీన్, టైల్స్ వర్కర్లు మహ్మద్ హమీద్, షేక్ మునావర్, వెల్డింగ్ వర్కర్లు షేక్ అన్సార్, మహ్మద్ ఖాన్, డెకరేషన్ వర్కర్ మహ్మద్ అంజాద్, వంట పని చేసే మహ్మద్ ఖాలిద్, పెయింటర్ మహ్మద్ మహమూద్ అలీ, చిరుద్యోగి సోహైల్ ఖాన్, కూరగాయల వ్యాపారి మహ్మద్ ముస్తాక్ ఫోన్లు చోరీ చేస్తారు.
మొబైల్ వ్యాపారులైన షేక్ షాజవాజ్ ఖాన్, మహ్మద్ ఆసిఫ్ అహ్మద్, మహ్మద్ గౌస్, మహ్మద్ అర్షద్ మొయినుద్దీన్, మహ్మద్ నవీదుద్దీన్ సల్మాన్, మహ్మద్ నజీరుద్దీన్, మహావీర్ జైన్, మహ్మద్ అబ్దుల్ సిరాజ్, మజీద్ ఖాన్, అబ్దుల్ హజీమ్, షేక్ జావేద్ అలీ ఈ చోరీ ఫోన్లు కొంటారు. వీటిని సయ్యద్ రహీమ్, మహ్మద్ అర్బాజ్ ఖాన్, నజీముద్దీన్, సాదిక్ అహ్మద్ అన్‌లాక్ చేస్తుండగా.. ఇవన్నీ తక్కువ ధరకు కొనే సూడానీ మూసా హసన్ తమ దేశానికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. నానల్‌నగర్‌లో ఉండే మూసా మొబైల్ విడిభాగాల వ్యాపారం చేస్తున్నాడు. స్మగ్లింగ్ వ్యవహారంలో మూసానే కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment