diamond jewelry
-
టీబీజెడ్‌లో ‘మంగళ 2023 కలెక్షన్’
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ టీబీజెడ్ ‘మంగళ 2023 కలెక్షన్’ ఆవిష్కరించింది. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త కలెక్షన్ విడుదల చేసింది. ‘‘భారతదేశ సంస్కృతి స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఈ బంగారు వజ్రాభరణాలు ఏ సందర్భంలో ధరించినా ప్రత్యేకత చాటుతాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అని రకుల్ తెలిపారు. పంజాగుట్ట స్టోర్ పునః ప్రారంభంతో భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని టీబీజెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిõÙక్ మాలూ ఆశించారు. -
గోల్కొండ వజ్రానికి రూ.45 కోట్లు
న్యూయార్క్: భారత్‌ను పాలించిన మహారాజులు, మొఘలులు వినియోగించిన వజ్రాభరణాలు న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ వేలంపాటలో కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రఖ్యాత క్రిస్టీస్ వేలంసంస్థ ఈ వేలం నిర్వహించింది. గోల్కొండలో దొరికిన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం, నిజాం ధరించిన గొలుసు, ఆర్కాట్ నవాబుకు చెందిన వజ్రం, స్వర్ణాభరణాలు, కత్తులు, రత్నాలుసహా దాదాపు 400 పురాతన వస్తువులను వేలం వేశారు. ‘మహారాజులు, మొఘలుల వైభవం’ పేరిట నిర్వహించిన ఈ వేలంలో క్రిస్టీస్ సంస్థకు రూ.756 కోట్లు వచ్చాయి. భారతీయ నగలు, కళాఖండాలు గతంలో ఎన్నడూ ఇంతటి భారీ ధరకు అమ్ముడుపోలేదని క్రిస్టీస్ పేర్కొంది. 2011లో ఎలిజబెత్ రాణి సేకరించిన వస్తువులు రూ.14.4 కోట్ల ధర పలికాయి. గోల్కొండలో దొరికిన 52.58 క్యారెట్ల బరువైన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం రూ.45 కోట్లు పలికింది. ఆర్కాట్ నవాబుకు చెందిన 17 క్యారెట్ల గోల్కొండ వజ్రం(ఆర్కాట్–2) రూ.23.5 కోట్లకు అమ్ముడుపోయింది. హైదరాబాద్ నిజాం ధరించిన 33 వజ్రాలు పొదిగిన హారం రూ. 17 కోట్లు పలికింది. ఇండోర్ మహారాజు యశ్వంత్ రావ్ హాల్కర్ 2 ధరించిన రత్నాలతో కూడిన గొలుసు రూ. 1.44 కోట్లు, జైపూర్ రాజమాత గాయత్రీ దేవి ధరించిన వజ్రపుటుంగరం రూ. 4.45 కోట్లు, 1680–1720 కాలానికి చెందిన వజ్రాలు పొదిగిన హుక్కా సెట్ రూ.5.3కోట్లు, సీతారామాంజనేయుల ప్రతిమలున్న మరో హారం రూ. 5.12 కోట్లు పలికాయి. 5 వరసల ముత్యాల గొలుసు రూ.11.8 కోట్లకు, వజ్రాలహారం రూ. 1.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఖతార్‌కు చెందిన రాజకుటుంబం సేకరించిన ఈ ఆభరణాలను క్రిస్టీస్ వేలం వేసింది. మొఘల్ మహారాజు షాజహాన్ వాడిన బాకు రూ.23.4 కోట్లు పలికింది. హైదరాబాద్ నిజాం నవాబు వాడిన కత్తి రూ. 13.4 కోట్లు పలికింది. భారత్‌కు చెందిన ఒక కత్తి ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. భారత్ సహా 45 దేశాలకు చెందిన ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొన్నారు. జైపూర్, ఇండోర్, బరోడా రాజవంశీకులకు చెందిన ఆభరణాలు, వస్తువులనూ ఈ వేలంలో పెట్టారు. షాజహాన్ కత్తి మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం -
వాలెంటైన్స్ డే స్పెషల్ : ‘బీలవ్డ్’ జ్యుయలరీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ రిలయన్స్ జ్యువెల్లస్ ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కలెక్షన్‌ను విడుదల చేసింది. ప్రేమికుల ప్రేమానురాగాలకు, భావోద్వేగానికి చిహ్నంగా ‘బీ లవ్డ్’ పేరుతో ప్రత్యేకంగా బంగారు నగలను , ముఖ్యంగా డైమండ్ ఆభరణాలను ఆవిష్కరించామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘తేనెటీగ’ స్ఫూర్తిగా తీర్చిదిద్దిన కలెక్షన్లను జీవితంలో ప్రతీక్షణాన్ని అత్భుదమైన శక్తి, సామర్థ్యాలతో సమతుల్యంగా నిర్వహిస్తున్న నేటి మహిళలకు అంకితం చేస్తున్నామని రిలయన్స్ జ్యువెల్లస్ సీఈవో సునీల్ నాయక్ వెల్లడించారు. ముఖ్యంగా హనీ బీ మేళవింపుతో వాలెంటైన్స్ డే సందర్భంగా డైమండ్ పెండెట్స్, చెవి రింగులు, ఉంగరాలను రూ.10వేలనుంచి ప్రారంభయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 24 దాకా అన్ని రకాల శోభాయమైన డైమండ్ నగలు, వెడ్డింగ్ కలెక్షన్స్‌పై 20శాతం దాకా డిస్కౌంట్ అందిస్తున్నామని ప్రకటించారు. -
తనిష్క్ డైమండ్ జువెలరీ డిస్కౌంట్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘తనిష్క్’ తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు విస్తృతమైన డైమండ్ జువెలరీ కలెక్షన్లపై 20 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు వారాలపాటు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో ఎంత ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిపితే అంతే అధికంగా డిస్కౌంట్‌ను పొందొచ్చని పేర్కొంది. రూ.50,000లోపు బిల్లుపై 5 శాతం, రూ.లక్షలోపు బిల్లుపై 10 శాతం, రూ.1–2 లక్షలలోపు బిల్లుపై 15 శాతం, రూ.2–10 లక్షల బిల్లుపై 20 శాతం, రూ.1 కోటిపై బిల్లుపై 30 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చని వివరించింది. ‘మహిళలు డైమండ్ ఆభరణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. డైమండ్స్ విలువైనవి. అందమైనవి. శాశ్వతమైనవి. మంచి డిజైన్లతో కూడిన ఆభరణాలను ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడానికి మేమెప్పుడూ ప్రయత్నిస్తుంటాం’ అని టైటాన్ కంపెనీ జువెలరీ విభాగపు జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) దీపిక తివారీ తెలిపారు.