ఉత్తమ వినియోగ సేవలు అందిస్తున్న తనిష్క్ | best consumer services in Tanishq | Sakshi
Sakshi News home page

ఉత్తమ వినియోగ సేవలు అందిస్తున్న తనిష్క్

Published Sun, May 10 2015 1:13 AM | Last Updated on Thu, May 24 2018 2:36 PM

ఉత్తమ వినియోగ సేవలు అందిస్తున్న తనిష్క్ - Sakshi

ఉత్తమ వినియోగ సేవలు అందిస్తున్న తనిష్క్

 భారత్‌లో ప్రముఖ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ ఈ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది. డిజైనింగ్, బంగారం స్వచ్ఛత, పాత బంగారం మార్పిడి వంటి అంశాలకు సంబంధించి వినియోగదారులకు ప్రత్యేక, నాణ్యతాపూర్వక సేవలను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆభరణాల డిజైనింగ్‌లో సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొం ది. డిజైనింగ్‌కు సంబంధించి క్రాఫ్ట్‌మెన్‌షిప్ మేకింగ్ చార్జీలు అతితక్కువగా 8 శాతం లోపు ఉంటున్నట్లు తెలిపింది. అలాగే స్వచ్ఛతకు సంబంధించి క్యారట్‌మీటర్‌తో ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. క్యారట్ల విషయంలో ఎటువంటి లొసుగులూ లేని అంశాలపై వినియోగదారులను చైతన్యవంతులను చేయడానికి తన వంతు సేవలను సంస్థ అందిస్తోంది. ఇక పాత బంగారం మార్పిడి ప్రక్రియను సైతం సంస్థ సులభతరం చేసింది.
 
 బ్రాండ్ అంబాసిడర్ దీపికా పదుకొనే...
 నాణ్యతకు మారుపేరుగా ఉన్న తమ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లడం లక్ష్యంగా తనిష్క్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి దీపికా పదుకొనేను నియమించింది. ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం గర్వకారణమని దీపికా వ్యాఖ్యానించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement