మగువల మెచ్చే నగలు ‘తనిష్క్‌’ ప్రత్యేకం | tanishq showroom opening | Sakshi
Sakshi News home page

మగువల మెచ్చే నగలు ‘తనిష్క్‌’ ప్రత్యేకం

Published Thu, Sep 21 2017 10:10 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

మగువల మెచ్చే నగలు ‘తనిష్క్‌’ ప్రత్యేకం - Sakshi

మగువల మెచ్చే నగలు ‘తనిష్క్‌’ ప్రత్యేకం

– షోరూం ప్రారంభోత్సవంలో జీఎం గోపాలరత్నం
– రాంప్‌వాక్‌తో అదరగొట్టిన టీవీ మోడల్స్‌


అనంతపురం కల్చరల్‌: ఫ్యాషన్‌ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న నగరం అనంతపురం.. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో మాత్రమే ఉన్న తనిష్క్‌ జ్యువెలరీ షోరూమ్‌ బ్రాంచిను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తనిష్క్‌ జనరల్‌ మేనేజర్‌ గోపాలరత్నం పేర్కొన్నారు. అనంత వేదికగా గురువారం స్థానిక ఆర్‌ఎఫ్‌ రోడ్డులో 229వ తనిష్క్‌ జ్యువెలరీ షోరూమ్‌ ఘనంగా ప్రారంభమైంది. గోపాలరత్నం మాట్లాడుతూ గతంలో టాటా గోల్డ్‌ స్టోర్‌గా ఉన్న షోరూమ్‌ తనిష్క్‌గా మారిందని, దీని ద్వారా వినియోగదారులకు ఉత్సాహపూరితమైన ఆఫ్లర్లను అందిస్తోందన్నారు. ప్రతి ఆభరణం కొనుగోలుపై ఉచిత బంగారు నాణేలను కూడా అందిస్తామన్నారు. అత్యుత్తమ శ్రేణి డిజైన్లను స్వచ్ఛమైన బంగారు నాణ్యతను పొందే అవకాశం ఇందులో ఉందన్నారు. శుభం కలెక‌్షన్స్, నిలోఫర్,రివా, బంగారం వజ్రాలు, కుందన్, పోల్కీతో అలంకరించబడిన ఆభరణాలు, పద్మావతి కలెక‌్షన్స్‌..ఇలా ప్రతీది వినియోగదారుల కోరిక మేరకు తయారు చేసినట్లు తెలిపారు. ఫ్రాంచైజీ పార్టనర్‌ మల్లికార్జున, ఏబీఎం సీతారామరాజు, మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు తనిష్క్‌ అందిస్తున్న ప్రత్యేకతలను వివరించారు.  

ర్యాంప్‌ వాక్‌తో ఫిదా : తనిష్క్‌ జ్యువెలరీ ప్రచారంలో భాగంగా టీవీ మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌తో అదరగొట్టారు. వర్ధమాన తారలుగా ఎదుగుతున్న దివ్య, నిహారిక, హర్షిత, సుమ హొయలొలుకుతూ చేసిన ర్యాంప్‌ వాక్‌తో అందరూ ఫిదా అయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement