
తమిళనాట దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. తమిళ హీరో అయిన విజయ్‌కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ నటించిన వారసుడు(తమిళంలో వారీసు) సంక్రాంతికి సందడి చేయనుంది. ఇదిలా ఉంటే ఆయనకు ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అతడి పేరు జాన్సన్ సంజయ్. గతంలో స్టేజ్‌పై తన డాన్స్ అందరిని ఆశ్చర్యపరిచిన సంజయ్ త్వరలోనే సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి.
చదవండి: ఆ ముద్దు కేసును కొట్టి వేయండి.. కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా
ఈ నేపథ్యంలో సంజయ్ గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు ఆయన తాత, విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్. సంజయ్ త్వరలోనే ఇండస్ట్రీకి రాబోతున్నాడని ఆయన వెల్లడించాడు. అయితే హీరోగానో, నటుడిగానో కాదట. తెర వెనక ఉండి యాక్షన్ చెపుతాడట. అవును మీరు విన్నది నిజమే సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తాడట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయన తాత చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ తమిళ మీడియాతో ముచ్చటించిన ఆయన సంజయ్ ఎంట్రీపై స్పందించాడు.
చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్!
ప్రస్తుతం సంజయ్ విదేశాల్లో దర్శకత్వానికి సంబంధించిన పలు టెక్కికల్ కోర్సులు చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. ‘విజయ్ తనయుడు సంజయ్‌కి దర్శకత్వంపైనే ఆసక్తి ఎక్కువ. తాను డైరెక్టర్ అవుతానంటున్నాడు. అందుకే విదేశాల్లో దర్శకత్వానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటున్నాడు. అయితే తను డైరెక్టర్ అయ్యాక మొదట డైరెక్ట్ చేసేది విజయ్ సేతుపతిని. మొదట విజయ్ సేతుపతితో సినిమా తెరకెక్కిస్తానని, ఆ తర్వాత నాన్న(దళపతి విజయ్) సినిమా తీస్తాను’ అని నాతో చెప్పాడు. ఇది తెలిసి విజయ్ ఫ్యాన్స్ సంజయ్ త్వరలోనే యాక్షన్ చెప్పనున్నాడంటూ మురిసిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment