గుర్తుతెలియని ఇద్దరు యువకులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కుమారుడు
హైదరాబాద్: గుర్తుతెలియని ఇద్దరు యువకులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నంబర్-12 లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే సంజయ్ సోమవారం రాత్రి 11:30 సమయంలో తన స్నేహితుడు వినోద్‌తో కలసి కారులో వెళుతున్నాడు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆయన కారును ఆపి జేబులో ఉన్న గన్‌ను తీయబోయారు.
దీన్ని గ్రహించిన సంజయ్ వెంటనే కారును ముందుకు పోనివ్వాలని తన డ్రైవర్‌ను ఆదేశిం చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తనఇంటిముందు కూడా వారు అలాగే ఉండడం గమనించిన సంజయ్ తన స్నేహితుడితో కలసి వారిద్దర్ని గట్టిగా నిలదీశారు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. తనపై హత్యాయత్నాకి పాల్పడినవారిని గుర్తించి విచారణ జరపాలంటూ మంగళవారం సంజయ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.