హారర్ నేపథ్యంలో తెరియుం ఆనా తెరియాదు
హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం తెరియుం ఆనా తెరియాదు. మున్‌దినం పార్తేన్, టూ, ఎప్పోదుమ్ వెండ్రాన్ చిత్రాల ఫేమ్ సంజయ్
హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం తెరియుం ఆనా తెరియాదు. మున్‌దినం పార్తేన్, టూ, ఎప్పోదుమ్ వెండ్రాన్ చిత్రాల ఫేమ్ సంజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నవ నటి దివ్యానాయర్ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో కేఎన్.రాజేశ్, శ్యామ్స్, పిచ్చైక్కారన్ మూర్తి, పయిల్‌వాన్ రంగనాథన్ తదితరులు నటిస్తున్నారు. ఆర్‌ఎస్.విన్నర్ ప్రొడక్షన్‌స పతాకంపై కేఎస్ రాజేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్రిష్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది హారర్, థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు.
ఒక టీవీ ఛానల్‌లో పని చేసే కపిలన్ అనే యువకుడు అక్కడి సమస్యలకు అశాంతికి గురై ప్రశాంతత కోసం తన స్నేహితులతో కలిసి ఒక కొండ ప్రాంతానికి వెళ్లతారన్నారు. అక్కడ మన మూలికలతో తయారు చేసిన మద్యం తాగి ఆ బోధలో గొడవ పడి కొట్టుకుంటారన్నారు. ఆ గొడవలో కపిలన్ మరణిస్తారని, దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర మిత్ర బృందం ఆ శవాన్ని అక్కడే వదిలేసి కొండ కిందికి దిగి రాగా అప్పుడు కపిలన్ నుంచి ఫోన్ వస్తుందన్నారు.
దీంతో తన స్నేహితుడు బతికే ఉన్నాడని, తను ప్రాణాపాయంలో ఉండి ఉంటాడని, వెంటనే అందరు అతని దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా పలు అవరోధాలు ఏర్పడుతాయన్నారు. వాటిని అధిగమించి కపిలన్ ఉన్న ప్రాంతానికి వెళ్లగా అక్కడ వారికి మరో షాక్ తగులుతుందన్నారు. అదేమిటన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తెరియుం ఆనా తెరియాదు అని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను కేరళ, మున్నార్, కాందలూర్, అదిరపల్లి అడవి ప్రాంతాలతో పాటు చెన్నైలోని పలు ప్రాంతాలలో నిర్వహించచినట్లు తెలిపారు.