తల్లి, ముగ్గురు కుమారుల హత్య | mother and three sons murdered | Sakshi
Sakshi News home page

తల్లి, ముగ్గురు కుమారుల హత్య

Published Tue, Jul 31 2018 2:22 AM | Last Updated on Tue, Jul 31 2018 2:22 AM

mother and three sons murdered  - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్యానికి బానిసైన భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ తన ముగ్గురు కుమారులతో సహా హత్యకు గురైంది. తల్లీ, కుమారుల నోళ్లకు గుడ్డ కట్టి, నడుముకు రాయి కట్టి బావిలో పడేసి హతమార్చారు. ఈ దారుణం తమిళనాడు ధర్మపురి జిల్లాలో సోమ వారం వెలుగులోకి వచ్చింది. కారిమంగళానికి చెందిన కూలీ కార్మికుడు లోకనాథన్, నిత్య(30) దంపతులకు పూవరసన్‌ (12), సంజయ్‌(8), నిర్మల్‌(6) అనే ముగ్గురు కుమారులున్నారు.

లోకనాథన్‌ రోజూ తాగొచ్చి భార్యను వేధించే వాడు. దీంతో భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ వాగ్వాదాలు చోటు చేసుకునేవి. అతని తల్లి సైతం నిత్యను వేధించేది. ఈ క్రమంలో లోకనా థన్‌ ఇల్లు రెండు రోజులుగా మూసి ఉండటంతో తల్లీపిల్లలు ఏమయ్యారని ఇరుగుపొరుగు వారు ఆరాతీ శారు. సోమవారం ఉదయం లోకనాథన్‌ ఇంటికి సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో స్థానికులు ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తిం చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇద్దరు పిల్లల నోళ్లను గట్టిగా గుడ్డతో బిగించి ఉన్నారు. అదే బావిలో గాలించగా నీటి అడుగు భాగంలో తల్లి, మరో బిడ్డ నోళ్లకు గుడ్డ బిగించి, నడుముకు రాయి కట్టిన స్థితిలో మృతదేహాలు లభ్యమ య్యాయి. మద్యం తాగొద్దన్నందుకు ఆగ్రహిం చిన లోకనాథనే భార్య, బిడ్డలను హతమార్చి ఉంటాడని అనుమానిస్తూ అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement