Lokanathan
-
తల్లి, ముగ్గురు కుమారుల హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్యానికి బానిసైన భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ తన ముగ్గురు కుమారులతో సహా హత్యకు గురైంది. తల్లీ, కుమారుల నోళ్లకు గుడ్డ కట్టి, నడుముకు రాయి కట్టి బావిలో పడేసి హతమార్చారు. ఈ దారుణం తమిళనాడు ధర్మపురి జిల్లాలో సోమ వారం వెలుగులోకి వచ్చింది. కారిమంగళానికి చెందిన కూలీ కార్మికుడు లోకనాథన్, నిత్య(30) దంపతులకు పూవరసన్ (12), సంజయ్(8), నిర్మల్(6) అనే ముగ్గురు కుమారులున్నారు. లోకనాథన్ రోజూ తాగొచ్చి భార్యను వేధించే వాడు. దీంతో భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ వాగ్వాదాలు చోటు చేసుకునేవి. అతని తల్లి సైతం నిత్యను వేధించేది. ఈ క్రమంలో లోకనా థన్ ఇల్లు రెండు రోజులుగా మూసి ఉండటంతో తల్లీపిల్లలు ఏమయ్యారని ఇరుగుపొరుగు వారు ఆరాతీ శారు. సోమవారం ఉదయం లోకనాథన్ ఇంటికి సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో స్థానికులు ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తిం చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లల నోళ్లను గట్టిగా గుడ్డతో బిగించి ఉన్నారు. అదే బావిలో గాలించగా నీటి అడుగు భాగంలో తల్లి, మరో బిడ్డ నోళ్లకు గుడ్డ బిగించి, నడుముకు రాయి కట్టిన స్థితిలో మృతదేహాలు లభ్యమ య్యాయి. మద్యం తాగొద్దన్నందుకు ఆగ్రహిం చిన లోకనాథనే భార్య, బిడ్డలను హతమార్చి ఉంటాడని అనుమానిస్తూ అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రేమించలేదని కడతేర్చాడు
సేలం: తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని నాలుగేళ్లుగా వెంటబ డ్డాడు.. చివరకు ఉన్మాదిగా మారా డు. తాను ప్రేమించిన బాలికను అతి కిరాతకంగా కడతేర్చాడు. సేలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సేలం జిల్లా వీరపాండికి చెందిన రవి కుమార్తె తారణి(17) స్థానికంగా ఓ పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్ముగం కుటుంబం రవికి దూరపు చుట్టం. ఆర్ముగం కుమారుడు లోకనాథన్(22) చేనేత కార్మికుడు. దూరపు చుట్టం కావడంతో తరచూ రవి ఇంటికి వచ్చి వెళ్లే వాడు. ఈ పరిస్థితుల్లో తారణి మీద లోకనాథన్ మనస్సు పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించాడు. ఈ విషయాన్ని తండ్రి ఆర్ముగం, తల్లి మణి మేఘలై దృష్టికి తీసుకెళ్లాడు. నాలుగేళ్ల క్రితం తల్లిదండ్రుల్ని వెంట బెట్టుకుని రవి వద్ద తారణిని ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం మాట్లాడేందుకు యత్నించాడు. ఇందుకు రవి నిరాకరించాడు. తన కుమార్తె చదువుకోవాలని చెప్పాడు. అప్పటి నుంచి తనను ప్రేమించాలని లోకనాథన్ తారణి వెంట బడడం మొదలెట్టాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా వెంటపడేవాడు. అయితే లోకనాథన్‌ను తారణి పట్టించుకునేది కాదు. నాలుగేళ్లుగా ఒన్ సైడ్ ప్రేమలో మునిగి ఉన్న లోకనాథన్లోని ఉన్మాది బయటకు వచ్చాడు. నాలుగు నెలల క్రితం తార ణిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని రవి మీద ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు తారణితో పాటుగా రవి సైతం నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన లోకనాథన్ రవిని చితకొట్టి ఉడాయించాడు. దూరపు చుట్టం అన్న ఒక్క కారణంతో లోకనాథన్పై ఎలాంటి కేసు పెట్టకుండా రవి క్షమించి వదలి పెట్టాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతున్న తారణిని లోకనాథన్ అడ్డగించాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ప్రాథేయ పడ్డాడు. ఇందుకు తారణి నిరాకరించింది. చీవాట్లు పెట్టింది. అతడ్ని తప్పించుకుని ఇంటి వైపుగా వెళ్లేందుకు యత్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన లోకనాథన్ ఉన్మాదిగా మారాడు. తన చేతిలో ఉన్న కత్తితో తారణి శరీరంపై 11 చోట్ల విచక్షణ రహితంగా పొడిచాడు. సంఘటన స్థలంలో రక్తపు మడుగులో తారణి కుప్పకూలింది. అదే సమయంలో అటు వైపుగా లోకనాథన్ తల్లి మణి మేఘలై రావడం, తనయుడు ఉన్మాది చర్యను గుర్తించి అడ్డుకునే యత్నం చేసింది. అప్పటికే లోకనాథన్ ఉడాయించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తారణిని స్థానికుల సాయంతో మణి మేఘల ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే తారణి ప్రేమోన్మాది ఘాతుకానికి నేల రాలింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనతో వీరపాండి గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లేందుకు యత్నించిన లోకనాథన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశా రు. తారణి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం కుటుం బీకులకు అప్పగించారు. దూరపు చుట్టం అన్న విషయాన్ని పక్కన పెట్టి తన మీద దాడి చేసినప్పుడే లోకనాథన్‌ను పోలీసులకు పట్టించి ఉంటే, తన కుమార్తె బలి అయ్యేది కాదని తండ్రి రవి కన్నీరుమున్నీరయ్యాడు. -
ఉత్కంఠగా గుండె మార్పిడి
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో సోమవారం సాయంత్రం కాసేపు ఉత్కంఠ భరిత వాతావరణం నెల కొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమ బిడ్డ హృదయాన్ని ఓ దంపతులు దానం చేశారు. మరో యువతికి దాన్ని అమర్చడం లక్ష్యంగా అంబులెన్స్‌లో బయలుదేరిన ఆ హృదయం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని 13 నిమిషాల్లో చేరింది. అవయవదానాల మీద ఇటీవల రాష్ట్రంలో అవగాహన పెరుగుతోంది. ప్రమాదం బారిన పడ్డ తమ వారి అవయవాలను మరొకరికి దానం చేస్తున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. ఆ కోవలో కాంచీపురం జిల్లా మదురాం తకం సమీపంలో ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకనాథన్(27)గాయపడ్డారు. తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లాడు. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న తమ బిడ్డ బతకడం అనుమానం కావడంతో అతడి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు యోగీశ్వర న్, రాజ్యలక్ష్మి నిర్ణయించారు. అదే సమయంలో అడయార్‌లోని ఓ ఆస్పత్రిలో హృదయ మార్పిడి కోసం ముంబైకు చెందిన ఓ యువతి హోబి(21) ఎదురు చూస్తుండడంతో లోకనాథన్ హృదయా న్ని ఆమెకు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఉత్కంఠ: సోమవారం సాయంత్రం లోకనాథన్ శరీరానికి పోస్టుమార్టం ఆరంభం అయింది. అతడి అవయవాలను బయటకు తీసి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచారు. అతడి హృదయాన్ని అడయార్‌లోని మలర్ ఆస్పత్రిలో ఉన్న ఆ యువతికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. హృదయాన్ని సకాలంలో ఆ ఆస్పత్రికి చేర్చడం లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెంట్రల్ సమీపంలోని జీహెచ్ నుంచి ఎంఎంసీ, మెరీనా తీరం మీదుగా పట్టిన వాక్కం, ఎంఆర్ సీ నగర్ సిగ్నల్ గుండా అడయార్‌లోని ఆస్పత్రికి తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆ మార్గాల్లో ఆగమేఘాలపై ట్రాఫిక్ మార్పులు చేశారు. పది నిమిషాల్లో ఆ హృదయాన్ని అడయార్‌కు తరలించే విధంగా రెడీ అయ్యారు. జీహెచ్ నుంచి లోకనాథన్ హృదయం తో అంబులెన్స్ బయలుదేరేందుకు పది నిమిషాల ముందుగా ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. సినీ ఫక్కీలో తీవ్ర ఉత్కంఠ నడుమ సరిగ్గా పదమూడు నిమిషాల్లో అడయా ర్ ఆస్పత్రికి ఆ హృదయాన్ని చేర్చారు. అప్పటికే హోబీకి శస్త్ర చికిత్స ఏర్పాట్లు చేసి ఉండడంతో, హృదయం రాగానే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఇద్ద రు సీనియర్ శస్త్ర చికిత్సా నిపుణుల పర్యవేక్షణలో హోబీకి లోకనాథన్ గుండెను అమర్చే హృదయ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతోంది. ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావాలన్న కాంక్షతో సర్వత్రా ఎదురు చూస్తున్నారు.