మరో సీనియర్‌ నేతను సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్‌ | Sanjay Jha Suspended By Congress | Sakshi
Sakshi News home page

మరో సీనియర్‌ నేతను సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్‌

Published Wed, Jul 15 2020 11:21 AM | Last Updated on Wed, Jul 15 2020 1:22 PM

Sanjay Jha Suspended By Congress - Sakshi

న్యూఢిల్లీ : పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సీనియర్‌ నాయకుడిని కాంగ్రెస్‌ బహిష్కరించింది.  పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు సంజయ్‌ ఝాను సస్పెండ్‌ చేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర యూనిట్‌ చీఫ్‌ బాలాసాహెబ్‌ తోరత్‌ సంజయ్‌కు మంగళవారం నోటీసులు జారీ చేశారు. కాగా కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝా.. పార్టీని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను పార్టీ ప్రతినిధి పదవీ నుంచి ఇటీవల అధిష్ఠానం తొలగించిన విషయం తెలిసిందే. (పైలట్‌పై వేటు)

అయితే తాజాగా గుజరాత్‌ రాజకీయాలపై స్పందించిన సంజయ్,‌ సచిన్‌ పైలట్‌ను సమర్ధిస్తూ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 2013 నుంచి 2018 వరకు పార్టీ కోసం సచిన్‌ పైలట్‌ తన రక్తం ధారపోసి, చెమట చిందించి పనిచేశారని, 21 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ను 100 సీట్లకు పెంచిన కృషి సచిన్‌దేనని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ అతనిపై వేటు వేసిన కొన్ని గంట్లోలనే సచిన్‌కు మద్దతు తెలిపిన సంజయ్‌ ఝాను సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ మంగళవారం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. (‘ప్రభుత్వాన్ని వ్యాపారంలా నడిపారు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement