saspended
-
మరో సీనియర్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు సంజయ్ ఝాను సస్పెండ్ చేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ బాలాసాహెబ్ తోరత్ సంజయ్‌కు మంగళవారం నోటీసులు జారీ చేశారు. కాగా కాంగ్రెస్ నేత సంజయ్ ఝా.. పార్టీని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను పార్టీ ప్రతినిధి పదవీ నుంచి ఇటీవల అధిష్ఠానం తొలగించిన విషయం తెలిసిందే. (పైలట్‌పై వేటు) అయితే తాజాగా గుజరాత్ రాజకీయాలపై స్పందించిన సంజయ్, సచిన్ పైలట్‌ను సమర్ధిస్తూ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 2013 నుంచి 2018 వరకు పార్టీ కోసం సచిన్ పైలట్ తన రక్తం ధారపోసి, చెమట చిందించి పనిచేశారని, 21 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ను 100 సీట్లకు పెంచిన కృషి సచిన్‌దేనని అన్నారు. దీంతో కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ అతనిపై వేటు వేసిన కొన్ని గంట్లోలనే సచిన్‌కు మద్దతు తెలిపిన సంజయ్ ఝాను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. (‘ప్రభుత్వాన్ని వ్యాపారంలా నడిపారు’) Shri Sanjay Jha has been suspended from the Congress Party with immediate effect for anti-party activities and breach of discipline. pic.twitter.com/TaT0gWbCc7 — Maharashtra Congress (@INCMaharashtra) July 14, 2020 -
జెడ్పీ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురిపై చర్యలు తీసుకున్న సీఈఓ ఖమ్మం : జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్ సీఈఓ మారుపాక నాగేశ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత నెల 16న జరిగిన స్టాడింగ్ కమిటీ సమావేశం మినిట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. తీరు మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా..మార్పు రాకపోవడంతో..ఇలా వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో సూపరింటెండెంట్ విజయలక్ష్మి, నలుగరు సీనియర్ అసిస్టెంట్లు రత్నాకర్, శ్రీకృష్ణ, నాగేశ్వరరావు, ఉదయ్‌శ్రీ, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు వంశీ, చారి ఉన్నారు. జిల్లా పరిషత్ చర్రితలో సీఈఓ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.