జెడ్పీ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు | zp employees saspended | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

Published Wed, Aug 3 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

జెడ్పీ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

జెడ్పీ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

  • విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన
  • ఏడుగురిపై చర్యలు తీసుకున్న సీఈఓ
  • ఖమ్మం : జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పని చేస్తున్న ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ జిల్లా పరిషత్‌ సీఈఓ మారుపాక నాగేశ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

    గత నెల 16న జరిగిన స్టాడింగ్‌ కమిటీ సమావేశం మినిట్స్‌ ఇవ్వకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. తీరు మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా..మార్పు రాకపోవడంతో..ఇలా వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి, నలుగరు సీనియర్‌ అసిస్టెంట్లు రత్నాకర్, శ్రీకృష్ణ, నాగేశ్వరరావు, ఉదయ్‌శ్రీ, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు వంశీ, చారి ఉన్నారు. జిల్లా పరిషత్‌ చర్రితలో సీఈఓ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement