ఢిల్లీ: బీజేపీ తనను టార్గెట్ చేసి మరీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున కృష్ణానగర్ సెగ్మెంట్‌లో పోటీ చేసిన మొయిత్రా.. బీజేపీ అభ్యర్థినిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలుపొందిన అనంతరం ఆమె తొలిసారి ఓ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను సిస్టరెక్టమీ (ఆపరేషన్ ద్వారా గర్భసంచి తొలగింపు) సర్జరీ చేసుకున్నాను. అప్పటికి నేను సర్జరీ చేసుకొని కేవలం ఎనిమిది రోజులు అవుతోంది. ఆ సమయంలో నాకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. అలాంటి సయయంలో కూడా నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు’’ అని మొయిత్రా చెప్పుకొచ్చారు.
Total Hysterectomy is a surgical removal of entire female reproductive system.@MahuaMoitra had undergone this surgery & 8 days after that she was asked to vacate residence OR face force
She's saying this publicly after defeating BJP with a huge margin, NOT BEFORE: Strong Woman pic.twitter.com/HzWlEq26v9— Dr Ranjan (@AAPforNewIndia) June 12, 2024
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన మహువా మొయిత్రా.. బీజేపీ అభ్యర్థిని అమిత్ రాయ్‌పై 56705 ఓట్లు మేజార్టితో గెలుపొందారు. బీజేపీతో తాను ఎదుర్కొన్న కష్టాలను సంబంధించి మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగిన కేసులో మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని గతేడాది డిసెంబర్ 8న లోక్‌సభ స్పీకర్ రద్దు చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ దోషిగా తేలుస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో స్పీకర్ ఆమెపై వేటు వేశారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటంపై టీఎంసీతో సహా విపక్షాలు తీవ్రంగా ఖండించాయి.
ఎంపీ సభ్యత్వం రద్దు అయిన వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. ఆమెకు కేయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చారు. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. అనంతరం మొయిత్రాను ప్రభుత్వ బంగ్లాను నుంచి ఖాళీ చేయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment