West Bengal girls
-
బీజేపీతో ఇబ్బందులకు గురయ్యా: మహువా మొయిత్రా
ఢిల్లీ: బీజేపీ తనను టార్గెట్ చేసి మరీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున కృష్ణానగర్ సెగ్మెంట్లో పోటీ చేసిన మొయిత్రా.. బీజేపీ అభ్యర్థినిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలుపొందిన అనంతరం ఆమె తొలిసారి ఓ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను సిస్టరెక్టమీ (ఆపరేషన్ ద్వారా గర్భసంచి తొలగింపు) సర్జరీ చేసుకున్నాను. అప్పటికి నేను సర్జరీ చేసుకొని కేవలం ఎనిమిది రోజులు అవుతోంది. ఆ సమయంలో నాకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. అలాంటి సయయంలో కూడా నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు’’ అని మొయిత్రా చెప్పుకొచ్చారు.Total Hysterectomy is a surgical removal of entire female reproductive system.@MahuaMoitra had undergone this surgery & 8 days after that she was asked to vacate residence OR face forceShe's saying this publicly after defeating BJP with a huge margin, NOT BEFORE: Strong Woman pic.twitter.com/HzWlEq26v9— Dr Ranjan (@AAPforNewIndia) June 12, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన మహువా మొయిత్రా.. బీజేపీ అభ్యర్థిని అమిత్ రాయ్‌పై 56705 ఓట్లు మేజార్టితో గెలుపొందారు. బీజేపీతో తాను ఎదుర్కొన్న కష్టాలను సంబంధించి మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగిన కేసులో మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని గతేడాది డిసెంబర్ 8న లోక్‌సభ స్పీకర్ రద్దు చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ దోషిగా తేలుస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో స్పీకర్ ఆమెపై వేటు వేశారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటంపై టీఎంసీతో సహా విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎంపీ సభ్యత్వం రద్దు అయిన వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. ఆమెకు కేయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చారు. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. అనంతరం మొయిత్రాను ప్రభుత్వ బంగ్లాను నుంచి ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. -
Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు
ఉదయం అమ్మకు ఇంట్లో టాటా చెప్పి, బడిలో పాఠాలు వింటూ.. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి తనకు తెలియని చీకటి లోకంలో ఉంటే ఎంత భయం... చుట్టూ ఏం జరుగుతోందో... తనకేం జరిగిందో తనకే సరిగా తెలియని ఆ ‘చీకటి లోకం’లో తెగువ చూపి, అది మిగిల్చిన చేదు సంఘటనల నుంచి బయటపడి ఇంటికి వచ్చేసింది 14 ఏళ్ల ఆ అమ్మాయి. ఊళ్లో అంతా విచిత్రంగా చూశారు ఆమెను. ‘బిజినెస్ గర్ల్’ అని అంతా అంటుంటే కుంగిపోయింది. కానీ, అదే అమ్మాయి 21 ఏళ్ల వయసు వచ్చేనాటికి మానవ అక్రమ రవాణాకు గురైన బాలికల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది. ఆమె పేరు పీహూ మోండల్. పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామం. ‘హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన ఆడపిల్లల బాధను పంచుకుని, వారిని నరకపు నీడ నుంచి బయటికి తీసుకొచ్చి, వెలుగు చూపగలిగినప్పుడు ఇంకా నా గుర్తింపును నేను ఎందుకు దాచుకోవాలి?!’ అని ప్రశ్నిస్తున్న ఈ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ‘‘మేడమ్ సాహెబ్’ కావాలని నా చిన్ననాటి నుంచి నాతో పెరిగిన కల. పరగాణాలోని చిన్నూరు మాది. మా నాన్న రోజు కూలీ. అమ్మ గృహిణి. మాకంటూ సెంటు భూమి లేదు. ఉన్నదల్లా తలదాచుకునేందుకు చిన్న ఇల్లు. మా ఊళ్లో ఆడపిల్లలు చదువుకోవడానికి బడికి వెళ్లరు. కానీ, నాకు చదువుకోవాలని ఉండేది. నేను మేడమ్ సాహెబ్‌గా ఎదగాలని కలలు కంటూ, పుస్తకాలనే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఇదే విషయాన్ని మా అమ్మానాన్నలతో చెబితే వాళ్లూ ‘సరే’ అన్నారు. ఊళ్లో చాలా మంది వ్యతిరేకించారు అమ్మాయిలకు చదువెందుకని. కానీ, వాళ్లతో గొడవపడి మరీ నన్ను స్కూల్లో చేర్పించారు నాన్న. నాకు చదువు మీద ఉన్న ఇష్టం చూసి, ఇంటి పనిలో కూడా సాయం చేయమని అడిగేది కాదు అమ్మ. అప్పుడప్పుడు మా ఊరి వాళ్లు కొందరు వెక్కిరించినా వాటిని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. నొప్పి ఉంది, ప్రాణం లేదు పద్నాలుగేళ్ల వయసు. పదవతరగతిలోకి అడుగు పెట్టాను. నేనూ, మా స్నేహితురాలు కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాము. చాలా ఎండ, గొంతెండుకుపోతోంది. దారిలో ఒకరి దగ్గర నీళ్లు ఉంటే అడిగి, తీసుకొని తాగాం. ఆ తర్వాత ఇంటివైపు బయల్దేరాం. కొంచెం దూరం నడిచాక అడుగులు తడబడటం మొదలెట్టాయి. తల అంతా తిరుగుతున్నట్టు అనిపించింది... కళ్లు తెరిచి చూసేసరికి నేనూ, నా ఫ్రెండ్ రైలులో ఉన్నాం. ఒళ్లంతా విపరీతమైన నొప్పి. కూర్చోవడానికి ఒళ్లు సహకరించడం లేదు. మా దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మా పరిస్థితి చూశాక మేమెలాంటి దారుణానికి గురయ్యామో కొంత మేరకు అర్థమయ్యింది. అక్కడ మమ్మల్ని ఇంకెవరికో అమ్మేందుకు తీసుకువెళుతున్నారని, ఇప్పటికే రెండుసార్లు అమ్ముడు పోయామన్న మాటలు విన్నాం. ఒకరినొకరం చూసుకున్నాం. చైన్ లాగితే రైలు ఆగింది. వెంటనే, రైల్వే పోలీసులు వచ్చారు. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి మానవ అక్రమరవాణాపై వర్క్‌షాప్‌కి హాజరయ్యాం. అందుకే, మాకు వెంటనే రైలును ఆపాలనే ఆలోచన వచ్చింది. విచారణ తర్వాత మేం ఇంటికి వచ్చాం. అవగాహనే ప్రధానం ఇవన్నీ మా ఇంట్లో... నా ఒంట్లో ఒకలాంటి నిస్తేజాన్ని నింపాయి. దాంతో డిప్రెషన్లోకి వెళ్లాను. నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తిరిగి స్కూల్‌కి వెళ్లి, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని నిరూపించాను. దీని తర్వాత బంధన్ ముక్తి, ఇల్ఫత్లో చేరాను. అక్కడ, మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, అత్యాచార ఘటనలలో ప్రాణాలతో బయటపడిన అమ్మాయిలను చాలా దారుణమైన స్థితిలో చూశాను. వారి గురించి ఆలోచిస్తే నా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. నేను తప్పించుకున్నది అదృష్టంగా భావించాను. నాలా మరే ఆడపిల్లా ఆ నరకంలోకి చిక్కుకోకుండా ఉండేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి మానవ అక్రమ రవాణా గురించి బాలికలకు అవగాహన కల్పిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా ఏ అమ్మాయీ మానవ అక్రమ రవాణాకు గురికాకూడదు. ఇదే ఆలోచనతో నా లక్ష్యం వైపుగా సాగుతున్నాను. సంస్కృతం ప్రధాన సబ్జెక్ట్‌గా బి.ఎ. పూర్తిచేశాను. ఇప్పుడు ఎం.ఎ. చేయాలనుకుంటున్నాను. సొంతంగా హ్యాండ్‌మేడ్ ఆభరణాలను తయారు చేస్తుంటాను. పెయింటింగ్స్ వేస్తుంటాను. పర్వతారోహణ చేయాలన్నది నా మరో కల. ఎల్తైన శిఖరం అంచున నిలబడి, చేతులు చాచి అక్కడి గాలిని ఆస్వాదించాలి. అందుకు కూడా అడుగులు వేస్తున్నాను’’ అని చెబుతున్న రేపటి ఈ ఆశాజ్యోతి ఆశయాలు నెరవేరాలని ఆశిద్దాం. అంతటా దూరం దూరం.. స్కూల్‌కు రావద్దని అక్కడి టీచర్లు చెప్పేశారు. ఏడుస్తూ ఇంటికి వస్తే మా అమ్మానాన్నలు దీనస్థితిలో ఉన్నారు. ఊళ్లో అంతా ‘చదువుకునే అమ్మాయిలు పారిపోతారు’ అంటూ మమ్మల్ని నీచ పదాలతో తిట్టారు. కలెక్టివ్ గ్రూప్ సాయంతో స్కూల్లో చదువుకోవడానికి అనుమతి లభించింది. అయితే, అక్కడి టీచర్లు మాతో సరిగా ప్రవర్తించలేదు. ఇతర పిల్లలతో కలిసి కూర్చోనివ్వలేదు. మొదటి సీట్లో కూర్చొనేదాన్ని, చివర సీట్లోకి పంపించారు. ఇక ఇతర పిల్లల తల్లిదండ్రులు ‘మా అబ్బాయిలకు దూరంగా ఉండాలి. అయినా, చదువుకుని ఏం చేస్తావు, చేసేది అదే వ్యాపారం కదా!’ అని హేళనగా మాట్లాడేవారు. -
క్వారంటైన్ సెంటర్‌గా మార్చొద్దంటూ దాడి!
అసనసోల్(పశ్చిమబెంగాల్) : ప్రజల ప్రాణాలకోసం వైద్యసిబ్బంది, పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నా అవేమి పట్టని కొంతమంది వాళ్లపైనే తిరగబడి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని పోచారులియా ప్రాంతంలో స్థానికుల దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని క్వారంటైన్‌గా మార్చాలన్న సూచన మేరకు తనిఖీల కోసం ఆ ప్రాంతాన్ని వైద్యాధికారులు సందర్శించారు. అయితే ఆ ఆరోగ్య కేంద్రాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చొద్దంటూ కొన్ని అల్లరి మూకలు అడ్డుకున్నాయి. సదరు అధికారులపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. కాగా, ఈ క్రమంలోనే ఆ నిరసన కారులు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని సీనియర్ అధికారి తెలిపారు. కొంతమంది స్థానికులకు కూడా స్వల్ప గాయాలు అయినట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దీని వెనుక ఉన్న కుట్రదారులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా బర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్ ప్రాంతంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదుకావడంతో ఈ ప్రాంతాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మర్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
బాలికల అక్రమ రవాణా కట్టడికి పట్టం
జాతీయ సాహస పురస్కారాల ప్రకటన న్యూఢిల్లీ: 2017వ సంవత్సరానికి జాతీయ సాహస పురస్కారాలను ప్రకటించారు. బాలికల అక్రమ రవాణాను అరికట్టేందుకు సహాయం చేసిన పశ్చిమ బెంగాల్ అమ్మాయిలు తేజస్వితా (18), శివాని(17)లు ఈ ఏడాదికి గీతా చోప్రా అవార్డును అందుకోనున్నారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో పచిన్ నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను కాపాడుతుండగా మరణించిన తార్హ్ పీజుకు భారత్ అవార్డు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో తన సోదరుడిని కాపాడేందుకు చిరుతపులితో పోరాడిన సుమిత్‌కు సంజయ్ చోప్రా పురస్కారం ప్రదానం చేయనున్నారు. మొత్తం 25 మంది పిల్లల(13 మంది బాలురు, 12 మంది బాలికలు)ను ఈ ఏడాది సాహస పురస్కారాలకు ఎంపిక చేశారు. జనవరి 23న వీరంతా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు.