
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా ఆర్జీకర్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో అప్పీల్‌ను కోల్‌కతా హైకోర్టు బుధవారం(జనవరి22) విచారించింది. బెంగాల్ ప్రభుత్వం వేసిన ఈ అప్పీల్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషి సంజయ్‌రాయ్ శిక్షపై అందరి వాదనలు విన్నాకే అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.
సంజయ్‌రాయ్‌కి శిక్ష సరిపోదని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ, బాధితురాలి కుటుంబం, దోషి వాదనలు విన్న తర్వాతనే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సోమవారం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
అయితే ఈ కేసులో అప్పీల్ వేసే అధికారం తమకే ఉందని, బెంగాల్ ప్రభుత్వానికి లేదని సీబీఐ హైకోర్టుకు తెలపడం గమనార్హం. ఈ విషయంలోనూ హైకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరోవైపు సంజయ్‌రాయ్ శిక్షపై ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు బుధవారమే విచారించనుంది.
సంజయ్‌రాయ్‌కి జీవిత ఖైదు మాత్రమే విధించడంపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో కోల్‌కతాలో మళ్లీ ఆందోళనలు జరుగుతున్నాయి. రాయ్‌కి మరణశిక్ష విధించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
ఇదీ చదవండి: ఆర్జీకర్ కేసుపై ‘సుప్రీం’లో నేడు విచారణ
Comments
Please login to add a commentAdd a comment