హిందూవుల అత్యంత పవర్‌ఫుల్ దేవత కాళీమాత. ఆమె పూజ విధానం, ఆచారా వ్యవహారాలు అత్యంత విభిన్నంగా ఉంటాయి. అలాంటి శక్తిమంతమైన దేవత కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెట్టడం గురించి విన్నారా..? అది కూడా శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతున్న కోల్‌కతాలోనే ఓ మామూల ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉంది. అయితే ఆ దేవతను ఎవరూ కొలుస్తున్నారో వింటే ఆశ్చర్యపోతారు.
కలకత్తాలోని చైనీస్ టౌన్‌గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో ఈ కాళిమాత ఆలయం ఉంది. రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టు వద్ద ఉంది. ఈ అమ్మవారిని తొలుత స్థానిక హిందువులు పూజించేవారు. ఆ తర్వాత అక్కడే నివశించే చైనా కమ్యూనిటీవారిచే పూజలు అందుకోవడమే గాక వారే ఆ చెట్టు వద్ద చిన్నగా ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి వారి ఆచార వ్యవహారంలో నిర్మించారు.
అలా క్రమంగా ఆ ఆలయం పేరు చైనీస్ కాళీమందిరంగా ఏర్పడింది. ఈ గుడికి సంబంధించి ఓ ఆసక్తికర కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే..ఒక చైనీస బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యలు అతడిపై ఆశ వదిలేసుకోవాలని చెప్పడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఈ కాళీ మందిరానికి తీసుకువచ్చి..భక్తితో పూజించడం ప్రారంభించారు. అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే ఆ బాలుడు కోలుకోవటం ప్రారంభించాడు. అప్పటి నుంచి అక్కడ ఉండే చైనా వాళ్లే ఈ అమ్మవారిని భక్తిగా కొలవడం ప్రారంభించారు.
ఈ ఆలయ బాగోగులు చూసుకునేది కూడా ఓ చైనీస్ వ్యక్తే. అతడు తనను తాను చైనీస్ హిందువుగా పేర్కొనడం వివేషం. అంతేగాదు ఈ చైనీస్ కాళీ మందిరంలో అమ్మవారికి న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెడతారట. దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారట. ఇలా ఎన్నో ఏళ్లుగా న్యూడిల్స్‌నే కాళీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.
ఆ ఆలయం కూడా చైనీస్ డ్రాగన్ పెయింట్‌తో ఉంటుంది. ఆ విగ్రహ వెనకాల ఓం గుర్తుల తోపాటు చైనా మూలాంశాలతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి. ఈ మాతను దర్శించుకునేందుకు సుదూరప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడం విశేషం.
(చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!)
Comments
Please login to add a commentAdd a comment