Kalimata Temple
-
అక్కడ కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్..!
హిందూవుల అత్యంత పవర్ఫుల్ దేవత కాళీమాత. ఆమె పూజ విధానం, ఆచారా వ్యవహారాలు అత్యంత విభిన్నంగా ఉంటాయి. అలాంటి శక్తిమంతమైన దేవత కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెట్టడం గురించి విన్నారా..? అది కూడా శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతున్న కోల్‌కతాలోనే ఓ మామూల ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉంది. అయితే ఆ దేవతను ఎవరూ కొలుస్తున్నారో వింటే ఆశ్చర్యపోతారు.కలకత్తాలోని చైనీస్ టౌన్‌గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో ఈ కాళిమాత ఆలయం ఉంది. రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టు వద్ద ఉంది. ఈ అమ్మవారిని తొలుత స్థానిక హిందువులు పూజించేవారు. ఆ తర్వాత అక్కడే నివశించే చైనా కమ్యూనిటీవారిచే పూజలు అందుకోవడమే గాక వారే ఆ చెట్టు వద్ద చిన్నగా ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి వారి ఆచార వ్యవహారంలో నిర్మించారు. అలా క్రమంగా ఆ ఆలయం పేరు చైనీస్ కాళీమందిరంగా ఏర్పడింది. ఈ గుడికి సంబంధించి ఓ ఆసక్తికర కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే..ఒక చైనీస బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యలు అతడిపై ఆశ వదిలేసుకోవాలని చెప్పడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఈ కాళీ మందిరానికి తీసుకువచ్చి..భక్తితో పూజించడం ప్రారంభించారు. అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే ఆ బాలుడు కోలుకోవటం ప్రారంభించాడు. అప్పటి నుంచి అక్కడ ఉండే చైనా వాళ్లే ఈ అమ్మవారిని భక్తిగా కొలవడం ప్రారంభించారు. ఈ ఆలయ బాగోగులు చూసుకునేది కూడా ఓ చైనీస్ వ్యక్తే. అతడు తనను తాను చైనీస్ హిందువుగా పేర్కొనడం వివేషం. అంతేగాదు ఈ చైనీస్ కాళీ మందిరంలో అమ్మవారికి న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెడతారట. దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారట. ఇలా ఎన్నో ఏళ్లుగా న్యూడిల్స్నే కాళీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆ ఆలయం కూడా చైనీస్ డ్రాగన్ పెయింట్‌తో ఉంటుంది. ఆ విగ్రహ వెనకాల ఓం గుర్తుల తోపాటు చైనా మూలాంశాలతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి. ఈ మాతను దర్శించుకునేందుకు సుదూరప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడం విశేషం. (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!) -
కలకత్తా కాళీ మాత హారతి
-
మూడ నమ్మకంతో తనను తానే బలిచ్చుకున్న యువతి
లక్నో: సాధారణంగా గ్రామ దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ ఓ యువతి ఏకంగా తనను తానే బలిచ్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో కలకలం రేపింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మీరట్ జిల్లా ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం ఎంతో ఇష్టంగా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించేది. భక్తి పారవశ్యంతో కాళీమాత ఆలయానికి ప్రతి రోజూ వెళ్లేది. అయితే ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఆ యువతి తనను తాను కాళీమాత కుమార్తెగా భావించడం మొదలు పెట్టింది. తాను మహా భద్రకాళి కూతురునని అమ్మవారి కోసం తన ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఇదే క్రమంలో ఆ యువతి ఒంటరిగా తెల్లవారు జామున ఆలయానికి వెళ్లింది. అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరు. ప్రతి రోజూ పూజారి కూడా సాయంత్రం వచ్చి అమ్మవారికి పూజ చేసి వెళ్లిపోయేవాడు. అయితే ఆ యువతి చాలాసేపు పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది. తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. అయితే రోజూలానే ఆ రోజు సాయంత్రం ఆలయ పూజారి వచ్చి చూసేసరికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. దీనితో ఆ పూజారి షాక్‌కు గురయ్యాడు. కొంతసేపటికి తేరుకుని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ యువతి మూఢ విశ్వాసాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రామంలోని కొందరు ఆ యువతి మూఢ నమ్మకాల కారణంగానే తనను తాను బలిచ్చుకుందని అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం కుటుంబ సమస్యల వల్లే ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంలోనో అదే రోజు కుటుంబ సభ్యులకు, ఆ యువతికి మధ్య వాగ్వాదం జరిగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆలయానికి వెళ్లి ఉరేసుకుని వుండొచ్చని మరికొందరు అంటున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సెట్.. రీసెట్!
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. కోల్కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు కోల్‌కత్తాలో జరిగింది. అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్‌కు అంతరాయం కలగడంతో హైదరాబాద్ వచ్చేసింది యూనిట్. పైగా లాక్‌డౌన్‌తో కోల్కత్తా వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. దీంతో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ప్రత్యేకంగా ఆరున్నర కోట్లతో కోల్‌కత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులతో సెట్ నిర్మించారు. లాక్డౌన్ ముందు వరకూ ఈ సెట్లో కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ సెట్ దెబ్బతింది. ఇప్పుడు సెట్‌ని పునర్నిర్మించాలంటే దాదాపు రెండు కోట్ల ఖర్చు అవుతుందట. ఇంకొన్ని రోజుల పాటు ఈ సెట్లో చిత్రీకరణ జరగాల్సిన నేపథ్యంలో వేరే దారిలేక సెట్‌ని రీసెట్ చేయాలనుకుంటున్నారు. -
కార్తీక వెన్నెల
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలునిర్వహించారు. ఉదయం నుంచే పాదరసలింగేశ్వరునికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు శివుని దర్శించుకొని అభిషేకాలు చేయించుకున్నారు. భవతారిణీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ ధర్మకర్త సుదీప్త బెనర్జీ భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సిరిపురం : కార్తీక పౌర్ణమి సందర్భంగా సాగరతీరం గురువారం ఆధ్యాత్మిక తరంగాలతో శోభిల్లింది. ఉదయం నుంచే తండోపతండాలుగా భక్తులు బీచ్‌కు తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. అరటి డొప్పల్లో ఒత్తులతో దీపాలు వెలిగించి సముద్రంలో వదిలారు. సూర్య నమస్కారాలు చేసి సకల సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. మరికొందరు ఇసుక తిన్నెలపై శివుని రూపాన్ని తయారు చేసి దానితోపాటు తులసిని నాటి, దాని చుట్టూ ఒత్తులతో కూడిన ప్రమిదలు వెలిగించి కోరిన కోరికలు తీర్చాలని శివుని ప్రార్ధించారు. అనంతరం పిల్లాపాపలతో కలిసి దగ్గర్లో ఉన్న కాళీమాత ఆలయంలో ఉన్న పాదరస శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజస్థానీ, గుజరాతీకి చెందిన భక్తులతోపాటు నగరానికి చెందిన పలువురు మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు. డాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ సత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనానికి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. తెల్లవారుజాము రెండు గంటల నుంచి భక్తులు క్యూలో నిలుచున్నారు. గంటగంటకు భక్తుల సంఖ్య పెరుగుతూనే వచ్చిం ది. కనీస సదుపాయాల్లేక భక్తులు అవస్థలు పడ్డా రు. వాహనాలను అనుమతించకపోవడంతో కేజీ హెచ్ వైపు నుంచి వెళ్లే భక్తులకు మార్చురీ వద్దనే నిలిపి వేశారు. ఏవీఎన్ కళాశాల వైపు వచ్చే భక్తులకు ఆంధ్రా మెడికల్ కళాశాల గేట్ వద్దనే నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర నడచి వెళ్లాల్సివచ్చింది. మెట్ల మార్గం కూలడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో వేలాదిమంది దంపతులు పాల్గొన్నారు.