జీజీహెచ్‌లో దళారి పట్టివేత
జీజీహెచ్‌లో దళారి పట్టివేత
Published Sun, Sep 4 2016 5:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
* రక్త పరీక్షలు బయటకు తరలిస్తున్న వైనం
* ఆస్పత్రి వైద్యులే పిలిచారంటూ రోగుల ఫిర్యాదు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శనివారం రైలుపేటలోని ఓ ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌లో పనిచేసే దళారి రక్తపు శాంపిళ్ళు తీసుకెళ్ళాడు. సదరు పరీక్ష చేసేందుకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవటంతో రోగుల బంధువులకు విషయం తెలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు విచారణ చేసి కొత్తపేట పోలీసులకు దళారిని అప్పగించారు.
పొన్నూరు మండలం జూపూడికి చెందిన ఎం. బాలకోటేశ్వరమ్మ లివర్ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో చేరింది. వ్యాధి నిర్ధారణ కోసం ఆమెకు రక్తపరీక్షలు చేసేందుకు ఇద్దరు హౌస్‌సర్జన్లు రైలుపేట ల్యాబ్‌కు చెందిన దళారి నాగరాజును ఆస్పత్రికి పిలిపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తపరీక్షకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవటంతో రోగి బంధువులకు విషయం చెప్పటంతో వారు అంతమొత్తంలో ఫీజు ఉండదని తెలుసుకుని ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి ఆస్పత్రి సిబ్బందిలాగా వార్డులోకి వచ్చి రోగులతో మాట్లాడి రక్తపు శాంపిళ్ళు బయట ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు తెలిపారు. గత నెలలో కూడా ఇదే తరహాలో ఓ దళారిని రక్తపు శాంపిళ్ళు తీసుకెళ్తున్న సమయంలో సెక్యూరిటి సిబ్బంది పట్టుకోగా వైద్యులు పిలవటం వల్లే తాను వచ్చినట్లు వెల్లడించాడు. దళారీ వ్యవస్థను నిలురించేందుకు ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘనలు తరచుగా జరగటంతోపాటుగా ఆస్పత్రి పరువు బజారున పడే ప్రమాదం ఉంది.
Advertisement