Commission Agent
-
హక్కు అడిగినందుకు వెలి!
పట్టణ మార్కెట్ యార్డు ఆవరణలోని నిమ్మకాయల మార్కెట్లో ఒక రైతుకు చెందిన సరుకును కొనుగోలు చేయకుండా పక్కన పెట్టేశారు. మార్కెట్ లావాదేవీల్లో అనుసరించాల్సిన విధానాలను పాటించేలా చేయాలని వినియోగదారుల ఫోరంకు వెళ్లటమే ఆ రైతు చేసిన తప్పు. అసోసియేషన్ తీర్మానించిందంటూ నిమ్మకాయల కొనుగోలు చేయకుండా తిరస్కరించటంతో ఖిన్నుడైన ఆ రైతుకు యార్డు అధికారులు కూడా అందుబాటులో లేకపోవటం గమనించాల్సిన అంశం. తెనాలి: రూరల్ మండలం సంగంజాగర్లమూడికి చెందిన కొత్త శ్రీనివాసబాబు బుధవారం 4.5 టిక్కీల నిమ్మకాయలను తెనాలి నిమ్మ మార్కెట్‌కు పంపారు. వేలం పాటల సమయంలో ఈ లాటు సరుకు ఎవరిదని ప్రశ్నించిన కమీషన్ ఏజెంట్లు, శ్రీనివాసబాబు సరుకని చెప్పటంతో కోర్టుకు వెళ్లినందున అతడి సరుకు కొనొద్దని పక్కన బెట్టమని చెప్పేశారు. పైగా ఒక కమీషను ఏజెంటు నేరుగా శ్రీని వాసబాబుకు ఫోను చేసి ఇదే విషయం చెప్పారు. అదేమంటే ‘నీవు సమస్యలపై కోర్టుకు వెళ్లినందున, వేలంలో నీ సరుకు కొనేది లేదని, ఈ ప్రకారం తమ అసోసియేషన్ తీర్మానించిందని చెప్పారు. నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం ధరలు లేక దిగాలు పడుతున్న రైతుకు ఈ పరిణామం దిక్కతోచనీయలేదు. నిమ్మకాయలు పచ్చి సరుకైనందున వేలంపాటలో కొనుగోలు జరక్కపోతే కాయ దెబ్బతినే ప్రమాదముంది. దాదాపు 10 వేల నిమ్మకాయలు కోల్పోతే ఆ రైతుకు చాలా నష్టం కలుగుతుంది. అందుబాటులో లేని అధికారి.. దీనితో యార్డు కార్యదర్శి షేక్ గౌస్‌బాషాను కలిసేందుకు చూడగా, ఆయన అందుబాటులో లేరు. ఫోనులో సంప్రదించగా, గుంటూరు కమిషనర్ కార్యాలయంలో ఉన్నట్టు చెప్పారని శ్రీనివాసబాబు తెలిపారు. నిమ్మకాయల కొనుగోలు చేయకపోవటం, కమీషన్ ఏజెంట్ల కక్ష సాధింపుపై వివరించగా, తాను వేలం పాడిస్తానని చెప్పారు. దయాదాక్షిణ్యాలపై కాకుండా అందరి రైతుల్లానే తమ సరుకును రోజూ కొనుగోలు చేసేలా చూడాలని లేకుంటే న్యాయం కోసం తదుపరి చర్యలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. కోర్టుకెళ్లటమే నేరమా.. హక్కుల కోసం కోర్టును ఆశ్రయించటం తప్పు ఎలా అవుతుంది. మేం చిన్న రైతులం. మా పొట్టకొడితే వ్యవసాయం ఎలా చేయాలి. కోర్టు మాకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయటం లేదు. అమలు కోరుతూ మళ్లీ కోర్టుకు వెళ్లటం ఈ పరిణామానికి దారితీసింది. మేం కోరేది తప్పయితే బహిరంగ క్షమాపణ, విచారణకు సిద్ధంగా ఉన్నాం. – కొత్త శ్రీనివాసబాబు, నిమ్మరైతు, సంగంజాగర్లమూడి ఇదేమి న్యాయం.. నిమ్మ మార్కెట్లో తక్‌పట్టీ, తూకపు రశీదు ఇవ్వాలని, నాలుగు శాతం మాత్రమే కమీషను వసూలు చేయాలని 2005లో వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. ఇప్పటికీ కమీషన్ ఏజెంట్లు, అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు బెదిరింపు ధోరణులకు దిగుతున్నారు. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమంటూ రైతుల సరుకు వేలంను వెలివేయటం ఏమిటీ? – కొత్త రమేష్‌బాబు, నిమ్మరైతు, సంగంజాగర్లమూడి -
బాదేపల్లి మార్కెట్లో నిలువు దోపిడీ
♦ అమ్మిన సరుకుకు కమీషన్3కు బదులు 6శాతం వసూలు ♦ నిలదీసిన రైతు.. ♦ మంత్రి హరీశ్‌రావుకు ఫ్యాక్స్‌లో ఫిర్యాదు ఇదో కమీషన్ ఏజెంట్ దందా..మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా..అమ్మిన సరుకుకు మూడు శాతం కమీషన్‌కు బదులు ఆరుశాతం వసూలు చేశాడు. తక్ పట్టీకి అదనంగా మరో తెల్లచీటీపై నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు కట్‌చేసి లెక్కపత్రం అందజేస్తుండడంతో గమనించిన రైతు నిలదీశాడు. ఈ విషయంపై మార్కెట్ కార్యాలయంలో, మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేశాడు. జడ్చర్ల : తాను అమ్మిన సరకుకు డబ్బులు చెల్లించాల్సిన కమీషన్ ఏజెంట్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై ఓ రైతు సంబ ంధిత అధికారులు, మంత్రికి ఫిర్యాదు చేసిన సంఘటన గురువారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో చో టుచేసుకుంది. బాధిత రైతు కథనం ప్రకారం.. రాజాపూర్ మండలం కల్లెపల్లికి చెందిన రైతు బ్రహ్మచారి గత నెల 30 న 25 క్వింటాళ్ల మొక్కజొన్నను బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్ జగన్నాథం ద్వారా క్వింటాల్‌కు రూ.1,426 చొప్పున విక్రయించి.. తక్‌పట్టీ తీసుకున్నారు. అయితే తక్పట్టిలో పొందుపరిచిన నిబంధనలకు విరుద్ధంగా సదరు కమీషన్ ఏజెంట్ తన దగ్గర ను ంచి అదనంగా కమీషన్‌ను వసూలు చేశారని రైతు యార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అదనంగా కమీషన్ వసూలు ఎందుకు చేస్తున్నారని కమీషన్ ఏజెంట్‌ను ప్రశ్ని ంచగా సరైన సమాధానం కూడా ఇవ్వకుండా యార్డులో అందరు ఇలాగే వసూలు చేస్తారని నిర్లక్షంగా వ్యవహరించారని విలేకరులు, వైస్‌చైర్మన్ శ్రీశైలంయాదవ్‌కు వివరించారు. తనకు మొత్తంగా రూ.36 వేలు రాగా కమీషన్ కింద రూ.1,274 పట్టుకుని మిగతా డబ్బులకు చెక్ ఇచ్చారని తెలిపారు. నిబంధనల ప్రకారం 3 శాతం కమీషన్ మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా 6.50 శాతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్లో 3 నుంచి 4 శాతం మాత్రమే కమీషన్ వసూలు చేస్తుండగా బాదేపల్లి మార్కెట్లో అంతకు మించి వసూలు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా తక్ పట్టీకి అదనంగా మరో తెల్లచీటీపై నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు కట్‌చేసి లెక్కపత్రం అందజేస్తున్నారని, వాస్తవంగా సరకు అమ్మిన తర్వాత రైతులకు ఎన్నిరోజులకు డబ్బులు ముట్టజెప్పాలన్న దానిపై స్పష్టత లేదని వాపోయారు. అధికారులు స్పందించాలి.. స్థానిక మార్కెట్ యార్డులో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని బాధిత రైతు ఆరోపించారు. ఇది తన ఒక్కడికి జరిగిన అన్యాయం కాదని.. వందలాది మంది అమాయక రైతులను ఇలాగే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులతోపాటు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావుకు సైతం ఫ్యాక్స్‌లో ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతాంగానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా యార్డులో హమాలీలు, చాట కూలీ రేట్లు అధికంగా ఉన్నాయని వారికి చెల్లించే కూలీ తక్కువగా ఉండడంతో అదనంగా చెల్లించేందుకు రైతుల నుంచి వసూలు చేస్తున్నార ని వ్యాపార సంఘం అధ్యక్షుడు బాలస్వామి, కార్యదర్శి పరుశవేది పేర్కొన్నారు. దీనిపై అధికారులు, పాలకమండలి సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్ తెలిపారు. -
జీజీహెచ్‌లో దళారి పట్టివేత
* రక్త పరీక్షలు బయటకు తరలిస్తున్న వైనం * ఆస్పత్రి వైద్యులే పిలిచారంటూ రోగుల ఫిర్యాదు గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శనివారం రైలుపేటలోని ఓ ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌లో పనిచేసే దళారి రక్తపు శాంపిళ్ళు తీసుకెళ్ళాడు. సదరు పరీక్ష చేసేందుకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవటంతో రోగుల బంధువులకు విషయం తెలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు విచారణ చేసి కొత్తపేట పోలీసులకు దళారిని అప్పగించారు. పొన్నూరు మండలం జూపూడికి చెందిన ఎం. బాలకోటేశ్వరమ్మ లివర్ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో చేరింది. వ్యాధి నిర్ధారణ కోసం ఆమెకు రక్తపరీక్షలు చేసేందుకు ఇద్దరు హౌస్సర్జన్లు రైలుపేట ల్యాబ్‌కు చెందిన దళారి నాగరాజును ఆస్పత్రికి పిలిపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తపరీక్షకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవటంతో రోగి బంధువులకు విషయం చెప్పటంతో వారు అంతమొత్తంలో ఫీజు ఉండదని తెలుసుకుని ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి ఆస్పత్రి సిబ్బందిలాగా వార్డులోకి వచ్చి రోగులతో మాట్లాడి రక్తపు శాంపిళ్ళు బయట ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు తెలిపారు. గత నెలలో కూడా ఇదే తరహాలో ఓ దళారిని రక్తపు శాంపిళ్ళు తీసుకెళ్తున్న సమయంలో సెక్యూరిటి సిబ్బంది పట్టుకోగా వైద్యులు పిలవటం వల్లే తాను వచ్చినట్లు వెల్లడించాడు. దళారీ వ్యవస్థను నిలురించేందుకు ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘనలు తరచుగా జరగటంతోపాటుగా ఆస్పత్రి పరువు బజారున పడే ప్రమాదం ఉంది.