కాంతమ్మను ప్రశ్నిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్
గుంటూరు మెడికల్: జీజీహెచ్ ఆర్థోపెడిక్ ఓపీలో రోగులకు డ్రస్సింగ్ చేస్తున్న నకిలీ ఉద్యోగి కాంతమ్మను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శనివారం ఆర్థోపెడిక్ ఓపీలో ఆయన తనిఖీ చేస్తున్న సమయంలో కాంతమ్మ నకిలీ ఉద్యోగిగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి నకిలీ ఉద్యోగుల వల్ల ఆస్పత్రికి చెడ్డ పేరు వస్తుందని, నకిలీ ఉద్యోగులు రోగుల నుంచి డబ్బులు సైతం వసూలు చేస్తున్నారని వెల్లడించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆర్ధోపెడిక్ వైద్య విభాగాధిపతి చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగికి డ్రస్సింగ్ చేసేందుకు నకిలీ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు రోగి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment