
జీజీహెచ్‌లో పూనం మాలకొండయ్య తనిఖీలు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం కూడా తనిఖీలు నిర్వహించారు. వైద్య ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రతీ నెలా ఓ బోధనాస్పత్రిలో మూడు రోజుల పాటు ఆమె తనిఖీలు నిర్వహించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రోగులను అడిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైద్య పరికరాలు ,మెరుగైన వైద్యం ఎలా అందించాలి అనే అంశాలపై ఆమె దృష్టి సారించారు. గత నెల విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.