punam malakondaiah
-
AP: దేశంలోనే తొలిసారిగా.. రైతుల కోసం మొక్కల డాక్టర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు త్వరలో ప్లాంట్ అండ్ సాయిల్ క్లినిక్లుగానూ సేవలందించనున్నాయి. ఆర్బీకేల్లో సేవలందిస్తున్న గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్లాంట్ డాక్టర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పంటలకు సోకే తెగుళ్లు, మట్టి నమూనాలను పరీక్షించేందుకు వచ్చే మార్చి నాటికి ప్రతి ఆర్బీకేకు ప్లాంట్ డాక్టర్ కిట్లను అందించనున్నారు. దేశంలోనే తొలిసారిగా ప్లాంట్ డాక్టర్ల వ్యవస్థను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. భూసారం, పోషకాలు, నీటి, సూక్ష్మ పోషక లోపాలకు సంబంధించి క్షణాల్లో పరీక్ష ఫలితాలను అందించడమే కాకుండా.. సకాలంలో తగిన సలహాలు, సూచనలు అందించేలా ప్లాంట్ డాక్టర్ విధానానికి రూపకల్పన చేసింది. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో రూ.75 వేల విలువైన సాయిల్ టెస్టింగ్ పరికరాలు (భూ పరీక్షక్), పంటల ఆధారిత లీఫ్ కలర్ చార్ట్ (ఎల్సీసీ), సూక్ష్మ పోషకాల లోపాల చార్ట్, మేగ్నిఫయింగ్ లెన్స్, జీపీఎస్, డిజిటల్ కెమెరా తదితర పరికరాలను మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొస్తారు. ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. రైతులు భూసారం, పోషకాలు.. నీటి యాజమాన్యం, సూక్ష్మపోషక లోపాల గుర్తింపు, పురుగులు–తెగుళ్లు, వ్యాధి నిర్ధారణ, కలుపు నివారణ చేపట్టాలంటే వెంటనే పరీక్ష ఫలితాలు వస్తేనే సాధ్యమవుతుంది. గతంలో భూసార, నీటి పరీక్షలు చేయాలంటే రోజులు, వారాల సమయం పట్టేది. ఫలితాలొచ్చేలోగా అదును దాటిపోయేది. దీంతో చేసేది లేక మూస పద్ధతిలోనే భూసారంతో సంబంధం లేకుండా మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వినియోగించేవారు. దీంతో పంటలు తరచూ తెగుళ్ల బారినపడి ఆశించిన దిగుబడులు రాక అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందిపడేవారు. ఇందుకు ప్రధాన కారణం తగినన్ని ప్రయోగశాలలు లేకపోవడం, సిబ్బంది కొరత ఉండేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి గ్రామ స్థాయిలో ప్లాంట్ డాక్టర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 60 సెకన్లలోనే ఫలితాలు ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన భూ పరీక్షక్ పరికరాన్ని ప్రతి ఆర్బీకేలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులో తీసుకొస్తున్నారు. ఈ పరికరంలో మట్టి నమూనా వేస్తే.. భూమి స్వభావంతోపాటు భూమిలోని ఆరు (ఎన్, పీ, కే, ఓసీ, సీఈసీ, క్లే) పారామీటర్స్‌ను పరీక్షిస్తుంది. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా స్పెక్ట్రోస్కోపీ, ఎల్ఓటీ టెక్నాలజీ ద్వారా కేవలం 60 సెకన్లలోనే ఫలితాలను అందిస్తుంది. రోజుకు వంద శాంపిల్స్‌ను పరీక్షించే సామర్ధ్యం ఉన్న ఈ పరికరాల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా భూమిలోని లోపాలను పసిగట్టవచ్చు. ఒక్క భూసారమే కాదు.. సూక్ష్మపోషక లోపాలు, మొక్కలకు వచ్చే తెగుళ్లు, వ్యాధులను కూడా పరీక్షించి నిర్ధారించుకోవచ్చు. ఫలితాలను రైతుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజిల ద్వారా పంపిస్తారు. ఫలితాల ఆధారంగా ప్లాంట్ క్లినిక్ (ఆర్బీకే) ద్వారా వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించే సిఫార్సులను రాతపూర్వకంగా (వైద్యుని ప్రిస్కిప్షన్ మాదిరిగా) రైతులకు అందిస్తారు. ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో ఏ సమయంలో వాడాలో రాతపూర్వకంగా రైతులకు అందిస్తారు. రైతులకు బహుళ ప్రయోజనాలు ► ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డు ఇస్తారు. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సాయిల్ హెల్త్ కార్డుల్లో సూచించే సిఫార్సుల వల్ల ఎరువుల వినియోగం 20–25 శాతం తగ్గుతుంది ► పంటకు సోకే తెగుళ్లను ప్లాంట్ క్లినిక్స్‌లో ఏర్పాటు చేసే పరికరాలతో ఇట్టే పసిగట్టవచ్చు. తెగుళ్లు, వ్యాధుల ఉధృతి ఎక్కువగా ఉంటే శాంపిల్స్ సేకరించి వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్‌కు పంపించి పరీక్షిస్తారు. ► వ్యాధులు, తెగుళ్లు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల పురుగుల మందుల వినియోగం 15–25 శాతం తగ్గుతుంది. ► మొత్తంగా రైతుకు పెట్టుబడి ఖర్చులు కనీసం 15–20 శాతం తగ్గుతాయి. దిగుబడుల్లో నాణ్యత పెరుగుతుంది. గతంతో పోలిస్తే 18–20 శాతం వరకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ► పెట్టుబడి ఖర్చులు తగ్గడం, దిగుబడులు పెరగడం వలన రైతులు కనీసం 20–25 శాతం అదనంగా ఆదాయం పొందే అవకాశం కలుగుతుంది. సీఎం వైఎస్ జగన్ ఆలోచన మేరకు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలో భాగంగానే ‘ప్లాంట్ డాక్టర్’ విధానానికి రూపకల్పనం చేశాం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ప్లాంట్ క్లినిక్స్ రైతులకు అందుబాటులోకి రానున్నాయి. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
దేశానికే ఏపీ రోల్‌మోడల్
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించడంలో ఏపీ ప్రభుత్వం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ (నాస్) ప్రెసిడెంట్ టి.మహోపాత్ర ప్రశంసించారు. జాతీయ స్థాయిలో ఏపీ మోడల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ దిశగా కృషి జరుగుతోందన్నారు. నాస్ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేటివ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మోడల్స్’ అనే అంశంపై న్యూఢిల్లీలో సోమవారం జరిగిన జాతీయ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు ఆలోచనే ఓ అద్భుతమన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, గోదాములు, శీతలీకరణ గదులు, కలెక్షన్ సెంటర్లతోపాటు నియోజకవర్గ స్థాయిలో అగ్రి ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. వీటిని జాతీయ స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు కేంద్రానికి నివేదిక సమర్పిస్తామన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ ఆర్బీకేల సాంకేతికత పట్ల విదేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలో అమలుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీ తరహాలో సర్టిఫై చేసిన ఇన్పుట్స్ పంపిణీ, ప్రభుత్వ సేవలు, రైతు శిక్షణ కార్యక్రమాలు, పంట కొనుగోళ్లు గ్రామ స్థాయిలో చేపడితే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏకే సింగ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంతో ఐసీఏఆర్ కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఆర్బీకేల బలోపేతానికి ఐసీఎఆర్ చేయూతనిస్తుందన్నారు. సీఎం ఆలోచనల నుంచే ఆర్బీకేలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిందే ఆర్బీకే వ్యవస్థ అని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. వర్క్‌షాపులో ఆర్బీకే సేవలపై ఆమె పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకే కాకుండా ఆక్వా, మత్స్యసాగు చేసే రైతులు, పాడి రైతులకు కూడా సేవలందిస్తున్నామన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ విధానాల ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అం దేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు రైతులకు అందిస్తున్నామన్నారు. రైతుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను గ్రామ స్థాయిలోనే కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. సర్టిఫై చేసిన ఇన్పుట్స్ పంపిణీ కోసం నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌తో పాటు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.కార్యక్రమంలో జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ మనీష్ సి.షా, నాస్ కార్యదర్శి డాక్టర్ పీకే జోషి, నాబార్డు సీజీఎం సీఎస్ఆర్ మూర్తి, మేనేజ్ డైరెక్టర్ జనరల్ పి.చంద్ర శేఖర, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
ఆఫ్రికాలో ఆర్బీకేలు!
సాక్షి, అమరావతి: విత్తనం నుంచి విక్రయాల వరకు గ్రామస్థాయిలో రైతన్నలకు సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ఆఫ్రికా దేశాలనూ ఆకర్షిస్తున్నాయి. ఆర్బీకేలు అనుసరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక చేయూతను అందించనుంది. ఇథియోపియా ప్రతినిధి బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పు వ్యవసాయ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఆర్బీకే వ్యవస్థను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. 10,778 ఆర్బీకేలు రైతులకు ఇంటి ముంగిటే అన్ని సేవలు అందిస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, మిశ్రమ దాణా, రొయ్యలు, చేపల మేత.. ఇలా సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేలు సమకూరుస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారా కళ్లాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. వీటి సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలు సన్నద్ధమయ్యాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఒ) ఏటా అందించే ప్రతిష్టాత్మక ‘చాంపియన్’ అవార్డుకు ఆర్బీకేలు నామినేట్ అయ్యాయి. ఇథియోపియాలో సమృద్ధిగా సాగు భూములు ఆఫ్రికాలో అత్యంత పేద దేశమైన ఇథియోపియాకు వ్యవసాయం, పాడి రంగాలే ఆర్ధిక పునాది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 46.3 శాతం ఈ రంగాల నుంచే వస్తున్నప్పటికీ ఏటా 4.6 మిలియన్ల మంది ఆహార కొరతతో సతమతమవుతున్నారు. మొక్కజొన్న, కాఫీ, పప్పులు, తృణధాన్యాల సాగులో ప్రత్యేక స్థానం పొందిన ఇథియోపియాలో సాగు యోగ్యమైన భూములు విస్తారంగా ఉన్నాయి. సాగు విస్తీర్ణం, దిగుబడులు పెంచుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న భూములను సాగులోకి తేవడం, రైతుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, ఉత్పత్తి ఖర్చులను నియంత్రించడం, నాణ్యతతో కూడిన దిగుబడులను సాధించే లక్ష్యంతో సౌత్సౌత్ కో ఆపరేషన్ భాగస్వామి దేశాల్లో అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇథియోపియా నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆర్బీకేల తరహాలో అక్కడ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్బీకేలను సిఫార్సు చేసిన కేంద్రం ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్ రీజియన్ సమ్మిట్‌లో ఆర్బీకేల సేవల గురించి ప్రపంచ బ్యాంకు బృందానికి కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఆర్బీకే తరహా వ్యవస్థను ఇథియోపియాలో ఏర్పాటు చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని సూచించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు ప్రపంచ బ్యాంక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో మరోసారి భేటీ కానున్న ఇథియోపియా–వరల్డ్ బ్యాంక్ –కేంద్ర బృందాలు అవగాహన ఒప్పందం చేసుకోనున్నాయి. జూన్ లేదా జూలైలో ఇథియోపియా వ్యవసాయశాఖ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. ఆర్బీకేల సేవలు, విస్తరణ కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. అనంతరం మన రాష్ట్ర ప్రతినిధి బృందం ఇథియోపియాలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తుంది. మన శాస్త్రవేత్తలు, అధికారులు ఇథోయోపియాలో సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆర్బీకేల సాంకేతికతను తీసుకురావడంపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలైన ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తోంది. ఐరాస –ఎఫ్ఏవో చాంపియన్ అవార్డుకు ఆర్బీకేలను నామినేట్ చేసిన కేంద్రం తాజాగా ఏషియన్ ఫసిపిక్ సమ్మిట్‌లో ఇథియోపియా కోసం వీటిని వరల్డ్ బ్యాంక్‌కు సిఫార్సు చేసింది. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక చేయూతతో ఈ ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇది మన ఆర్బీకేలకు దక్కిన మరో గౌరవం. –పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
కొత్త జిల్లాలతో రైతులకు మరింత మెరుగైన సేవలు
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: కొత్త జిల్లాలతో రైతులకు మరింత వేగంగా మెరుగైన సేవలందే అవకాశం ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలు సైతం ఏపీలో అమలు చేస్తున్న సంస్కరణలు, విధానాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులతో బుధవారం మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత వేగంగా నాణ్యమైన సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసిందని చెప్పారు. దీనికి తగినట్లుగా రైతులకు సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ రంగంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. రైతుల ప్రతి అవసరాన్ని.. వారి వద్దకే వచ్చి తీర్చేందుకు ప్రభుత్వం ఆర్బీకేలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆర్బీకే వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం అందరికే తెలిసిందేనన్నారు. పెట్టుబడి సాయం, ఇన్పుట్ సబ్సిడీ తదితరాల రూపంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు అధిక దిగుబడులు, మంచి ధరలు పొందుతున్నారని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రాష్ట్ర రైతులకు 1.10 లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చామని వివరించారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ జానకిరామ్ పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై సర్టిఫికెట్ కోర్సు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’పై సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. కోర్సు కరదీపికను విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి కన్నబాబు తదితరులు ఆవిష్కరించారు. -
ఐఎస్వో సర్టిఫికేషన్ దిశగా ఆర్బీకేలు, అగ్రి ల్యాబ్స్ అడుగులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి అత్యాధునిక సౌకర్యాలతో నూతన భవన సముదాయాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయిలో సేవలందిస్తున్న ఆర్బీకేల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఐఎస్వో గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా.. 7 ఆర్బీకేలకు ఇటీవలే ఐఎస్వో సర్టిఫికేషన్ లభించింది. తొలి విడతలో దరఖాస్తు చేసిన మరో 6 ఆర్బీకేలను ఇటీవలే ఐఎస్వో ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లింది. వీటికి వచ్చే నెల మొదటి వారంలో ఐఎస్వో గుర్తింపు వస్తుందని అంచనా వేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఆర్బీకేలకు దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. అగ్రి ల్యాబ్స్‌కూ దశల వారీగా దరఖాస్తు మరోవైపు నియోజకవర్గ, జిల్లా, రీజనల్, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌కు కూడా దశల వారీగా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యతను పరీక్షించేందుకు నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్‌లతో పాటు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లు, డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్రస్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 70 ల్యాబ్స్ అందుబాటులోకొచ్చాయి. వీటికి అనుబంధంగానే పాడి, ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మత్స్య శాఖకు సంబంధించి 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 35 వాటర్ సాయిల్ ఎనాలసిస్, 35 మైక్రో బయాలజీ, 14 ఫీడ్ ఎనాలసిస్, 17 పీసీఆర్, 13 క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్, జిల్లా స్థాయిలో 10, రీజనల్ స్థాయిలో 4, పులివెందులలో రిఫరల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 60 ల్యాబ్స్‌లో సేవలు అందిస్తున్నారు. దశల వారీగా అన్నిటికీ.. ఇప్పటికే ఏడు ఆర్బీకేలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. త్వరలో మరో ఆరు ఆర్బీకేలకు గుర్తింపు రానుంది. ఇదే రీతిలో మిగిలిన ఆర్బీకేలతో పాటు వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌కు కూడా ఐఎస్వో సర్టిఫికేషన్ సాధించే దిశగా కృషి చేస్తున్నాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్ -
పూనంకు ఎన్బీడబ్ల్యూ
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో తమ ముందు హాజరు కావాలన్న ఆదేశాలను వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పాటించకపోవడంతో ఆమెకు హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. ఈ కేసులో అధికారులు తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పేర్కొంది. ఈ కేసు తీర్పును ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పట్టు పరిశ్రమల శాఖలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న పిటిషనర్ల సేవలను 1993 నుంచి క్రమబద్ధీకరించాలని గతేడాది ఫిబ్రవరి 28న హైకోర్టు ఆదేశించింది. అందుకనుగుణంగా పెన్షనరీ ప్రయోజనాలను వర్తింపచేయాలని సూచించింది. అయితే ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ 17 మంది విశ్రాంత ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలంటూ పలువురు అధికారులకు గతంలో ఆదేశాలిచ్చారు. ఈ మేరకు వారు బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే పూనం మినహా మిగిలిన అధికారులు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ రికార్డుల్లో లేకపోవడంతో పూనంకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. స్వయంగా హాజరుకండి: సీఎస్‌కు హైకోర్టు ఆదేశం ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 24న స్వయంగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఉపాధి పనులకు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందా? లేదా? అనేదానిపై స్పష్టతనివ్వాలని కోరింది. విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు కేంద్రానికి చెప్పి.. విచారణ జరుగుతోందని తమకు చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని భావిస్తున్నామని.. కాబట్టి సీఎస్ హాజరుకు ఆదేశాలిస్తున్నట్లు జస్టిస్ బట్టు దేవానంద్ చెప్పారు. -
AP: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను డిమాండ్ ఉన్నచోట అమ్ముకోగలిగినప్పుడే రైతుకు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అసలు పంట పండించడం కంటే మార్కెటింగ్ చేసుకునేందుకు పడే ఇబ్బందులే ఎక్కువ. ఇక ఎగుమతులకైతే చెప్పలేనన్ని ఆంక్షలు. మరోవైపు.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుల మందులతో ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత పూర్తిగా లోపిస్తోంది. దీంతో ఎవరికి వారు తమవే ఆర్గానిక్ ఉత్పత్తులంటూ సర్టిఫై చేసుకుంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ఇప్పటివరకు ఎక్కడా పంటల ధ్రువీకరణకు ప్రత్యేక విధానమంటూ లేకపోవడమే. ఈ నేపథ్యంలో.. గడిచిన రెండేళ్లుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా అడుగులేస్తోంది. ఓ పక్క సేంద్రియ పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తూనే మరోపక్క పంటల ధృవీకరణ (క్రాప్ సర్టిఫికేషన్)పై దృష్టిసారించింది. చదవండి: విశ్వ బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అండ సర్టిఫికేషన్ లేకే ఎగుమతులకు దెబ్బ రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 92.45 లక్షల ఎకరాలు, రబీలో 58.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇక 1.19 లక్షల ఎకరాల్లో పట్టు (మల్బరీ), 4.52 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. వీటి ద్వారా గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో 175 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, 312.24 లక్షల టన్నుల ఉద్యాన, 8,420 టన్నుల పట్టు, 46.24 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల దిగుబడులు వచ్చాయి. పలు రకాల ఆహార, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం దేశంలోనే నం.1గా ఉంది. కానీ, విదేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులతో పాటు కొన్నిరకాల ఉద్యాన పంటలకు మాత్రమే క్రాప్ సర్టిఫికేషన్ చేసుకోగలుగుతున్న రైతులను వేళ్లమీద లెక్కించొచ్చు. చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్ వర్సిటీల్లో సీట్లు లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగుచేస్తున్నామని చెప్పుకుంటున్న వారు సైతం క్రాప్ సర్టిఫికేషన్‌కు దూరంగానే ఉంటున్నారు. ఎగుమతుల దగ్గరకొచ్చేసరికి సర్టిఫికేషన్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ నిర్వహించిన సర్వేలో సర్టిఫికేషన్‌పై ఏపీ నుంచి ఏటా కేవలం రూ.130 కోట్ల ఎగుమతులు జరుగుతున్నట్లుగా తేలింది. నిర్దిష్టమైన పాలసీ, సర్టిఫికేషన్ వ్యవస్థ ఉంటే కనీసం అవి రూ.2వేల కోట్లకు పైగా జరుగుతాయని అంచనా వేసింది. దీంతో వచ్చే రెండేళ్లలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులకూ ధ్రువీకరణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పొలం బడిలో జీఏపీ పద్ధతులను డాక్యుమెంటేషన్ చేస్తోన్న రైతులు రబీ సీజన్ నుంచి జీఏపీ జారీ పరిశోధనల ఫలితాలను నేరుగా రైతులకు చేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 రబీ సీజన్లో పొలంబడులకు శ్రీకారం చుట్టింది. 2020 ఖరీఫ్, రబీ సీజన్లలో నిర్వహించిన పొలంబడుల ద్వారా సత్ఫలితాలను సాధించడంతో 2021–22 సీజన్లో ఆర్బీకేలు కేంద్రంగా పొలంబడి, తోట, పట్టు, మత్స్యసాగు, పశువిజ్ఞాన బడులకు శ్రీకారం చుట్టింది. వీటికోసం ఆయా యూనివర్సిటీల ద్వారా ప్రత్యేక సిలబస్‌ను రూపొందించారు. 13–14 చాప్టర్స్‌గా తయారుచేసిన ఈ సిలబస్‌పై తొలుత ఆర్బీకే సిబ్బందికి శిక్షణనిచ్చారు. వీటి ద్వారా ఎంపిక చేసిన క్షేత్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లలో పొలంబడులు పూర్తికాగా.. ప్రస్తుత ఖరీఫ్‌లో నాలుగో విడతను చేపట్టారు. గడిచిన మూడు సీజన్లలో ఉత్తమ యాజమాన్య పద్ధతులతో అత్యుత్తమ ఫలితాలను సాధించిన రైతులకు రానున్న రబీ సీజన్లో జీఎపీ సర్టిఫికెట్ జారీచేయనున్నారు. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా.. అనంతరం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పంటల ధ్రువీకరణ చేయబోతుంది. ఈ విధంగా సర్టిఫై చేసిన ఉత్పత్తులను ప్రభుత్వ బ్రాండింగ్ (లోగో)తో ఎగుమతి చేసేందుకు వీలుగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఖర్చులకు కళ్లెంతో పెరిగిన ఆదాయం 2019–20 రబీలో రూ.17.04 కోట్లతో నిర్వహించిన 5,037 పొలంబడుల ద్వారా 1,51,110 మంది రైతులు లబ్ధిపొందారు. 2020–21 ఖరీఫ్‌లో రూ.18.92 కోట్లతో నిర్వహించిన 10,790 పొలంబడుల ద్వారా 5.65 లక్షల మంది, రబీలో రూ.17.78 కోట్లతో నిర్వహించిన 8,050 పొలంబడుల ద్వారా 4.98 లక్షల మంది రైతులు లబ్ధిపొందారు. సాగు ఖర్చులు తగ్గించడం ద్వారా ఖరీఫ్‌లో రూ.83.93 కోట్లు, రబీలో రూ.69.70 కోట్ల మేర దిగుబడులు పెరగడంతో ఖరీఫ్‌లో రూ.145.96 కోట్లు, రబీలో 126.45 కోట్ల మేర అదనపు ఆదాయం పొందారు. రూ.20 కోట్లతో క్రాప్ సర్టిఫికేషన్ విభాగం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో క్రాప్ సర్టిఫికేషన్ దిశగా అధికారులు అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రజల ఆరోగ్యాలకు హానిచేయని పంటలకు ప్రభుత్వమే సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత దశల వారీగా సేంద్రియ సాగువైపు రైతులను మళ్లించాలన్నది ప్రభుత్వాలోచన. ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా నాణ్యమైన పంటలు ఉత్పత్తి చేసే రైతులకు తొలుత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ (జీఏపీ) సర్టిఫికేషన్ ఇవ్వనుంది. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేషన్ ఇప్పించనుంది. విత్తన నాణ్యతను ధ్రువీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాధీనంలో సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ పనిచేస్తోంది. దీనికి అనుబంధంగానే క్రాప్ సర్టిఫికేషన్ ఏజెన్సీని కూడా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.20 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ ఏజెన్సీ ద్వారా నియోజకవర్గస్థాయిలో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్‌లో శాంపిల్స్ పరీక్షించి విషపూరిత రసాయనాల్లేవని నిర్ధారించిన వాటికి ‘క్రాప్ సర్టిఫికేషన్’ ఇచ్చేలా ఏర్పాట్లుచేస్తున్నారు. ఇదే లక్ష్యంతో డిసెంబర్ నెలాఖరుకల్లా కనీసం 30 శాతం ల్యాబ్‌లకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్‌ఎబీఎల్) గుర్తింపు సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఖర్చుతో కూడుకున్న ఈ సర్టిఫికేషన్‌ను పలు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు చేస్తుండగా, మొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రభుత్వమే దీనిని చేపడుతోంది. ప్రతీ పంటకు ప్రభుత్వ బ్రాండింగ్ ప్రతీ పంటకు క్రాప్ సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా బ్రాండింగ్ కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సర్టిఫికేషన్ ఉంటే వ్యాపారులే క్యూ కడతారు. ప్రపంచంలో ఎక్కడైనా నచ్చిన రేటుకు అమ్ముకోవచ్చు. రాష్ట్రంలో పండే ప్రతీ పంటను ప్రభుత్వ లోగోతో ఎగుమతులు ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పొలంబడుల స్ఫూర్తితో క్రాప్ సర్టిఫికేషన్ కార్యాచరణ సిద్ధంచేశాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్బీకేల ద్వారా సాగు ఉత్పాదకాలనే కాదు.. పరిశోధనా ఫలితాలను కూడా రైతుల వద్దకు తీసుకెళ్తున్నాం. ప్రతి పంటకు క్రాప్ సర్టిఫికేషన్ చేయగలిగితే గిట్టుబాటు ధరకు ఢోకా ఉండదు. – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వేరుశనగలో ఖర్చు బాగా తగ్గింది నాకు రెండెకరాల పొలం ఉంది. ఏటా వేరుశనగ సాగుచేస్తున్నా. గతంలో రూ.22 వేల వరకు ఖర్చయ్యేది. అలాంటిది పొలంబడిలో చెప్పిన విధానం ద్వారా రూ.19,050లే ఖర్చయ్యింది. నా తోటి రైతులకు ఎకరాకు 4.12 క్వింటాళ్ల దిగుబడి వస్తే నాకు 5.35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాళ్లకి ఎకరాకు రూ.21,733ల ఆదాయం వస్తే నాకు రూ.28.221ల ఆదాయం వచ్చింది. – వై. రెడ్డప్ప, జరిగడ్డదిగువపాలెం, చిత్తూరు జిల్లా పెట్టుబడి తగ్గింది.. దిగుబడి పెరిగింది నాకు ఎకరం పొలం ఉంది. గతంలో మూస పద్ధతిలో సాగుచేసేవాడిని. గడిచిన సీజన్లో పొలంబడి కింద మా పొలాన్ని ఎంపిక చేసి సాగుచేసే పద్ధతులను వివరించారు. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాక దిగుబడి బాగా వచ్చింది. పెట్టుబడిపోను ఇతర రైతులకు రూ.20,135 మిగిలితే నాకు రూ.27,050 మిగిలింది. వచ్చే రబీలో సర్టిఫికేషన్ ఇస్తామని చెబుతున్నారు. – డి. మనోహర్‌రెడ్డి, తాళ్లపూడి, నెల్లూరు జిల్లా కందిలో రాబడి పెరిగింది నేను కంది సాగుచేస్తున్నా. గతంలో నాకు ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చయ్యేది. పొలంబడి పద్ధతిలో సాగుచేస్తే కేవలం రూ.11,600 ఖర్చయ్యింది. నా తోటిì రైతులకు ఎకరాకు 250 కిలోలొస్తే నాకు 450 కిలోల దిగుబడి వచ్చింది. పెట్టుబడిపోను వాళ్లకి రూ.2,600లు మిగిలితే నాకు రూ.15,400 ఆదాయం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. – తమటం బ్రహ్మారెడ్డి, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా సిలబస్ రూపొందిస్తున్నాం పంటల వారీగా సిలబస్ రూపొందిస్తున్నాం. పొలం, ఉద్యాన బడుల్లో సాధించిన ఫలితాలను అధ్యయనం చేస్తున్నాం. వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నాం. నెమ్మదిగా కొత్త పద్ధతికి అలవాటుపడేలా రైతులను తయారుచేస్తున్నాం. – ఏవీ నాగవేణి, శాస్త్రవేత్త, డాట్ సెంటర్, కలికిరి సర్టిఫికేషన్‌తో రైతులకెంతో మేలు పంటల ధ్రువీకరణతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సేంద్రియ సాగుచేస్తున్న వారు సైతం సర్టిఫికేషన్ గురించి తెలీక నష్టపోతున్నారు. ప్రభుత్వమే సర్టిఫై చేస్తే రైతులకు ఎంతో మేలు. ఇదే జరిగితే రైతులకు మంచి గిట్టుబాటు రావడమే కాక ఎగుమతులూ పెరుగుతాయి. – జలగం కుమారస్వామి, జాతీయ కార్యదర్శి భారతీయ కిసాన్ సంఘ్ -
రైతుల కోసం ప్రతిరోజూ ‘స్పందన’
సాక్షి, అమరావతి: అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు మరో అడుగు ముందుకేసింది. సాగుతో పాటు.. సంక్షేమ ఫలాలు అందుకోవడంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘రైతు స్పందన’ (ఫార్మర్స్ గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి వచ్చే అర్జీదారుల్లో అత్యధికులు రైతులే ఉంటున్నారు. ఆర్బీకే సిబ్బంది స్పందన కార్యక్రమానికి విధిగా హాజరవ్వాల్సి ఉండటంతో ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఆర్బీకేలకు వచ్చే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఆర్బీకేల్లో రైతుల కోసం ప్రతిరోజు స్పందన నిర్వహించాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించే స్పందనలో ఆర్బీకేల్లో పనిచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశు సంవర్థక, మత్స్య శాఖ సహాయకులు హాజరు కానున్నారు. ఈ సమయంలో సచివాలయాల్లో నిర్వహించే స్పందనకి వాటిలో పనిచేసే సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఆర్బీకేల్లోనే బయోమెట్రిక్ హాజరు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా, వాటిలో 234 అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 6,363 మంది వ్యవసాయ, 4,506 పశు సంవర్థక, 2,367 మంది ఉద్యాన, 375 మంది పట్టు, 738 మంది మత్స్య సహాయకులు విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ అసిస్టెంట్లు లేనిచోట 1,495 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. వీరంతా ఇప్పటివరకు సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాల్సి వచ్చేది. ఉదయం పూట సచివాలయాలకు వెళ్లి బయోమెట్రిక్ వేసి ఆ తర్వాత ఆర్బీకేలకు వచ్చి రైతులకు ఇన్పుట్స్ అందించి క్షేత్రాలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం సచివాలయాల్లో నిర్వహించే స్పందనకు హాజరవుతున్నారు. ఇక నుంచి వీరంతా పనివేళల్లో ఎప్పుడైనా సరే ఆర్బీకేల్లోని కియోస్క్, బయోమెట్రిక్ డివైస్‌లలో హాజరు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్బీకేలను సచివాలయాలకు ఎక్స్టెన్షన్ యూనిట్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రైతుల కోసం నియమించిన వీరిని రైతుల అవసరాల కోసం తప్ప మరే ఇతర విధులకు వినియోగించకూడదని స్పష్టం చేసింది. నాణ్యమైన సేవలందించేందుకే.. ఆర్బీకేల ద్వారా రైతులకు మరింత నాణ్యమైన సేవలందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఆర్బీకేల్లో ప్రతిరోజు స్పందన కార్యక్రమం నిర్వహిస్తారు. సిబ్బంది ఆర్బీకేల్లో బయోమెట్రిక్ వేస్తే చాలు. సిబ్బందిని ఇతర విధులకు వినియోగించకుండా ఆదేశాలు జారీ చేశాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ–సహకార శాఖ -
అమరావతి పంట బీమాకు దివంగత నేత పేరు
సాక్షి, అమరావతి: అమరావతి పంటల భీమాకు వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకంగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు గాను పంటల భీమాకు ఆయన పేరు పెడుతున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 2019-20 సంవత్సరంలో రబీ సీజన్ 2020 ఖరీఫ్ పంటకు కూడా అమలయ్యేలా ఈ పంట బీమా వర్తించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. అంతేగాక ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా కూడా రాష్ట్రంలో ఉచిత పంట బీమా కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల సమీకృత అక్వా ల్యాబబ్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఆర్ఐడీఎఫ్ నిధులు 12. 47 కోట్ల రూపాయలతో ఈ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. -
గత ఖరీఫ్ నుంచే అమలు
సాక్షి, అమరావతి: గత ఏడాది ఖరీఫ్ (2019–20) నుంచే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ► రైతులకు పథకం కింద రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు పథకం వర్తిస్తుంది. ► ఇప్పటికే అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలు ఉంటాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ పొందే సౌకర్యం ఉన్న రైతుల ఖాతాలకు జమ చేస్తుంది. ► తుది గడువులోగా రైతులు అసలు, వడ్డీ చెల్లించాలి. సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తుంది. అసలు, వడ్డీని రైతు చెల్లించినట్టు జాబితాలు తయారు చేసి ఆయా బ్యాంకులు లేదా నోడల్ బ్యాంకు శాఖలు వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్ కార్యాలయానికి పంపుతాయి. వీటి ఆధారంగా వ్యవసాయ శాఖ కమిషనర్ వడ్డీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాకు జమ చేస్తారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా http:// ysrsvpr.ap.gov.in వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. ► వాస్తవ సాగుదార్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఇ–పంటలో నమోదైన వాస్తవ సాగుదార్లకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులను కోరినట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మేధోమథన సదస్సు:నేడు వ్యవసాయంపై సమీక్ష
-
నేడు వ్యవసాయంపై సమీక్ష
సాక్షి, అమరావతి: ‘మన పాలన–మీ సూచన’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష జరుగుతుంది. ఈ సదస్సుకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమన్వయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆమెతోపాటు మార్కెటింగ్ కార్యదర్శి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ, మార్కెటింగ్, ఫిషరీస్, హార్టికల్చర్ శాఖల కమిషనర్లు, ఆహార శుద్ధి విభాగం సీఈవో, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ ఉన్నారు. సదస్సుకు 13 జిల్లాల నుంచి 24 మంది రైతులు, వివిధ రంగాలకు చెందిన 14 మంది నిపుణులు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, ఆక్వా, డెయిరీ రంగ ప్రముఖులు, ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వంటి సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. -
నాణ్యత లేని విత్తనాన్ని అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్ని జిల్లాల వ్యవసాయాధికారులను, ఏపీ సీడ్స్ అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని చెప్పారు. అనంతపురం జిల్లాలో నాలుగు ట్రక్కులు నాణ్యత లేని వేరుశనగ విత్తన కాయలు సరఫరా అయిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో ఆమె శనివారం అధికారులకు సందేశం పంపారు. విత్తన పంపిణీ పూర్తయ్యాక రైతుల నుంచి ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాణ్యత లేని కాయల్ని సరఫరా చేసిన సంస్థల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతోపాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీడ్స్‌ను ఆదేశించారు. ► వ్యవసాయశాఖ ఏడీలు సరుకు ఎక్కడ నుంచి బయలుదేరుతుందో అక్కడే తనిఖీలు నిర్వహించాలి. నాణ్యతను నిర్ధారించాకే సరఫరాకు అనుమతించాలి. ► నాణ్యత లేని విత్తనాన్ని వ్యవసాయ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దన్న గట్టి హెచ్చరిక వెళ్లాలి. ► వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా, పంపిణీ విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా పట్టుదలతో ఉన్నారు. నాణ్యత లేనివాటిని రైతులకు అంటగడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ట్రూత్‌ఫుల్ లేబుల్‌పై ఏం ఉంటుందంటే.. బస్తా బరువు, కాయల శుభ్రత, మొలక శాతం, తేమ, కలుపు, గరిష్ట చిల్లర ధర వంటివి ఉంటాయి. ఏ సంస్థ నుంచి ఏపీ సీడ్స్‌కు వచ్చాయో కూడా ఉంటుంది. అయితే.. ఇవేవీ ప్రభుత్వ సంస్థలు గుర్తించి ఇచ్చిన ప్రకటనలు కావు. ఆయా సంస్థలు తమకు తాము ఇస్తున్నవే. ట్రూత్‌ఫుల్ లేబుల్ ఉండాలా? వద్దా? ఏపీ సీడ్స్‌కు సరఫరా చేస్తున్న విత్తన బస్తాలపై సర్టిఫైడ్ ట్యాగ్‌కు బదులు ఆయా సంస్థలు ఇస్తున్న ట్రూత్‌ఫుల్ లేబుల్ (స్వీయ విశ్వసనీయ ప్రకటన) ఉండడాన్ని అనుమతించాలా, వద్దా అనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్‌ను కోరారు. సర్టిఫైడ్ ట్యాగ్ ఉంటే ఇక ఆ విత్తనానికి తిరుగుండదు. అదే ట్రూత్‌ఫుల్ లేబుల్ అయితే ఆయా విత్తన సంస్థలు ఇచ్చే స్వచ్ఛంద ప్రకటన మాత్రమే. ఇప్పుడు ఇలా లేబుల్ ఉన్న వాటిల్లోనే నాణ్యత లేని కాయలు వచ్చాయి. -
'వైద్య పరికరాల ఉత్పత్తిలో మెడ్‌టెక్ కీలకం'
సాక్షి, విజయవాడ : విశాఖ మెడ్‌టెక్ జోన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించినట్లు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మెడ్‌టెక్ జోన్లో ప్రస్తుతం వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడ్‌టెక్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పరికరాలను కూడా పరీక్ష చేసే 13 లాబ్స్ ఏర్పాటు చేశామని, కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఈనెల 10వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తాయన్నారు. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మెడ్ టెక్ జోన్ మారబోతోందన్నారు. ప్రభుత్వ సహకారంతో మెడ్‌టెక్ జోన్ ఎండీ జితేందర్ శర్మ దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.(విద్యుత్ దీపాల బంద్; కేంద్రం వివరణ) కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయని, ఈ తరుణంలో మన రాష్ట్రంలో మెడ్‌టెక్ జోన్లో ఇవి తయారు అవుతుండటం చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో సరాసరి 3వేల వెంటిలేటర్లు తయారు చేయనున్నారని.. మే నెల నుంచి 6 వేల కిట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో 10 వేలు, మే నుంచి 25 వేల వరకు టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మెడ్‌టెక్ జోన్‌కు ఎలాంటి నిధులు అందలేదన్నారు. కాగా ఉత్పత్తులు మార్కెట్లోకి రాక మునుపే వాటిని పరీక్ష చేసి విడుదల చేయాల్సిన అవసరం ఉందని, వాటి కోసం లాబ్స్ అవసరం అవుతాయని తెలిపారు. ల్యాబ్స్ ఏర్పాటు చేసే విషయమై గతంలో కొందరు వ్యతిరేకంగా పనిచేశారని, సీఈఓ జితేంద్ర శర్మ విషయంలో ఇదే జరిగిందన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నామని పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. కాగా మెడ్‌టెక్ జోన్లో సీటీ స్కానర్, శానిటైజర్ ఉత్పత్తులు తయారు అవుతుంటాయి. ('బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు') పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ వైద్య పరికరాల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం వైద్య పరికరాల పార్కు అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. కాగా మెడ్‌టెక్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వాన్ని నిధులు అడిగినట్లు తెలిపారు. కోవిడ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీకి ఆదేశాలు జారీ చేశామని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 15 నాటికి సరఫరా చేయాల్సిందిగా మెడ్ టెక్ పార్కు లో కొన్ని కంపెనీలను కోరాం. అక్కడ ఉత్పత్తి ని గాని, అభివృద్ధి ని గాని తగ్గించ లేదు.రెండో దశ లో 270 ఎకరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసికి అప్పగించామన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా రుణం తీయకుని అభివృద్ధి చేపట్టామని తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు రెండో దశ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని రజత్ భార్గవ స్పష్టం చేశారు. -
వివాదాస్పదంగా నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల ఏర్పాటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నర్సింగ్ సూళ్లు, కాలేజీల ఏర్పాటు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కొత్త కాలేజీల ఏర్పాటును వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య వ్యతిరేకించారు. ప్రస్తుతమున్న సూళ్లు, కాలేజీలకే అడ్మిషన్లు లేవని తిరస్కరించారు. దీంతో పూనమ్ మాలకొండయ్యపై ప్రభుత్వ పెద్దల రాజకీయ ఒత్తిడి మొదలైంది. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల ఒత్తిడితో కొత్త కాలేజీలకు అనుమతివ్వాలని ఆదేశాలు వెలువడ్డాయి. పూనమ్ మాలకొండయ్య వ్యతిరేకించడంతో హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎలాగైనా కొత్త నర్సింగ్ సంస్థలకు అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి చేసేందుకు సమావేశంకానున్నారు. హై పవర్ కమిటీ సిఫార్సులను ఆమోదం తెలపాలని ఇప్పటికే పూనమ్ మాలకొండయ్యపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ నేతలు నర్సింగ్ కాలేజీలు, స్కూళ్ల ఏర్పాటుకు కోట్లలో వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధనాసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి పూనం మాలకొండయ్య గురువారం జీవో ఎంఎస్ నెం.108 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 ఖాళీలను డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అనాటమిలో 8, ఫిజియాలజిలో 8, బయోకెమిస్ట్రీలో 4, ఫార్మకాలజిలో 5, పాథాలజిలో 13, మైక్రోబయాలజిలో 4, ఫోరెన్సిక్ మెడిసిన్‌లో 5, ఎస్పీఎంలో 6, జనరల్ మెడిసిన్‌లో 8, జనరల్ సర్జరీలో 17, ఆబ్స్ట్రిక్ట్అండ్ గైనకాలజిలో 17, అనెస్తీషియాలో 13, పీడియాట్రిక్స్‌లో 13, ఈఎన్‌టిలో 3, డీవీఎల్‌లో 3, టీబీసీడీలో 7, సైకియాట్రిలో 7, రేడియోడయోగ్రోసిస్లో 13, రేడియోథెరపిలో 4, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 3, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్‌లో 1, కార్డియాలజిలో 5, గ్యాస్ట్రో ఎంట్రాలజిలో 2, న్యూరాలజిలో 3, ఎండోక్రైనాలజిలో 1, నెఫ్రాలజిలో 1, సీటీ సర్జరీలో 4, ప్లాస్టిక్ సర్జరీలో 2, డెంటిస్టీలో 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. -
పాత్రికేయుల హెల్త్‌పాలసీ పొడిగింపు
అమరావతి: రాష్ట్రంలో పాత్రికేయులకు ఇచ్చే ఆరోగ్య పథకం మరో ఏడాది (2017-18) కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సమాచార ప్రజా సంబంధాల కమిషనర్ ఇచ్చిన వినతి మేరకు జర్నలిస్టులకు వర్తించే హెల్త్ స్కీమును ఏడాది పొడిగించామని, ఈమేరకు ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ సీఈఓ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
జీజీహెచ్‌లో పూనం మాలకొండయ్య తనిఖీలు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం కూడా తనిఖీలు నిర్వహించారు. వైద్య ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రతీ నెలా ఓ బోధనాస్పత్రిలో మూడు రోజుల పాటు ఆమె తనిఖీలు నిర్వహించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రోగులను అడిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైద్య పరికరాలు ,మెరుగైన వైద్యం ఎలా అందించాలి అనే అంశాలపై ఆమె దృష్టి సారించారు. గత నెల విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
రైతుకు చేయూతనిద్దాం
సిద్దిపేట జోన్: రైతు సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ ముందుకు సాగుతోందని, అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు కృషి చేసి రైతుకు చేయూతనివ్వాలని మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం ఆమె సిద్దిపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు, పత్తి మార్కెట్, రైతు బజార్లను సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకుముందు పలు శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు చేయూతనిచ్చే విధంగా అధికార యంత్రాంగం పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో వినూత్నంగా అంగన్వాడీల ద్వారా మహిళలు, శిశువులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కొత్త పథకాన్ని రూపకల్పన చేసిందన్నారు. విజయ డెయిరీని పౌల్ట్రీ పరిశ్రమతో సమన్వయ పరుస్తూ ప్రతి రోజు ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, ఆరు సంవత్సరాలలోపు చిన్నారులకు కోడిగుడ్డు, పాలు, నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ తన సర్వేలో 65 శాతం మహిళలకు రక్త హీనత ఉందని తేల్చిందన్నారు. అందువల్ల మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల్లో మదర్స్ కమిటీని ఏర్పాటు చేసి అంగన్వాడీల పనితీరును మెరుగుపరుస్తామన్నారు. సిద్దిపేటలో అత్యాధునిక రైతు బజార్ రాష్ట్రంలోనే అత్యాధునికమైన రైతు బజార్‌ను సిద్దిపేటలో నిర్మించాలని సర్కార్ భావిస్తోందని పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఏఎంసీ మార్కెట్ యార్డును త్వరలోనే పత్తి మార్కెట్‌యార్డులోకి మార్చనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు సిద్దిపేట మార్కెట్ యార్డుకు వస్తున్న ధాన్యం కొనుగోళ్ల వివరాలు, సమస్యలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రస్తుత యార్డులోనే పండ్లు, కూరగాయలు , చేపలు, మాంస విక్రయించేలా వసతులు కల్పిస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు రూపొందించిన ప్రణాళికను ఆమె పరిశీలించారు. యార్డులో రైతులు పండించిన కూరగాయలు పరిస్థితులకు అనుగుణంగా విక్రయాలకు వస్తాయని, ఆ దిశగా బహుళ ప్రయోజనాలతో కూడిన వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చేపల మార్కెట్‌కు అనుగుణంగా యార్డులో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, కోల్డ్ స్టోరేజ్ వసతి, హోల్‌సేల్ విక్రయాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని ఆమె ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉద్యానశాఖ అధికారులతో సమీక్షిస్తూ రైతుల డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలను పంపిణీ చేయాలన్నారు. ‘మన ఊరు, మన కూరగాయలు’ తరహాలోనే విస్త్రత ప్రచారం చేపట్టాలన్నారు. వచ్చే సీజన్ నాటికి సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పెద్ద రైతు బజార్‌ను నిర్మించేలా సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డెరైక్టర్ లక్ష్మిబాయి, డిప్యూటీ డెరైక్టర్ మల్లేశం, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్, పశు సంవర్దక శాఖ జేడీ లకా్ష్మరెడ్డి, ఉద్యాన శాఖ ఏడీ రామలక్ష్మి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఏడీఏలు వెంకటేశ్వర్లు, ఏఎంసీ కార్యదర్శి సంగయ్య, తహశీల్దార్ ఎన్వై గిరి పాల్గొన్నారు. -
‘పూనం’కు అదనంగా మహిళా, శిశు సంక్షేమం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనంగా మహిళా, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం జీవో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. మహిళ, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న సునీల్ శర్మను బదిలీ చేసి, ఆర్ అండ్ బీ కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం రవాణా, రోడ్లు భవనాల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న అజయ్‌మిశ్రాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఓఎస్డీగా బదిలీపై పంపారు. -
కూరగాయల సాగుతో లాభాలు
వికారాబాద్: దేశంలోనే జిల్లాలోని భూములు పండ్ల తోటలు, కూరగాయల పెంపకానికి అనువుగా ఉన్నాయని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని కొత్తగడి గ్రామంలో ఉత్తమ రైతు మోహన్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘మన ఊరు- మన కూరగాయలు’ రైతు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా రైతులు పండ్లు, కూరగాయల తోటల పెంపకంపై దృష్టి పెట్టాలని, మంచి లాభాలు పొందాలని సూచించారు. హైదరాబాద్‌లోని బోయిన్పల్లి మార్కెట్‌కు 80 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయన్నారు. జిల్లా రైతులకు కూరగాయల సాగుపై అవగాహన పెంచాలని అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారి అవసరాలకు రోజుకు 25 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమని, తెలంగాణ వ్యాప్తంగా కేవలం లక్ష మెట్రిక్ టన్నుల కూరగాయలే పండిస్తున్నారని అన్నారు. మిగతావన్నీ ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతున్నాయన్నారు. రైతుల వద్దకే వచ్చి కూరగాయలు కొనే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మామిడి, జామ పండ్ల తోటల్లో శాస్త్రీయ పద్ధతుల్లో అంటుకట్టి ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం అన్ని రకాల పద్ధతులను అవలంబిస్తున్నదన్నారు. వికారాబాద్ వ్యవసాయ ఉద్యాన క్షేత్రం నుంచి యేటా 5 లక్షల మొక్కలను అంటు కట్టి తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. అంతకుముందు పట్టణంలోని ఉద్యాన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, ఉద్యావన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సబ్ కలెక్టర్ హరినారాయణ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వడ్డీతో కలిపి రూ. లక్షలోపు రుణాలకు వర్తింపు
-
రుణమాఫీ రూ.లక్ష
* మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం * వడ్డీతో కలిపి రూ. లక్షలోపు రుణాలకు వర్తింపు * కొత్త రుణాలివ్వండి.. బ్యాంకర్లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ కి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 మార్చి 31వ తేదీ నాటికి రైతులు తీసుకున్న రుణాల అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి లక్ష రూపాయలలోపు ఉన్న పంట రుణాలకు మాత్రమే ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. పంట దిగుబడిని తాకట్టు పెట్టి ముందస్తుగా తీసుకున్న రుణాలు, ఒప్పంద రుణాలు, క్లోజ్డ్ క్రాప్లోన్లకు ఈ రుణమాఫీ వర్తించదని పేర్కొంది. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, వారికి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి వ్యవ సాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇవీ మార్గదర్శకాలు... * గ్రామాల వారీగా బ్యాంకు రుణాలు, రైతుల వివరాల జాబితా రూపొందిం చాలి. 2014 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం బకాయిలు ఎంతో లెక్కించాలి. * పంట, బంగారం రుణాలు ఎంత అనేది నమూనా పత్రంలో పేర్కొనాలి. గరిష్టంగా లక్ష రూపాయల దాకా రుణం ఉన్న రైతుల జాబితాను బ్యాంకు మేనేజర్ రూపొందించాలి. * ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి పంట, బంగారం తాకట్టు రుణాలు తీసుకున్నవారిని తొలగించడానికి వీలుగా... కుటుంబానికి లక్ష రూపాయల గరిష్ట రుణం ఉన్నవారి జాబితాను మండల స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పెట్టి అర్హుల జాబితాను రూపొందించాలి. * ఆ జాబితా ఆధారంగా తహసీల్దార్లు పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించి.. బోగస్‌లను గుర్తించాలి. రుణం తీసుకున్న రైతులకు భూమి ఉందా? లేదా ? అనేది పరిశీలించి.. తప్పుడు క్లెయిములు ఉంటే తొలగించాలి. * ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందనే విషయాన్ని జేఎల్ఎంబీసీ గుర్తించాలి. ఈ జేఎల్ఎంబీసీ సమావేశాలను డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు పర్యవేక్షించాలి. వీటిని జిల్లా సహకార సంస్థ ఆడిటర్లు తనిఖీ చేయాలి. * ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణా లు తీసుకున్న వారి రుణ మొత్తం లక్ష రూపాయల లోపు ఉంటే వారి పేరు తొలగించవద్దు. లక్ష కంటే ఎక్కువ దాటిన పక్షంలో ఏదో ఒక బ్యాంకు రుణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. * గ్రామాల వారీగా రుణ మాఫీ లబ్ధిదారు ల పేర్లను ప్రచురించాలి. ఆ జాబితాపై సామాజిక తనిఖీ నిర్వహించాలి. సామాజిక తనిఖీ సభ్యుల్లో ఎంపీడీవో, తహసీల్దార్, బ్యాంకు బ్రాంచి మేనేజర్, ఏఆర్ (ఎస్‌డీఎల్‌సీవో) సభ్యులుగా ఉంటారు. ఈ తనిఖీలో వచ్చిన అభ్యంతరాల అనంతరం అర్హుల జాబితాను రూపొందించాలి. * రుణమాఫీ అర్హుల జాబితా, మాఫీ అయ్యే రుణ మొత్తం ఎంతనేది జాబితాగా రూపొందించి బ్యాంకు నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ఆ జాబితాను జిల్లా కలెక్టరుకు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజరుకు పంపించాలి. ఈ జాబితాల ఆధారంగా జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించాలి. బ్యాంకుల వారీగా రుణమాఫీ, రైతుల వివరాలను నమోదు చేసి ఎస్ఎల్బీసీకి పంపించాలి. * జిల్లాల నుంచి వచ్చిన అర్హుల జాబితా, రుణమాఫీ మొత్తాన్ని లెక్కించి ఆ మేరకు ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ పొందే విధంగా నివేదికను సమర్పించాలి. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకులకు సర్దుబాటు చేస్తుంది. ప్రభుత్వం చెల్లించిన డబ్బును రైతుల ఖాతాలకు జమచేసినట్లు బ్యాంకులు సర్టిఫై చేయాలి. * రైతుల ఖాతాల్లో నిధులను సర్దుబాటు చేసే ముందు రైతుల నుంచి హామీ పత్రం తీసుకోవాలి.మోసంతో రుణమాఫీ పొందలేదని, మోసం చేసినట్లు తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని రైతుల నుంచి హామీపత్రం తీసుకోవాలి. * మండల స్థాయి బ్యాంకర్ల కమిటీలు నెల రోజుల్లోగా సమావేశమై బ్యాంకుల వారీగా, గ్రామాల వారీగా రైతుల జాబి తాను, రుణాల మొత్తాన్ని తేల్చాలి. అనంతరం ఆడిటర్లు బ్యాంకర్లు ఇచ్చిన దాన్ని ఆడిట్ చేసి చీఫ్ ఆడిటర్‌కు సమర్పించాలి. * రుణమాఫీ పొందే రైతుల జాబితా కరక్టేనన్న బాధ్యతను బ్యాంకులు స్వీకరించాలి. * ఈ రుణమాఫీ ఫిర్యాదులకు సంబంధించి వచ్చే ప్రతీ దరఖాస్తును నెల రోజుల్లోగా పరిష్కరించేందుకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షక, ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చే యాలి. * రుణమాఫీకి ఎవరు అర్హులన్న మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసినందున ఆ రుణ భారం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి తక్షణమే బ్యాంకర్లు కొత్త పంట రుణాలు రైతులకు ఇవ్వాలి. రైతులు ఎప్పుడు రుణాలు రెన్యువల్ చేసుకున్నా... దానితో సంబంధం లేకుండా 2014 మార్చి 31 నాటికి ఉన్న రూ. లక్ష లోపు రుణాలను బ్యాంకులకు రీయింబర్స్ చేయనున్నట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. * బ్యాంకులు సమర్పించే నివేదికలకు సంబంధించి ఆరు ఫార్మాట్లను రూపొందించారు. ఎ) పంట రుణాల వివరాలు బి) బంగారం తాకట్టు రుణాల వివరాలు సి) పంట, బంగారం తాకట్టు రుణాలు డి) ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలున్న రైతుల జాబితా ఇ) తుది నివేదిక ఎఫ్) రుణమాఫీ చేసినట్లుగా రైతులకు బ్యాంకులు ఇచ్చే సర్టిఫికెట్. -
విభజన దిశగా ఎస్సీఈఆర్టీ!
విభజన దిశగా ఎస్సీఈఆర్టీ! వేరు చేయడమే మంచిదన్న భావన పాఠ్య పుస్తకాల్లో మార్పుల నేపథ్యంలో ఆలోచనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో పాటే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ)ని కూడా విభజించడం అనివార్యమని విద్యాశాఖ భావిస్తోంది. గురువారం విద్యా శాఖ విభజనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సెకండరీ విద్యా ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ విభజనకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు ఏడాది పాటు సేవలు అందించాల్సిన శిక్షణ సంస్థల జాబితాలో (పదో షెడ్యూలులో) ఎస్సీఈఆర్టీని కూడా కేంద్రం చేర్చింది. అయితే రాష్ట్ర విభజన తరువాత ఎస్సీఈఆర్టీని కూడా విభజించాలని... వేర్వేరు రాష్ట్రాల పాఠ్య పుస్తకాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురావాల్సిన అంశాలపై వేర్వేరు ఎస్సీఈఆర్టీలు ఉండటమే ముఖ్యమని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరుగుతోందని ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ప్రభుత్వం కూడా పదో షెడ్యూలులో ఏయే సంస్థలను కొనసాగించాలి? ఏయే సంస్థలను అందులోంచి మినహాయించాలి? ఏయే సంస్థలను అందులో చేర్చాలి? అనే అంశాలపై చర్చిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీని పదో షెడ్యూలు నుంచి తొలగించి, రెండుగా విభజించడమే మంచిదని అధికార వర్గాలు యోచిస్తున్నాయి. ఈ మేరకు మార్పు చేసేలా ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. మరోవైపు పదో షెడ్యూలులో లేని ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని అందులో చేర్చాలని ఆలోచిస్తున్నారు. తద్వారా రాష్ట్ర విభజన జరిగినా మరో ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు పరీక్షల విభాగం సేవలు అందించే వీలు ఏర్పడనుంది. పదో తరగతిలో వార్షిక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల విధానం ఉన్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించింది. -
మహిళలకు సరస్వతీ కటాక్షం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 19 జిల్లాల్లో ఇప్పటికీ మహిళల అక్షరాస్యతలో వెనుకబడిన మండలాలు 470కి పైగా ఉన్నాయి.. వాటిల్లోని 9,505 గ్రామాల్లో 5,70,000 మంది మహిళలు ఇంకా నిరక్షరాస్యులే. అక్షరాస్యత కోసం గతంలో వయోజన విద్య, మూడేళ్లుగా సాక్షర భారత్ వంటి కార్యక్రమం అమలు చేస్తున్నా.. ఇంకా మహిళలు అక్షరాస్యతలో వెనుకబడే ఉన్నారు.అందుకే 15 నుంచి 55 ఏళ్లలోపు మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం పట్ల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. 9,505 గ్రామాల్లో ఇప్పటికే ఉన్న వయోజన విద్యా కేంద్రాలు కాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, నవంబర్ 15 నుంచి ఆరు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. వీటిల్లో చదువుకున్న మిహ ళల్లో ఆసక్తి కలిగిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో ఇంటర్ వరకు చదువుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీతో అనుసంధానం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇదీ ప్రత్యేక కార్యక్రమం... ఒక్కొక్క గ్రామంలో రెండు కేంద్రాల వరకు ఏర్పాటు చేస్తారు. ఇద్దరు ఇన్స్ట్రక్టర్లను నియమిస్తారు. ఒక్కో కేంద్రంలో 30 మందిని చేర్పించాలి. రోజుకు 2 గంటలు నిర్వహించే కేంద్రంలో 30 మందిలో కనీసం 25 మందిని పూర్తి స్థాయిలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇన్స్ట్రక్టర్దే. ఆరు నెలల తరువాత వారికి జాతీయ ఓపెన్ స్కూల్ సంస్థ(ఎన్ఐఓఎస్) పరీక్ష నిర్వహించి అక్షరాస్యులుగా సర్టిఫికెట్లు ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కుటుంబ బాధ్యతల్లో పడి చదువుకు దూరమైన మహిళలు ఐదేళ్లలోనే ఇంటర్మీడియెట్ వరకు చదువుకునేలా చూస్తామని పూనం మాల కొండయ్య వివరించారు. నిరక్షరాస్యుల్లో అధిక శాతం మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీలే అయినందున వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అక్షరాస్యత కార్యక్రమంలో చదువుకున్న తర్వాత ఆసక్తి ఉంటే, మొదటి ఏడాది ఓపెన్ స్కూల్లో 3, 5 తరగతులు ఒకే ఏడాదిలో చదుకోవచ్చు. తరువాత ఏడాది 8వ తరగతి చదువుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ మరుసటి సంవత్సరంలో పదవ తరగతి చదువుకొని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రెండేళ్లలో ఇంటర్మీడియెట్ చదువుకునేలా అవకాశం కల్పిస్తున్నారు.