‘పూనం’కు అదనంగా మహిళా, శిశు సంక్షేమం | Punam malakondaiah to take charge of Women and Child Welfare | Sakshi
Sakshi News home page

‘పూనం’కు అదనంగా మహిళా, శిశు సంక్షేమం

Published Sat, Nov 15 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

Punam malakondaiah to take charge of Women and Child Welfare

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అదనంగా మహిళా, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను (పూర్తి అదనపు బాధ్యతలు) ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం జీవో జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. మహిళ, శిశు, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న సునీల్ శర్మను బదిలీ చేసి, ఆర్ అండ్ బీ కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం రవాణా, రోడ్లు భవనాల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న అజయ్‌మిశ్రాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న కార్తికేయ మిశ్రాను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఓఎస్‌డీగా బదిలీపై పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement