వైద్య సేవలకు వర్షం ఎఫెక్ట్
జీజీహెచ్‌లోని పలు విభాగాల్లో చేరిన నీరు
సగానికి తగ్గిన ఓపీ
గుంటూరు మెడికల్ : రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జీజీహెచ్‌లోని పలు వైద్య విభాగాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌పేషేంట్ విభాగం,అవుట్‌పేషేంట్ వి భాగాల్లోని శ్లాబ్ లీకులు ఏర్పడి వర్షపు నీరు పలు వార్డుల్లో చేరటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వార్డుల్లో పడకలు నిండుగా ఉండటంతో కొందరు రోగులకు వరండాల్లో మంచాలువేసి ఉం చారు. నిరంతరంగా కురుస్తున్న జల్లులతో వరండాల్లో నీరు చేరటంతోపాటు చలిగాలులు వీస్తూ ఉండటంతో వరండాల్లోని మంచాలపై రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది.
వర్షం వల్ల జీజీహెచ్‌లో ఓిపీ రోగుల సంఖ్య గురువారం తగ్గింది. ప్రతిరోజూ సుమారు 2500 కంటే పైబడే రోగులు వస్తుండగా, గురువారం 1254 మంది మాత్రమే ఓపీ వైద్యసేవలు వినియోగించుకున్నారు. జీజీ హెచ్ మెడికల్ ఆఫీసర్స్ గది ముందు వర్షపు నీరు భారీగా చేరటంతో వైద్యులు లోపలకి వెళ్ళలేని ప రిస్థితి. పురాతన భవనం అవ్వటంతో లీకుల ద్వా రా వర్షపు నీరు ఆ గదిలో సైతం నిలిచిపోయింది.
ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ అండ్ ట్రామాసెంటర్‌లోని సెల్లార్ అంతా లీకులు ఉండటంతో వర్షపు నీరు వచ్చి చేరింది. వైద్యులు, వైద్య సిబ్బంది కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకునే సెల్లార్‌లో నీరు నిలిచి వాహనాలు తడుస్తూ ఉండటంతో ఇంజనీరింగ్ అధికారుల పనితీరును వైద్య సిబ్బంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. సుమారు 33 కోట్ల రూపాయలతో నిర్మించిన మిలీనియం బ్లాక్‌లో లీకులు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో రూ.20 కోట్లతో జీజీహెచ్‌లో నిర్మాణం చేయనున ్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనైనా ఇలాంటి సమస్యలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.