కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో నకిలీ డాక్టర్‌ హల్‌చల్‌ | duplicate doctor in kakinada ggh | Sakshi
Sakshi News home page

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో నకిలీ డాక్టర్‌ హల్‌చల్‌

Published Fri, Nov 11 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

duplicate doctor in kakinada ggh

  • ∙నిందితుడ్ని పట్టుకున్న హౌస్‌ సర్జ¯ŒS
  • ∙పోలీసులకు అప్పగింత
  • కాకినాడ వైద్యం :
    కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ, వైద్యుల మధ్య సమన్వయం లోపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితు లు నెలకొన్నాయి. ముఖ్యంగా పిడియాట్రిక్‌ వార్డులో కొంత కాలంగా నకిలీ పీజీ వైద్యుడు తిరుగుతుంటే గుర్తు పట్టలేని  మొద్దునిద్రలో ఆస్పత్రి పరిపాలనా విభాగం ఉంది. ఇదే వార్డులో అక్టోబర్‌ 27న రాజవొమ్మంగి మండలం కిండ్ర గామానికి చెందిన రెండు రోజుల పసికందు అపహరణకు గురవ్వడంతో అంతా ఉలిక్కిపడ్డారు. సీసీ కెమెరా పుటేజీతో నిందితురాలిని పోలీసులు పట్టుకుని పసిపాపను తల్లి ఒడికి చేర్చడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ తరణంలో శుక్రవారం ఆస్పత్రిలో నకిలీ పీజీ వైద్యుడి పట్టివేతతో మరోసారి ఆస్పత్రి వార్తల్లోకెక్కింది. 
    గొప్ప కోసం నకిలీ పీజీ డాక్టర్‌గా అవతారం... 
    తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం గంగవరం మండలం రాములదేవుపురం గ్రామానికి చెందిన ఇరవై ఆరేళ్ల ఎ¯ŒS.శివగోవింద్‌ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. చదువు అబ్బకపోవడంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేసేవాడు. సొంత గ్రామంలో ఇతడిని అందరూ డాక్టర్‌ అని పిలవడంతో నిజంగా డాక్టర్‌లాగా మారాలనుకున్నాడు. తన గ్రామ పరిసరాల ప్రజలకు వైద్యుడిలా కనిపించేందుకు రూ.150లతో రాజమండ్రిలో ఓ స్టెతస్కోప్‌ కొన్నాడు. రోగులకు సహాయకుడిగా కాకినాడ ఆస్పత్రికి రావడం, వెళ్లడం చేస్తున్నాడు. పిడియాట్రిక్‌ విభాగంలో వైద్యులు, హౌస్‌ సర్జన్లు, పీజీ డాక్టర్లు లేని సమయాన్ని గుర్తించి, మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని వార్డులో సంచరించేవాడు. రోగుల వద్దకెళ్లి రిపోర్టులు పరిశీలించి, అచ్చం వైద్యునిలాగా ప్రవర్తించేవాడు. ఇలా చాలా కాలం నుంచి కాకినాడ ఆస్పత్రిలో సంచరిస్తున్న శివగోవింద్‌ను పిడియాట్రిక్‌ వార్డులో హౌస్‌సర్జ¯ŒSగా పనిచేస్తున్న డాక్టర్‌ డి.శ్రీహరి గుర్తించారు. ఆస్పత్రిలోని సైకిల్‌స్టాండ్‌ వద్ద అతడ్ని పట్టుకుని నీవు ఏ వైద్య కళాశాల్లో ఎంబీబీఎస్‌ చేశావు, ఎక్కడ పీజీ చేస్తున్నావు, ఏ బ్యాచ్‌కు చెందినవాడంటూ నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే నిందితుడ్ని ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవో మూర్తి వద్దకు తీసుకెళ్లి అప్పగించారు. అతడ్ని ప్రశ్నించగా తాను ఎవరికి వైద్యం చేయలేదని బదులిచ్చాడు. విచారణ అనంతరం నిందితుడ్ని కాకినాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేçÙ¯ŒSకి తరలించారు. తన గ్రామ పరిసర ప్రాంతాల్లో గిరిజనులందరూ తనను డాక్టరని పిలవడంతో, వారికి ఆస్పత్రిలో వైద్య సహాయం చేసేందుకే గొప్పకి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరుగుతున్నట్టు నిందితుడు విచారణలో చెప్పినట్టు సీఐ ఎ.ఎస్‌.రావు తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement