in kakinada
-
సాహితీవనంలో తులసిమొక్క ‘అద్దేపల్లి’
సంస్మరణసభలో ప్రముఖుల నివాళి ‘అల్లూరి’ వీరగాథ ఆవిష్కరణ కాకినాడ కల్చరల్ : ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహితీవనంలో తులసి మొక్కవంటి వారని ప్రముఖ సాహితీవేత్త గిడ్డి సుబ్బారావు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో అద్దేపల్లి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అద్దేపల్లి సంస్మరణ సభ గిడ్డి అధ్యక్షతన అదివారం జరిగింది. అద్దేపల్లి రచించిన వచనకవితా విప్లవ వీరకథాకావ్యం ‘అల్లూరి సీతారామరాజు’ను గిడ్డి ఆవిష్కరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా గిడ్డి మాట్లాడుతూ అద్దేపల్లి నడిచే గ్రంథాలయం వంటి వారన్నారు.‘అల్లూరి సీతారామరాజు’ కావ్యంపై సాహిత విమర్శకులు మేడి రవికుమార్ సమీక్ష చేశౠరు. తెల్లదొరల పాలనపై పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు గాథ మనందరికి ఆదర్శంగా నిలిచే విధంగా అద్దేపల్లి రచించారన్నారు. అద్దేపల్లి కవిత్వమే శ్వాసగా జీవించారని మరో రచయిత డాక్టర్ శిరీష అన్నారు. దేశ విదేశాల్లో పేరుగాంచిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి సంధించిన విమర్మనాస్త్రం సంచలనం సృష్టించిందని కవి, విమర్శకులు కె.వి.రమణారెడ్డి అన్నారు. కవనలోకంలో వెలుగులు విరజిమ్మే ధృవతార అద్దేపల్లి మనల్ని వదిలి వెళ్ళి వసంతం గడిచినా, ఆయన రచనల గుబాళింపు తగ్గలేదని విమర్మకులు వాసా భూపాల్ అన్నారు. అద్దేపల్లి సాహిత్య వ్యవసాయంలో ఎందరో కవులు పుట్టుకొచ్చారని రచయిత పి.సీతారామరాజు అన్నారు. మహాకవి అద్దేపల్లి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనని కవి సయ్యద్ సాలర్ అన్నారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపై ఆయన వందలాది వ్యాసాలను రచించి ప్రజలను ఉత్తేజపరిచారని కవి పద్మవాణి అన్నారు. అనేక మంది యువకవుల్ని తయారు చేసిన ఘనత అద్దేపల్లి సొంతమని రచయిత అద్దేపల్లి రాధాకృష్ణ అన్నారు. సమకాలీన పరిస్థితులపై అప్పటికప్పుడు రచనలు చేయడం ఆయన శైలి అని వక్తిత్వ వికాస సమాజం కో ఆర్డినేటర్ అద్దేపల్లి ఉదయభాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితివేత్తలు, కవులు దేవదానంరాజు, భగవాన్, పి.వెంకటప్పయ్య, వీరలక్షీ్మదేవి తదితరులు పాల్గొన్నారు. -
రేపు కాకినాడలో ఆర్ఆర్బీ మోడల్ పరీక్ష
బాలాజీచెరువు(కాకినాడ) : రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లోకోపైలట్ మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కుసుమశాంతి ఆదివారం తెలిపారు. ప్రతిభ ఎడ్యుకేష¯ŒS ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ ఉత్తీర్ణులతో పాటు ఆ విభాగాల బీటెక్ అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల వారు సోమవారం సాయంత్రంలోగా రాజీవ్‌గాంధీ కళాశాలలో పేర్లు నమోదు చేయించుకోవాలని, ఇతర వివరాలకు 85229 86347లో సంప్రదించాలని సూచించారు. -
కాకినాడలో మూడు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు
ఈ రైల్వే బడ్జెట్లోనూ జిల్లాకు ప్రాధాన్యం ఎంపీ తోట నరసింహం కరప: కాకినాడలో మూడు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు ఎంపీ తోట నరసింహం తెలిపారు. సోమవారం సాయంత్రం కరపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారి¯ŒS ట్రేడింగ్, ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ కేంద్రాలను కాకినాడలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని, త్వరలోనే మంజూరవుతాయని చెప్పారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ » బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. ఈ ఏడాది సాధారణ, రైల్వే బడ్జెట్లు కలిపి పెట్టనున్నట్టు తెలిపారు. రైల్వే బడ్జెట్లో గత ఏడాది పిఠాపురం మెయి¯ŒSలైన్, కాకినాడ–నరసాపురం లై¯ŒSకు కేటాయించిన రూ.200 కోట్లతో పనులకు టెండర్లు ఖరారయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రైల్వేమంత్రి సురేష్‌ప్రభును ఆంధ్రా మంత్రులు, ఎంపీలు కల్సి ఈ ఏడాదికూడా రైల్వేబడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై చర్చించామన్నారు. గత ఏడాది కేటాయించిన దానికి తగ్గకుండా నిధులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని, అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని, దానికి ప్రజలు కూడా సహకరించారని చెప్పారు. తాను దత్తత తీసుకున్న బూరుగుపూడి రోల్‌మోడల్‌గా తయారైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్టంలోని అన్నిప్రాంతాలవారినీ అక్కడకు పంపి, అలాచేసుకోవాలని సూచిస్తున్నారని చెప్పారు. కరప మండలంలోని దత్తత గ్రామమైన గొర్రిపూడిని కూడా అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తానన్నారు. ఉపాధి అనుసంధానంతో ఇప్పటికే రూ.70 లక్షలు కేటాయించామని వివరించారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బుంగా సింహాద్రి, మండల టీడీపీ అధ్యక్షుడు దేవు మధువీరేష్, జిల్లా క్రికెట్ అసోషియేష¯ŒS ఉపాధ్యక్షుడు దేవు మధువీరేస్ తదితరులు ఎంపీ వెంట ఉన్నారు. -
సంబరాలు ఆరంభం
బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి రాజప్ప పర్యాటకులకు కనువిందు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు తీరంలో నాలుగు రోజులు కొనసాగనున్న సందడి ఉవ్వెత్తున ఎగసే జలధి తరంగాలు మనసులో వెల్లువెత్తే ఉత్సాహానికి ఉపమానాలు. ఆ అలల సాక్షిగా.. కాకినాడ కడలి తీర సందర్శకుల మదిలో అటువంటి ఉత్సాహమే ఉరకలెత్తింది. గురువారం ప్రారంభమైన సాగర సంబరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో, వివిధ రకాల పశు ప్రదర్శనలు, స్టాల్స్.. ఇటు విజ్ఞానాన్ని, అటు ఆనందాన్ని పంచాయి. సంక్రాంతి సందడి ఈ సంబరాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. నిశి ముసిరిన వేళ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులను అలరించాయి. కాకినాడ బీచ్‌లో గురువారం సాగర సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆ«ధ్యాత్మికత విలసిల్లే ఆలయ నమూనాలు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే థింసా.. కొమ్ము నృత్యాలు, చేనేతల అందాలు, రంగురంగుల పూల సోయగాలు, నోరూరించే వంటకాలు, కళాకారుల నైపుణ్యానికి అద్దం పట్టే శిల్పాలు, చిత్రాలు, జాతీయ సమైక్యతను చాటి చెప్పే సాంస్కృతిక ప్రదర్శనలు సాగరతీరంలో కొలువుదీరి పర్యాటకులకు కనువిందు చేశాయి. బెంగళూరు ఫ్లవర్ షో, వ్యవసాయశాఖ, పురావస్తుశాఖ, ఇండియ¯ŒS కోస్ట్‌గార్డ్, ఏపీ టూరిజం, ఉద్యానవనం, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మత్య్సశాఖ ఆధ్వర్యంలో రొయ్యల పుట్టుక, పెరిగే విధానం, వాటిని ఎగుమతి చేసే పద్ధతులు వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్లో వివిధ రకాల మత్స్యసంపదను ప్రదర్శించారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించే విధానాలు, నేత, దారాలకు రంగులు అద్దె తీరు, వస్రా్తలు తయారు చేసే పద్ధతిని వివరించే విధంగా స్టాల్స్ పెట్టారు. పశుసంవర్ధక శాఖకు చెందిన స్టాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో డాగ్ షోను, పుంగనూరు ఆవు, దూడ, ఒంగోలు ఆవు, ముర్రాగేదె, గిరి ఆవులను ప్రదర్శనలో ఉంచారు. – కాకినాడ రూరల్ నోరూరించిన వంటకాలు గోదావరి వంటకాలు, పెరుమాళ్లపురం బెల్లంగారెలు, మారేడుమిల్లికి చెందిన బ్యాంబూ చికెన్, గోదావరి మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన 36 రకాల సముద్ర ఉత్పత్తుల వంటకాలు, సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామం జీడిపప్పు, పచ్చళ్ల వ్యాపారం, ఆత్రేయపురం నేతి పూతరేకులు, మాడుగుల అల్వా, రాయలసీమ బిర్యానీ, నాటుకోడి పులుసు, రాగి సంగటి, పెద్దాపురం పాలకోవా ఇలా 100కి పైగా వివిధ రకాల వంటకాలతో కూడిన స్టాల్స్‌తో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన తినుబండారాలు నోరూరించాయి. ఇలా సాగరతీరంలో 400 రకాల స్టాల్స్ పర్యాటకులకు కనువిందు చేశాయి. అలరించిన శిల్పాలు, చిత్రాలు ఒడిశాకు చెందిన కళాకారులు బీచ్‌లో వేసిన నగదు రహిత విధానాన్ని తెలిపేలా, జిల్లా నమూనాలో ఉన్న సముద్ర ఉత్పత్తులు, వివిధ పంట ఉత్పత్తులతోను, మత్స్యకన్య, బుద్ధుడు, తిరుమల, తిరుపతి దేవస్థానం, శ్రీకృష్ణుడు వంటి సైకత శిల్పాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఆకట్టుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. దీన్ని ప్రకాశంజిల్లా అద్దంకికి చెందిన కళాకారులు ఏర్పాటు చేశారు. విరుల విందు బెంగళూరు, చెన్నైలతో పాటు జిల్లాలోని కడియం, కడియపులంక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 350 వరకు వివిధ జాతుల పూల మొక్కలు, బోన్సాయ్, వివిధ రకాల కొటా¯Œ్స మొక్కలు, వివిధ పండ్లతో తయారు చేసిన దేవుళ్ల ఆకారాలను ప్రదర్శించారు. నమూనా ఆలయాలకు పోటెత్తిన భక్తులు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నవరం దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి నమూనా దేవస్థానాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా సముద్రతీరంలో తాటాకులతో ప్రత్యేక ఇళ్లను జిల్లా విద్యాశాఖ నిర్మించింది. సంక్రాంతి పండగ గ్రామాల్లో ఏ విధంగా ఉండేదో వివరిస్తూ గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగిమంటలు ఏర్పాటు చేశారు. గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గంగిరెద్దులు, హరిదాసు, గరగల నృత్యం, కోలాటం, కాళికానృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే «థింసా, కొమ్ము నృత్యం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. జిల్లా సంస్కృతి చాటేలా బీచ్‌ఫెస్టివల్ కాకినాడ రూరల్ : జిల్లా చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా నాలుగురోజులపాటు ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. గురువారం రాత్రి కాకినాడ సాగరతీరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌ను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. తూర్పుగోదావరి ప్రాకృతిక సౌందర్యం, సంస్కృతీసంప్రదాయాలకు పర్యాటక పరమైన ప్రాచుర్యం కల్పించేందుకు ఏటా క్రమం తప్పకుండా కాకినాడ బీచ్ ఫెస్టివల్, కోనసీమ, మన్యం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాకినాడ నుంచి అంతర్వేది, రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం, మారేడుమిల్లి సర్క్యూట్లను రూ.350 కోట్లతో అభివృద్ధి చేసి జిల్లాను టూరిజం హబ్‌గా రూపుదిద్దుతున్నట్టు చినరాజప్ప వివరించారు. వచ్చే ఏడాది బీచ్ ఫెస్టివల్‌ను జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి రూ.23 కోట్లతో మొదట దశ పనులు పూర్తి చేశామన్నారు. బీచ్ ఫెస్టివల్ తరహాలో ఫిబ్రవరిలో కోనసీమ ఉత్సవాలు, మార్చిలో మన్యం ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రూ.100 కోట్లు బీచ్ అభివృద్ధికి కేటాయించారన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, వనమాడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యులు కాకరపల్లి సత్యవతి, ఎంపీటీసీ సభ్యులు కర్రి సత్యనారాయణమూర్తి, స్థానిక సర్పంచ్ యజ్జల బాబ్జీ తదితరులు ఈ సాగర సంబరాలను పర్యవేక్షించారు. -
కవిత్వమే ఊపిరిగా బతికిన ప్రజాకవి
నేడు ‘అద్దేపల్లి’ ప్రథమ వర్ధంతి ∙ 22న ‘అల్లూరి వీరగాథ’ ఆవిష్కరణ కాకినాడ కల్చరల్ (కాకినాడ సిటీ): కవిత్వమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు. తన సుదీర్ఘ సాహిత్య ప్రస్థానంలో అభ్యుదయ భావాలకు పట్టం కట్టిన ఆయన గత ఏడాది జనవరి 13న తుదిశ్వాస విడిచారు. చివరిగా ఆయన చేతినుంచి జాలువారిన ‘అల్లూరి సీతారామరాజు వీరగాథ’ కావ్యం(వచన కవిత)ను ఈనెల 22న స్థానిక రోటరీ క్లబ్లో జరగనున్న అద్దేపల్లి ప్రథమ వర్ధంతి సభలో ఆవిష్కరించనున్నారు. ‘నిరంతర సాహితీ సంచారి’గా పేరొందిన అద్దేపల్లి 1936లో సెప్టెంబరు 6న మచిలీపట్నంలో అద్దేపల్లి సుందరరావు, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివి, మచిలీ పట్నం, నందిగామలలో అధ్యాపకునిగా పనిచేసారు. తదుపరి 1972లో కాకినాడలోని మల్లాడి సత్యలింగనాయకర్ చారిటీస్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా చేరిన ఆయనకు ఈ నగరమే శాశ్వత నివాసం అయింది. కవిగా, విమర్శకునిగా, వక్తగా, కవిత్వ కార్యకర్తగా రాష్ట్రం అంతా పర్యటించి వందలాది యువకవుల్ని తయారు చేశారు. ‘మధుజ్వాల, అంతరŠాజ్వల, రక్తసంధ్య, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం, గోదావరి నా ప్రతిబింబం’ మొదలైన ఎన్నో కవితా సంకలనాలు వెలువరించారు. నిరంతరం ముఖంలో చెదరని చిరునవ్వు, వినూత్నమైన హెయిర్ స్టైల్, ఇ¯ŒSషర్ట్లతో కనిపించే ఆయన సాహితీ లోకానికి సుపరిచితుడు. సాహిత్య లోకానికి ఆయన ఒక సంచార గ్రంథాలయం. మహాకవి శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి రాసిన విమర్మనాగ్రంథం సంచలనం సృష్టించింది. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపైనా విమర్శకునిగా వందలాది వ్యాసాలను రచించారు. కవిత్వంలో ప్రతిష్టాత్మకమైన చిన్నప్పరెడ్డి పురస్కారం, నాగభైరవ అవార్డు లాంటి ఎన్నో గౌరవాలు అందుకున్నారు. దాదాపు వెయ్యిమంది నూతన కవుల సంకలనాలకు ముందుమాటలు రాసి ప్రోత్సహించారు. నిరంతరం రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో జరిగే సాహిత్య సభలలో సైతం పాల్గొని కవిత్వాన్ని ప్రచారం చేశారు. -
ఉద్రిక్తతల నడుమ క్వార్టర్స్ తొలగింపు
భారీగా పోలీసు బలగాల మోహరింపు తెల్లవారుజాము 4.30 గంటల నుంచే తొలగింపు ప్రక్రియ ప్రారంభం ఆందోళనకు దిగిన మహిళలు కాకినాడ వైద్యం : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బ్లాకు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ నడుంబిగించారు. ఆస్పత్రి వెనుక సుమారు 1.5 ఎకరా స్థలంలో ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల పాత క్వార్టర్స్‌లోని కట్టడాల తొలగింపు, సిబ్బంది తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని, నగరపాలక సంస్థ, పోలీస్‌లను ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ ఆర్డీవో అంబేద్కర్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎస్. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి పాత క్వార్టర్ వద్ద భారీ పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ సందర్భంగా పాతబస్టాండ్ నుంచి వార్ఫ్రోడ్డు మీదుగా టీబీ వార్డు విభాగం దాకా రోడ్డును పోలీసులు దిగ్బంధించారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పొక్లెయిన్, బుల్డోజర్లతో పాకలు, పాత కట్టడాల తొలగింపు ప్రారంభించారు. ఉన్నపళంగా పొమ్మంటే ఎలా? అధికారులు, పోలీసులతో సిబ్బంది తీవ్ర వాగ్వాదానికి దిగి ఉన్నట్టుగా పిల్లా, పాపలతో బయటకు వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళతామని మహిళలు వాదించారు. ఏడాదిగా ఖాళీ చేయాలని కోరుతున్నాం.. ఏడాదిగా క్వార్టర్లు ఖాళీ చేయాలని కోరామని, ఇప్పటికి మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి, రాగంపేటలో 4,600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూమిని సేకరించామని, అందులో ఇళ్ల స్థలాలిచ్చి, హౌసింగ్‌తో ఇళ్లు నిర్మించి ఇస్తామని కమిషనర్ చేత లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి దాకా తాత్కాలిక షెడ్లను రాగంపేటలో నిర్మించామని, అక్కడకు తరలి వెళ్లాలని కోరారు. అయితే డ్రెయి¯ŒSపై నిర్మించిన తాత్కాలిక షెడ్లు పిచ్చుకగూళ్లను తలపిస్తున్నాయని, అక్కడకు వెళ్లబోమని నివాసులు భీష్మించారు. ఈ దశలో ఇక్కడ నివసించే వారందరూ ప్రభుత్వ ఉద్యోగులమన్న సంగతి మరచిపోరాదని, జిల్లా ప్రజానీకానికి ఉపయోగపడే ఆస్పత్రి అభివృద్ధికి అడ్డుపడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం తీవ్ర వాగ్వాదం నడుమ పొక్లెయి¯ŒSతో కట్టడాల తొలగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్వార్టర్ల నుంచి ఖాళీ చేయించిన సిబ్బంది సామాన్లను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ట్రాక్టర్లపై వారి గృహాలకు తరలించారు. కాకినాడ డీఎస్పీ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుళ్లు, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు. అందరికీ ఇళ్లు.. పాత క్వార్టర్లో నివాసం ఉంటున్న 46 కుటుంబాలకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్డీవో తెలిపారు. 46 కుటుంబాల్లో 26 మంది ఆసుపత్రిలో రెగ్యులర్ ఉద్యోగులు కాగా, 14 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగతా 6 గురు సిబ్బంది బంధువులు ఉన్నట్లు తెలిపారు. 390 పడకలు అందుబాటులోకి వస్తాయి రూ.40 కోట్ల వ్యయంతో జీజీహెచ్‌లో నిర్మించనున్న మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బ్లాకు నిర్మాణం జరిగితే 390 పడకలు అందుబాటులోకి వస్తాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు తెలిపారు. భవన నిర్మాణ పనులకు ఎనిమిది నెలల కితం వైద్య,ఆరోగ్యమంత్రి డా.కామినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా హెచ్ఆర్ఏ తీసుకంటూ 2011 సంవత్సరం నుంచి క్వార్టర్‌లోనే నివాసం ఉంటున్న 26 మంది సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాలపై నోటీసులు ఇచ్చామన్నారు. ఆసుపత్రి అభివృద్ధిని దృష్టిని పెట్టుకుని సహకరించాలని కోరారు. -
ఉత్సాహంగా పోలీస్ సెలెక్షన్స్
కాకినాడ క్రైం : జిల్లా పోలీస్ పెరేడ్ మైదానం మహిళలతో కిటకిటలాడింది. పలు రకాల రంగుల ట్రాక్ సూట్లతో బృందాలుగా ఏర్పడి హుషారుగా పోలీస్ మైదానంలోకి తరలివచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేపట్టేందుకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొని తమ సత్తా చాటారు. 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇక లాంగ్ జంప్ విషయానికి వస్తే కళ్లు మిరిమిట్లు గొలిపేలా పరుగెత్తుకొచ్చి రివ్వున గాల్లోకి ఎగురుతూ సునాయాసంగా లక్ష్యాన్ని సాధించారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా శుక్రవారం మహిళా అభ్యర్థులకు ఏఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో జరిగాయి. మూడో రోజు నిర్వహించిన పరీక్షల్లో 754 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. నాలుగోరోజు నిర్వహించిన పరీక్షల్లో 1,101 మహిళలు హాజరు కావాల్సి ఉండగా, 723 మంది పాల్గొన్నారన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఏఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈవెంట్ల నిర్వహణ సజావుగా జరిగి మహిళలు ఊపిరిపీల్చుకున్నారు. ఈవెంట్లలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు తమ బంధువులను వెంటబెట్టుకుని పోలీస్ పెరేడ్ మైదానానికి వచ్చారు. మహిళల్లో ఉత్తేజాన్ని నింపిన పోలీస్‌లు నీ చూపు లక్ష్యంపై పెట్టు, ఒకటో లైన్లో అమ్మాయి స్పీడు పెంచు, రెండో లైన్లో అమ్మాయి ఇంకా జోరు పెంచాలి. అయిదో లైన్లో అమ్మాయి బాగా వెనకబడిపోయావు రెండు చేతులు ఊపుతూ లక్ష్యాన్ని అధిగమించంటూ మహిళా అభ్యర్థులను పోలీస్‌లు ప్రోత్సహించారు. పరుగు పందెంలో పోలీస్లిచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడలేని ఓపిక తెచ్చుకున్న మహిళలు లక్ష్యాన్ని అధిగమించడం కనిపించింది. పరుగులో అలసటకు లోనైన పలువురిని మహిళా పోలీసులు చేరదీసి సేవలందించారు. దేహదారుఢ్య పరీక్షల్లో 723 మంది పాల్గొన్నారు.ఫైనల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల మనోగతం ఇలా ఉంది. ఒరిజినల్ సర్టిఫికెట్ల లేక నిరాశగా అభ్యర్థులు వెనక్కి దేహదారుఢ్య పరీక్షల్లో తప్పనిసరిగా అభ్యర్థుల అర్హతలను తెలియజేసే ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని ముందుగా జిల్లా ఎస్పీ తెలిపినా కొంతమంది మహిళా అభ్యర్థులు వాటిని తీసుకురాకపోవడంతో సమస్య తలెత్తింది. పత్రాల పరిశీలన సందర్భంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు కొనసాగించేందుకు వీలుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలల్లో ఇచ్చామని, దాంతో సమయానికి వెంట తీసుకురాకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎస్డీ వై.రవిశంకరరెడ్డితో పాటూ పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, రిజర్వు పోలీస్ అధికారులు, మహిళా పోలీస్‌లు బందోబస్తు నిర్వహించారు. నాన్న ప్రోత్సాహంతో.... నాన్న ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివిస్తున్నాడు. నేను ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తర్వాత డీఎడ్ పూర్తి చేశా. కొద్ది మార్కుల తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగం తప్పిపోయింది. రెండో ప్రయత్నంగా నాన్న,అన్నయ్యల ప్రోత్సాహంతో మహిళా పోలీస్ పోస్టుకి దరఖాస్తు చేశా. నలభై అయిదు రోజులుగా జగన్నాథపురం జీపీటీ పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం గంటన్నరసేపు పరుగు, ఈవెంట్లపై ప్రాక్టీసు చేస్తున్నా. రెండో దశలో జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో పాసయి, ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించా. – వారుపిల్లి పద్మ, తూరంగి డ్రైవర్స్‌కాలనీ అభిరుచిని తెలుసుకుని... నా భర్త శివకుమార్ కర్నూలు సెంట్రల్ జైల్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట మాకు వివాహం జరిగింది. నాకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం. నాభర్త నా అభిరుచిని తెలుసుకుని ప్రత్యేక శిక్షణకు పంపారు. కష్టపడి చదవడం, ఈవెంట్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో రాణించగలిగా. ఫైనల్ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. – సీహెచ్.స్వాతి, రాజమండ్రి -
చదువుల ‘రాజ్యం’ అస్తమయం
ఏయూ తొలి మహిళా రీసెర్చ్ స్కాలర్‌గా గుర్తింపు పలు అవార్డులు ఆమె సొంతం స్వచ్ఛంద సేవల్లోనూ తనదైన ముద్ర కాకినాడ వైద్యం : ఆమె జీవితం సమాజానికి అంకితం.. మరణం తరువాత కూడా.. తాత రఘుపతి వెంకటరత్నం నాయుడులా ఆమె సైతం బహుముఖ ప్రజ్ఞ కనబరచి విద్యావేత్తగా సామాజికవేత్తగా ఖ్యాతి గడించారు. ఆమే డాక్టర్ రాజ్యలక్ష్మి సామాజిక వేత్త, చదువుల సరస్వతి, బ్రహ్మసమాజికుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు మనుమరాలు డాక్టర్ తెలికిచర్ల రాజ్యలక్ష్మి (88) అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె కోరిక మేరకు పరిశోధనల నిమిత్తం ఆమె పార్థివ దేహాన్ని స్థానిక రంగరాయ కళాశాలకు ఆమె సోదరుడు కుంభంపాటి కమల్ వెంకటరత్నం అప్పగించారు. సెంట్రల్ ఇ¯ŒSలాండ్ బ్రేకిష్ ఆక్వాకల్చర్ (సిబా) మాజీ డైరెక్టర్, ఆలిండియా బ్రహ్మసమాజం మాజీ అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న రాజ్యలక్షి్మని ఈ నెల 6న కాకినాడలోని ఓ ప్రైవేట్ (సేఫ్) ఆస్పత్రిలో చేర్పించామని ఆమె సోదరుడు తెలిపారు. డాక్టర్ రాజ్యలక్ష్మి కేంద్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. శాస్త్రవేత్తగా బ్రేకిష్ ఆక్వాకల్చర్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. రొయ్యలపై పరిశోధనలు చేసి, అమెరికా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. సంఘసంస్కరణోద్యమ నేతగా పేరొందిన కుంభంపాటి రామశాస్త్రి (తారక్) సుగుణ దంపతులకు 1929 లో రెండో సంతానంగా రాజ్యలక్ష్మి జన్మించారు. ఈమె 1956లో ఆంధ్రాయూనివర్సిటీలో తొలి మహిళా రీసెర్చ్ స్కాలర్‌గా రికార్డు నెలకొల్పారు. 1989–90లో కేంద్రప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. ఈమె భర్త శశి«భూషణ్ కూడా వ్యవసాయశాఖలో డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం కన్నుమూశారు. పదవీ విరమణ తర్వాత ఈమె ఆలిండియా బ్రహ్మసమాజం అధ్యక్షురాలిగా, కాకినాడ సమాజం అధ్యక్షురాలిగా పని చేశారు. కాకినాడలోని శ్రీరామ్‌నగర్‌లోని ఏబీసీ అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ రాజ్యలక్ష్మి తల్లి సుగుణ ప్రముఖ సంఘ సంస్కర్త రఘపతి వెంకటరత్నంనాయుడుకు కుమార్తె కావడం గమనార్హం. -
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో నకిలీ డాక్టర్ హల్చల్
∙నిందితుడ్ని పట్టుకున్న హౌస్ సర్జ¯ŒS ∙పోలీసులకు అప్పగింత కాకినాడ వైద్యం : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ, వైద్యుల మధ్య సమన్వయం లోపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితు లు నెలకొన్నాయి. ముఖ్యంగా పిడియాట్రిక్ వార్డులో కొంత కాలంగా నకిలీ పీజీ వైద్యుడు తిరుగుతుంటే గుర్తు పట్టలేని మొద్దునిద్రలో ఆస్పత్రి పరిపాలనా విభాగం ఉంది. ఇదే వార్డులో అక్టోబర్ 27న రాజవొమ్మంగి మండలం కిండ్ర గామానికి చెందిన రెండు రోజుల పసికందు అపహరణకు గురవ్వడంతో అంతా ఉలిక్కిపడ్డారు. సీసీ కెమెరా పుటేజీతో నిందితురాలిని పోలీసులు పట్టుకుని పసిపాపను తల్లి ఒడికి చేర్చడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ తరణంలో శుక్రవారం ఆస్పత్రిలో నకిలీ పీజీ వైద్యుడి పట్టివేతతో మరోసారి ఆస్పత్రి వార్తల్లోకెక్కింది. గొప్ప కోసం నకిలీ పీజీ డాక్టర్‌గా అవతారం... తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం గంగవరం మండలం రాములదేవుపురం గ్రామానికి చెందిన ఇరవై ఆరేళ్ల ఎ¯ŒS.శివగోవింద్ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. చదువు అబ్బకపోవడంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేసేవాడు. సొంత గ్రామంలో ఇతడిని అందరూ డాక్టర్ అని పిలవడంతో నిజంగా డాక్టర్‌లాగా మారాలనుకున్నాడు. తన గ్రామ పరిసరాల ప్రజలకు వైద్యుడిలా కనిపించేందుకు రూ.150లతో రాజమండ్రిలో ఓ స్టెతస్కోప్ కొన్నాడు. రోగులకు సహాయకుడిగా కాకినాడ ఆస్పత్రికి రావడం, వెళ్లడం చేస్తున్నాడు. పిడియాట్రిక్ విభాగంలో వైద్యులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు లేని సమయాన్ని గుర్తించి, మెడలో స్టెతస్కోప్ వేసుకుని వార్డులో సంచరించేవాడు. రోగుల వద్దకెళ్లి రిపోర్టులు పరిశీలించి, అచ్చం వైద్యునిలాగా ప్రవర్తించేవాడు. ఇలా చాలా కాలం నుంచి కాకినాడ ఆస్పత్రిలో సంచరిస్తున్న శివగోవింద్ను పిడియాట్రిక్ వార్డులో హౌస్‌సర్జ¯ŒSగా పనిచేస్తున్న డాక్టర్ డి.శ్రీహరి గుర్తించారు. ఆస్పత్రిలోని సైకిల్‌స్టాండ్ వద్ద అతడ్ని పట్టుకుని నీవు ఏ వైద్య కళాశాల్లో ఎంబీబీఎస్ చేశావు, ఎక్కడ పీజీ చేస్తున్నావు, ఏ బ్యాచ్‌కు చెందినవాడంటూ నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే నిందితుడ్ని ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవో మూర్తి వద్దకు తీసుకెళ్లి అప్పగించారు. అతడ్ని ప్రశ్నించగా తాను ఎవరికి వైద్యం చేయలేదని బదులిచ్చాడు. విచారణ అనంతరం నిందితుడ్ని కాకినాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేçÙ¯ŒSకి తరలించారు. తన గ్రామ పరిసర ప్రాంతాల్లో గిరిజనులందరూ తనను డాక్టరని పిలవడంతో, వారికి ఆస్పత్రిలో వైద్య సహాయం చేసేందుకే గొప్పకి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరుగుతున్నట్టు నిందితుడు విచారణలో చెప్పినట్టు సీఐ ఎ.ఎస్.రావు తెలిపారు. -
రేషన్‌పక్కదారి పట్టిస్తే ఉపేక్షించొద్దు
పౌరసరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత అధికారులు, డీలర్లతో సమీక్ష స్టాక్ పాయింట్ గోడౌన్ తనిఖీ పాల్గొన్న హోం మంత్రి రాజప్ప తదితరులు కాకినాడ సిటీ : రేషన్‌సరుకులు పక్కదారి పట్టిస్తే ఎంతటి వారైనా, ఏపార్టీ వారైనా ఉపేక్షించవద్దని, అలాంటి డీలర్లను సస్పెన్షన్‌లో ఉంచాలని పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాల్లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో కలిసి అధికారులు, మిల్లర్లు, రేషన్ డీలర్లతో వివిధ అంశాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ కొంత మంది కేవలం ఇళ్లు, ఇళ్లస్థలాలు, వైద్యం, ఉపకార వేతనాల కోసమే రేషన్ కార్డులు తీసుకుంటున్నారన్నారు.అవసరం లేకపోతే బియ్యం, కిరోసిన్ తీసుకోవద్దని అలాంటి కుటుంబాల వారికి ఆమె విజ్ఞప్తి చేశారు. రేషన్ తీసుకోని కార్డులను తొలగించబోమన్నారు. ప్రభుత్వంపై భారం పడినా డీలర్ల కమిషన్ గణనీయంగా పెంచామని, వారు నిజాయితీగా సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయవద్దన్నారు.ఎవరైనా రేషన్ బియ్యం రీ సైక్లింగ్‌కు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. రవాణా చార్జీలు చెల్లించాలి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ధాన్యా న్ని రైతు రవాణా చేస్తే రైతు ఖాతాకు, మిల్లర్ రవాణా చేస్తే మిల్లరుకు రవాణా చార్జీలు చెల్లించాలన్నారు. మధ్యలో దళారులెవరూ రైతులను మోసగించకుండా నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ అమలు, రేషన్ షాపుల భర్తీ, దీపం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ తదితర అంశాల గురించి వివరించారు. నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం రైస్‌మిల్లు పరిశ్రమను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. తమకు న్యాయం చేసి నష్టపోకుండా ఆదుకోవాలని జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మంత్రిని కోరారు. మిల్లింగ్ చార్జీలు పెంచాలని కోరారు. కస్టమ్ మిల్లింగ్‌కు బ్యాంక్ గ్యారెంటీల విషయంలో రాష్ట్రం వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరారు. 2014–15 సంవత్సరపు ధాన్యం కొనుగోలు రవాణా చార్జీల బకాయిలు రూ.6 కోట్లూ తక్షణమే ప్రభుత్వం చెల్లించేలా చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
ఆర్థిక సామర్థ్యం పెంచుకోవాలి
కాకినాడ సిటీ : అన్ని వర్గాల ప్రజలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి లావాదేవీలు జరపడం ద్వారా రుణాలు పొంది ఆర్థిక సామర్థ్యం పెంచుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ విధాన గౌతమీ సమావేశపు హాలులో లీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజస్ ఇనీషియేటివ్స్ అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో డివిజన్, మండల, గ్రామ కేంద్రాల్లో ఆర్థిక సమీకృతంపై అవగాహన కల్పిస్తామన్నారు. జన్‌ధన్ యోజనలో ప్రతి పౌరుడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారే కానీ దానిలో లావాదేవీలు లేవన్నారు. ఖాతాలు తెరచి, పొదుపు చేయడం ద్వారా మూలధనం పెరుగుతుందన్నారు. ఆంధ్రాబ్యాంక్ ఎల్డీఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆర్థిక సామర్థ్యం, సమానత్వం, స్వావలంబనపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం సీహెచ్.సుగుణారావు, నాబార్డ్ ఏజీఎం కేవీఎస్‌ప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.జ్యోతి, వివిధ బ్యాంకుల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. గిరిజన కుటుంబాలకు అదనంగా రెండు ఎల్ఈడీ బల్బులు ఏజెన్సీ మండలాల్లోని 44,579 గిరిజన కుటుంబాలకు అదనంగా మరో రెండు ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు లక్ష బల్బులను రంప గిరిజన మహిళా సమాఖ్య ఇండస్ట్రీయల్ కోఆపరేటివ్ సోసైటీ నుంచి ఏపీఈపీడీసీఎల్ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. మూడేళ్ల గ్యారంటీతో 9వాట్ల బల్బులను నవంబర్ 5లోగా సరఫరా చేయాలని సమాఖ్యకు సూచించారు. -
‘కాకినాడ’ పీఠం కైవసమే లక్ష్యం
అధికార పార్టీ వైఫల్యాల్నీ, వంచననూ ఎండగట్టాలి మెజారిటీ డివిజన్లూ, మేయర్ స్థానమూ గెలవాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నేతల పిలుపు కాకినాడ: రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లలో గెలుపుతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా బొత్స మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను రెండేళ్ళ పాలనలో తుంగలో తొక్కి, ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన తెలుగుదేశం, బీజేపీ వైఫల్యాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవడంతో పాటు ఐకమత్యంతో పనిచేసి మంచి ఫలితాలను సాధించాలని కోరారు. సమర్థులే అభ్యర్థులు : ధర్మాన పార్టీ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థులను సర్వేలు, ఇతర అంశాల ప్రాతిపదికగా ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. అభ్యర్థి గుణగణాలతోపాటు ప్రజలతో ఉండే సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. మరో పరిశీలకుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని శత్రువుగా చూసే ధోరణిలో పాలన సాగిస్తున్న చంద్రబాబు హయాంలో ఎన్నికలు యుద్ధంలా జరుగుతున్నాయని, కేడర్ సైనికుల్లా పనిచేయాల్సి అవసరం ఉందని చెప్పారు. జన్మభూమి కమిటీల ద్వారా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీట్ లెవెల్లో పార్టీ శ్రేణులతో కమిటీలు వేయాలన్నారు. మరో ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పార్టీ నేతలు ఐక్యతతో పనిచే సి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు. ‘స్మార్ట్ సిటీ’ ప్రచారార్భాటమే : కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ద్వారా రూ.386 కోట్లు విడుదలైనట్టు గొప్పలు చెబుతూ ఇప్పటి వరకు పట్టుమని రూ.2 కోట్లు నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన టీడీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంతో పాటు పార్టీ విధానాలను విస్తృతంగా ప్రచారం చేసి గెలుపుబాట పట్టాలన్నారు. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ద్వారా అధికార పార్టీకి ఎక్స్ అఫిషియో సభ్యులున్నందున కనీసం 35 స్థానాల్లో గెలుపును లక్ష్యంగా భావించాలన్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోపాటు ఇతర వైఫల్యాలను, స్మార్ట్‌సిటీ పేరుతో అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న విధానాలను ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా మేయర్ పీఠాన్ని జగన్‌కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగలమనే ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీ అరాచకాలు పెరిగిపోయాయన్నారు. అమర జవాన్లకు నివాళి ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలా పనిచేయాలనే అంశంపై పార్టీ శ్రేణులకు నేతలు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు స్వాగతం పలుకగా, రాష్ట్ర కార్యదర్శి కర్రి నారాయణరావు, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ నగర ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు సునీల్, అక్బర్ అజామ్ తదితరులు ప్రసంగించారు. తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పిస్తూ శశిధర్ తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ పెద్దాపురం, జగ్గంపేట కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, మట్టా సుజాత, రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, మీసాల దుర్గాప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి రామలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వాసిరెడ్డి జమీలు, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కాకినాడ సిటీ : స్థానిక వెంకట్‌నగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తుమ్మలపల్లి మేఘన (30) భర్త రమేష్ కుమార్ నుంచి విడిపోయి ఎం.విజయ్‌కుమార్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. మేఘన, రమేష్ మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం ఒకరిపై ఒకరు కేసులు వేసుకుని కోర్టుకు వెళ్లారు. ఈ తరుణంలో సోమవారం రాత్రి వెంకట్‌నగర్‌లోని అపార్ట్మెంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మేఘన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే మేఘన మృతికి రాయవరపు సత్యభామ, బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఎన్వీ సాయిబాబా అనే వారు కారణమని ఆమె బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేఘన పేరుపై ఉన్న భూమిని వారిద్దరూ తనఖా పెట్టించి, ఆ సొమ్మును ఆమెకు ఇవ్వలేదని ఆరోపించారు. పలుమార్లు అడిగితే వారిద్దరూ వేధిస్తేనే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించినట్టు పోలీసులు తెలిపారు. సీఐ చైతన్య కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.