వివాహిత ఆత్మహత్య | women sucide attempt in kakinada | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Published Wed, Jul 27 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

women sucide attempt in kakinada

కాకినాడ సిటీ : స్థానిక వెంకట్‌నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తుమ్మలపల్లి మేఘన (30) భర్త రమేష్‌ కుమార్‌ నుంచి విడిపోయి ఎం.విజయ్‌కుమార్‌ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. మేఘన, రమేష్‌ మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం ఒకరిపై ఒకరు కేసులు వేసుకుని కోర్టుకు వెళ్లారు. ఈ తరుణంలో సోమవారం రాత్రి వెంకట్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మేఘన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే మేఘన మృతికి రాయవరపు సత్యభామ, బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు ఎన్‌వీ సాయిబాబా అనే వారు కారణమని ఆమె బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేఘన పేరుపై ఉన్న భూమిని వారిద్దరూ తనఖా పెట్టించి, ఆ సొమ్మును ఆమెకు ఇవ్వలేదని ఆరోపించారు. పలుమార్లు అడిగితే వారిద్దరూ వేధిస్తేనే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించినట్టు పోలీసులు తెలిపారు. సీఐ చైతన్య కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement