జర్నలిస్ట్‌ ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం | Yogi Adityanath Announces Ten Lakh Compensation For Deceased Journalist Family | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం

Published Wed, Jul 22 2020 11:59 AM | Last Updated on Wed, Jul 22 2020 1:36 PM

Yogi Adityanath Announces Ten Lakh Compensation For Deceased Journalist Family - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో నడిరోడ్డుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ విక్రమ్‌ జోషి బుధవారం ఉదయం మరణించారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జర్నలిస్ట్‌  కుటుంబ సభ్యులకు ‌ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా జర్నలిస్ట్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. జోషి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. జర్నలిస్ట్‌ పిల్లలకు ఉచిత​ విద్యను అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. (చికిత్స పొందుతూ జర్నలిస్ట్‌ మృతి)

తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ వద్ద ఇద్దరు కుమార్తెల ఎదుటే జర్నలిస్ట్‌ విక్రమ్‌ జోషిపై నిందితులు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్‌ జోషి సోమవారం రాత్రి తన కుమార్తెలతో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. జోషి తలపై బుల్లెట్‌ గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్‌ చేసినట్లు  పోలీసులు తెలిపారు. ఇద్దరు పోలీసులను సస్సెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement