Journalist Death
-
జర్నలిస్ట్ ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో నడిరోడ్డుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ విక్రమ్ జోషి బుధవారం ఉదయం మరణించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా జర్నలిస్ట్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. జోషి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యను అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. (చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి) తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ వద్ద ఇద్దరు కుమార్తెల ఎదుటే జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై నిందితులు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్ జోషి సోమవారం రాత్రి తన కుమార్తెలతో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. జోషి తలపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పోలీసులను సస్సెండ్ చేసినట్లు పేర్కొన్నారు. -
స్వీడన్లో పాక్ జర్నలిస్ట్ మృతి
స్టాక్ హోం: స్వీడన్లో నివసిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ సాజిద్ హుస్సేన్(39) మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మార్చి 2న తప్పిపోయిన సాజిద్ ఏప్రీల్ 23న ఫైరిస్ నదిలో మృతదేహంగా తేలాడని పోలీసు అధికారి జోనాస్ ఎరోనెన్ తెలిపారు. మృతదేహనికి పోస్ట్‌మార్టం చేయగా సాజిద్ ఏదో నేరం చేసిన నిందితునిగా అనుమానం వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక సాజిద్ మృతి హత్య లేదా ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందన్నారు. (ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి: ట్రంప్) సాజిద్ పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్ ప్రాంతానికి చెందినవాడు. అతను బెలుచిస్తాన్ టైమ్స్ అనే వెబ్‌సైట్‌కి చీఫ్ ఎడిటర్ పని చేసేవారు. పాకిస్తాన్లో చోటు చేసుకొనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నేరాలు, పాక్ ఆర్మీ తిరుగుబాటుపై పలు కథనాలు రాశారు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన సాజిద్ 2012లో స్వీడన్‌కు వలస వెళ్లారు. 2017లో స్వీడన్‌లోని ఉప్ప్సలాలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతను చివరిసారిగా స్టాక్ హోంలోని ఉప్ప్సలాలో రైలు ఎక్కినట్లు పోలీలు తెలిపారు. -
కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్
తిరువనంతపురం: మద్యాన్ని సేవించి, అతివేగంతో కారు నడిపిన ఓ ఐఏఎస్ అధికారి, జర్నలిస్టు మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన కేరళలో శనివారం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడైన ఐఏఎస్ శ్రీరామ్ వెంకటరమణ్ (33)ను ఇటీవలే రాష్ట్రప్రభుత్వం సర్వే డైరెక్టర్‌గా నియమించింది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటరమణ్ తన మిత్రురాలు, మోడల్ వాఫా ఫిరోజ్‌కు చెందిన లగ్జరీ కారును వేగంగా నడిపిస్తూ మ్యూజియం రోడ్డు వద్ద మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో దానిపై ప్రయాణిస్తున్న ‘సిరాజ్’ వార్తాపత్రిక యువ జర్నలిస్టు కే ముహమ్మద్ బషీర్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం ధాటికి వాహనాల విడి భాగాలు, ఇతర వస్తువులు ఘటనా స్థలానికి దూరంగా ఎగిరిపడ్డాయి. ఐఏఎస్‌పై కేసు నమోదు చేశామని ఐజీపీ, పోలీస్ కమిషనర్ ధినేంధ్ర కశ్యప్ అన్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రాజకీయ ఘర్షణ.. జర్నలిస్ట్ హత్య!
సాక్షి, అగర్తలా: రెండు రాజకీయ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ పాత్రికేయుడిని దారుణంగా హత్య చేసిన ఘటన త్రిపురలో కలకలం రేపుతోంది. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పలువురు జర్నలిస్ట్‌లు ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ధర్నాకి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమ త్రిపురలోని మండ్వాయి ప్రాంతంలో బుధవారం ఐపీఎఫ్టీ మరియు సీపీఐ(ఎం) పార్టీ గిరిజన విభాగం త్రిపుర ఉపజాతి ఘన్ ముక్తి పరిషత్ ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీనిని కవరేజీ చేయటానికి వెళ్లిన సంతను భౌమిక్(28) అనే పాత్రికేయుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అంతేకాదు గొడవలో 118 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతారణం నెలకొంది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తప్పవని త్రిపుర మంత్రి భాను లాల్ సాహా తెలిపారు. ఘటన చోటుచేసుకున్న చుట్టుపక్కల రెండు జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. హత్య వెనుక ఐపీఎఫ్టీ నేతల హస్తం ఉందని పలువురు ఆరోపిస్తుండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.