లిఫ్ట్‌ అడిగి.. బైక్‌తో ఉడాయించాడు! | - | Sakshi

లిఫ్ట్‌ అడిగి.. బైక్‌తో ఉడాయించాడు!

Jul 23 2023 12:18 AM | Updated on Jul 23 2023 9:30 AM

- - Sakshi

భద్రాద్రి: ఓ యువకుడు లిఫ్ట్‌ అడిగి బైక్‌తో ఉడాయించిన ఘటన శనివారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. టీడీపీ మండల అధ్యక్షుడు కొమరం దామోదర్‌రావు ఉదయం బైక్‌పై సీతానగరం నుంచి లక్ష్మీనగరం వస్తున్నాడు. ఈ క్రమంలో సీతానగరం గ్రామం దగ్గర ఓ యువకుడు లిఫ్ట్‌ అడిగి వాహనం ఎక్కాడు. చిన్ననల్లబల్లి వచ్చాక బైక్‌లో పెట్రోల్‌ కొట్టించారు. అనంతరం స్టార్ట్‌ కాకపోవడంతో దామోదర్‌రావుతోపాటు సదరు యువకుడు ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ మెకానిక్‌ దుకాణం వద్దకు వెళ్లారు.

అక్కడ రిపేర్‌ చేస్తుండగా అత్యవసర పని ఉండటంతో దామోదర్‌రావు ఆటోలో లక్ష్మీనగరం బయల్దేరాడు. ఆటో ఎక్కాక అనుమానం వచ్చి.. తాను వచ్చే వరకు బైక్‌ ఎవరికీ ఇవ్వొద్దని మెకానిక్‌కు చెప్పాలంటూ ఇద్దరు గ్రామస్తులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు మెకానిక్‌ షాపు వద్దకు వచ్చే లోపే లిఫ్ట్‌ అడిగిన యువకుడు స్టార్ట్‌ చేసి చూస్తానంటూ బైక్‌తో ఉడాయించాడు. దీంతో దామోదర్‌రావు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement