కేసీఆర్ పర్యటనలో జేబు దొంగల హల్‌చల్‌ | Thief Hulchul At KCR's Karimnagar Farmers Visit | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పర్యటనలో జేబు దొంగల హల్‌చల్‌

Published Fri, Apr 5 2024 2:48 PM | Last Updated on Fri, Apr 5 2024 3:23 PM

Thief Hulchul At KCR Karimnagar Farmers Visit - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటనలో జేబు దొంగలు హల్‌చల్‌ చేశారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు మండలాల్లో ఎండిన పొలాలను కేసీఆర్‌ పరిశీలిస్తుండగా.. ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ. 10 వేలు కొట్టేశాడు. అయితే దొంగను పట్టుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అతడికి దేహశుద్ది చేశారు.

ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతున్నారు. సాయంత్రం సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement