వాషింగ్టన్: సాధారణంగా దొంగతనం చేసేటప్పుడు దొంగలు క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల నుంచి సొమ్ము, బంగారం వంటివి దోచుకోగానే అక్కడి నుంచి జాడలేకుండా పారిపోతారు. ముఖంపై మాస్క్ ధరించి వాళ్లెవరో తెలియకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇంత వరకు మనకు తెలిసిన కథే.. అయితే ఓ దొంగ మాత్రం వీటన్నింటికి భిన్నంగా ప్రవర్తించాడు. సరదాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు. ఈ వింత ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా కారులో వచ్చిన దొంగ తుపాకీ గురిపెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు. దాంతో ఆ యువకుడు తన దగ్గర డబ్బులు లేవని, కేవలం సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు మాత్రమే ఉందని చెప్పాడు. అయితే ఏటీఎంకు పదా అంటూ బాధితుడిని దొంగ తన కారులో తీసుకెళ్లాడు. అక్కడ డబ్బులు డ్రా చేయించి తీసుకున్నాడు. చోరీ అనంతరం దొంగ ఏం చేయకుండా యువకుడిని సురక్షితంగా ముందు ఉన్న ప్రదేశంలోనే దింపాడు. అంతేకాకుండా ఆ దొంగ కొన్ని విషయాలు బయటపెట్టాడు. యువకుడి వద్ద డబ్బులు దోచుకున్నందుకు ‘సారీ బ్రదర్.. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్లే దొంగలిస్తున్నట్లు’ వివరించాడు. మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే తిరిగి ఇస్తానని ఆ యువకుడికి చెప్పాడు.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను దొంగకు ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ కలుద్దాం అని చెప్పి ఆ దొంగ అక్కడి నుంచి పారిపోయాడు.ఈ విషయం తెలియగానే పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటన అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
చదవండి: Largest Restaurant In World: కొండల మధ్యలో రెస్టారెంట్.. ఒకేసారి 5800మంది భోజనం చేయొచ్చు
Comments
Please login to add a commentAdd a comment