
మద్యం మత్తులో ఓ వ్యక్తి హౌసింగ్ బోర్డులోకి చొరబడ్డాడు. అంతే అతన్ని దొంగగా భావించి సదరు హౌసింగ్ బోర్డు వాచ్‌మెన్, కొందరూ వ్యక్తులు అతడిని దొంగ అనుకుని చితకబాదేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి చేర్పించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..ప్రవీణ్ అనే వ్యక్తి మద్యం సేవించి సమీపంలో కూల్చి వేసి ఉన్న హౌసింగ్ బోర్డులోకి ప్రవేశించాడు. అది గమనించిన వాచ్‌మెన్ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కంగారుపడ్డ ఆ వ్యక్తి గోడ ఎక్కి పారిపోతున్నాడు. ఆగమని చెప్పిన వినకుండా వెళ్లడంతో ..వాచ్‌మెన్ తోపాటు సదరు వ్యక్తులు ప్రవీణ్‌పై గట్టిగా కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కస్తుర్బా ఆస్పత్రికి తరలించాగా..అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అతను దాడి చేయడం వల్ల మరణించాడా లేక మరేదైనా కారణం వల్ల చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు పోస్ట్‌మార్టం అనంతరం అతడిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తామని వెల్లడించారు.
(చదవండి: డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment