యువతిపై సామూహిక అత్యాచారం, హత్య
నల్గొండ: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. పట్టణ సమీపంలోని మర్రిగూడ రహదారిలో గుర్తుతెలియని యువతి(23)పై దుండగులు సామూహిక అత్యాచారం చేసి పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన ఆదివారం వేకువజామున జరిగింది.
కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. యువతి మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది. పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. శవం పక్కన మద్యం, వాటర్ బాటిల్ పడి ఉన్నాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని గుడిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతురాలి వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.