
ప్రియురాలిపై కత్తితో దాడి.. ప్రియుడి హత్య
నగరంలో ఒక ప్రేమోన్మాది యువతికి పెళ్లి కుదరడంతో ఇంటికి వెళ్లి ఆమెపై, అడ్డమొచ్చిన తల్లి, తమ్ముడిపై దారుణంగా కత్తితో దాడి చేశాడు.
కూకట్‌పల్లి(హైదరాబాద్): నగరంలో ఒక ప్రేమోన్మాది యువతికి పెళ్లి కుదరడంతో ఇంటికి వెళ్లి ఆమెపై, అడ్డమొచ్చిన తల్లి, తమ్ముడిపై దారుణంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని కూకట్‌పల్లి ప్రశాంతినగర్‌లో జరిగింది. వివరాలు. .ప్రశాంతినగర్‌కు చెందిన వల్లభారావు తన కుమార్తెకు పెళ్లి సంబంధం కాయం చేశారు. అయితే, రాజు(వివరాలు తెలియాల్సిఉంది) అనే యువకుడు శుక్రవారం ఉదయం వల్లభారావు ఇంటికి వచ్చి తన కుమార్తెను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెపై కత్తితో దాడికి యత్నం చేశాడు.
అదే సమయంలో పక్కనే ఉన్న యువతి తల్లి అడ్డురావడంతో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకున్న యువతి తమ్ముడిపై సైతం కత్తితో దాడి చేశాడు. అనంతరం యువతిని కత్తితో నరికాడు. ఇది చూసి ఆగ్రహించిన యువతి తండ్రి, రాజు వద్ద ఉన్న కత్తిని లాక్కొని అతన్ని హతమార్చాడు. గాయపడ్డ ముగ్గరిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందింస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.