చెడు అనకు.. కనకు.. వినకు
సీతానగరం (తాడేపల్లి రూరల్): సీతానగరం పుష్కర ఘాట్లో ముగ్గురు యువతులు మూడు కోతుల సామెత చందంగా చెడు అనకు, చెడు కనకు, చెడు వినకు.. సంకేతాలు చూపుతూ కనిపించారు. పుష్కరాల్లో భాగంగా సీతానగరం ఘాట్‌లో శనివారం పలువురు యువతులు తమ ఫోటోలను సెల్ఫీల్లో బంధిస్తూ, కష్ణమ్మ జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్నారు.