
సాక్షి, అమరావతి : గుంటూరులో యువతి హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు సాయం ప్రకటించారు.
ట్విటర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘ ఈరోజు గుంటూరుజిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఈరోజు గుంటూరుజిల్లా కాకాణిలో జరిగిన దుర్ఘటన ఎంతో దురదృష్టకరం. విద్యార్థిని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశిస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2021