బాయ్‌ఫ్రెండ్‌ కోసం షాపింగ్‌ మాల్‌లో తన్నుకున్న యువతులు | Viral Video: Three Young Girls Fight Over Boyfriend In Shopping Mall | Sakshi
Sakshi News home page

Viral Video బాయ్‌ఫ్రెండ్‌ కోసం షాపింగ్‌ మాల్‌లో తన్నుకున్న యువతులు

Sep 21 2021 9:22 PM | Updated on Sep 21 2021 9:56 PM

Viral Video: Three Young Girls Fight Over Boyfriend In Shopping Mall - Sakshi

పాట్నా: ప్రేమికుడు ముగ్గురు యువతులు పోట్లాడుకున్నారు. ముగ్గురికి ముగ్గురు జట్లు పట్టుకుని కొట్లాడారు. వారి గొడవను వారి ప్రియుడు చూస్తూ నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తిరుగుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మోతిజిల్‌ ప్రాంతంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ముగ్గురు యువతులు ఎదురుపడ్డారు. ఆ సమయంలో వారి ప్రియుడు అక్కడే ఉన్నాడు.
చదవండి: సీఎం జగన్‌కు బాలాపూర్‌ లడ్డూ అందించిన ఎమ్మెల్సీ రమేశ్‌ 

ఏం జరిగిందో ఏమో గానీ వారు వచ్చి రాగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు చేస్తూ బాహాబాహీకి దిగారు. మరో యువతి వచ్చి కూడా వారిపై దాడి చేసింది. అయితే వారు కొట్టుకుంటున్నా అక్కడే నిలబడ్డ యువకుడు నివారించే ప్రయత్నం చేయలేదు. వారి సిగపట్ల వీడియోను మాల్‌కు వచ్చిన కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు. వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఆ అబ్బాయి చాలా లక్కీ!’, ‘మాకు ఒక్కరే దిక్కులేరు నీకు ముగ్గురా బ్రదరూ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఒక్క మహిళా లేదు.. పురుషులతో నిండిన మంత్రివర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement