న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే 18వ రోజు బుధవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ వందలాది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేరళలో పర్యటిస్తున్నారు. ఆయన పాదయాత్ర కేరళలోని పండిక్కాడ్ స్కూల్ పాడి నుంచి ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటలకు వండూరు జంక్షన్‌లో విరామం కోసం ఆగారు. సరిగ్గా ఆ పాదయాత్రలోని ఒక యువతి రాహుల్‌ని కలిసి ఆనందంతో చిన్నపిల్ల మాదిరిగా గెంతులేసింది.
ఆమెకు రాహుల్‌ని కలిశానన్నా అవధులు లేని ఆనందం తోపాటు ఏడుపు కూడా వచ్చేసింది. ఆమె రాహుల్‌ని చూసి భావోద్వేగంతో ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఆ యాత్రలో పాల్గొన్న వాళ్లంతా ఆ యవతిని చర్యలను చూసి ఆశ్చర్యంతో నవ్వుతుండగా..రాహుల్ ఆ యువతని ఎగ్జాయిట్‌మెంట్‌ని కంట్రోల్ చేస్తూ.. దగ్గరకు తీసుకుని సముదాయించారు. వాస్తవానికి ఇలా పాప్ సింగర్స్ లేదా హిరో/ హిరోయిన్‌లు వచ్చినప్పుడూ అభిమానులు ఇలా ప్రవర్తిస్తుంటారు. కానీ అలాంటి క్రేజీ ఫీలింగ్ రాహుల్‌గాంధీకి ఈ పాదయాత్రలో ఎదురవ్వడం విశేషం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఆయన కేరళ పాదయాత్ర ఈ రోజు సాయంత్రాని కల్లా వాయనాడ్ నియోజకవర్గంలోకి ఎంట్రీ అవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ, కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ తెలిపారు. దాదాపు 3.750 కి.మీల సుదీర్ఘ 150 రోజుల పాదయాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమై జమ్ము కాశ్మీర్‌తో ముగియనుంది. అలాగే సెప్టంబర్ 10కి కేరళలో ప్రవేశించిన కాంగ్రెస్ జోడో పాదయాత్ర 450 కి.మీ దూరం సాగించి...సుమారు ఏడు రాష్ట్రాలను చుట్టి... అక్టోబర్ 1 కల్లా కర్ణాటకలోకి ఎంట్రీ ఇవ్వనుందని జై రాం రమేష్ తెలిపారు.
(చదవండి: కాంగ్రెస్‌కు విజన్ లేదు.. గెలిచేంత సీన్ లేదు.. ‘హస్తం’ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment