![Rahul Play Football With Kids At The Time Of Rajasthan Political Crisis - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/26/Football.jpg.webp?itok=g4QkkTc-)
తిరువనంతపురం: రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రాహుల్ భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళ పర్యటించారు. అక్కడ కేరళ వీధుల్లోని పిల్లలతో ఉల్లాసంగా ఫుట్‌బాల్ ఆడారు.
అందుకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఒక పక్క రాజస్తాన్‌లో ప్రభుత్వం కుప్పకూలేలా ఉంటే ఈ గేమ్‌లు ఏంటంటూ మరోవైపు నుంచి విమర్శలు ఊపందుకున్నాయి. ఆ వీడియోలో రాహుల్ పాలక్కాడ్ వీధుల్లో పిల్లలతో కాసేపు ఫుట్ బాల్ ఆడుతున్నట్లు కనిపించారు.
ప్రసుతం రాజస్తాన్‌లో పొలిటకల్ వాతావరణం చాలా టెన్షన్‌గా సాగుతోంది. ఇప్పటికే రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ మద్దతుదారులంతా సుమారు 92 మంది దాక రాజీనామ చేశారు. వారంతా ఆశోక్ గెహ్లాట్ స్థానం సచిన పైలెట్‌కి అప్పగించడంపై వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ये भविष्य ही तो संवारना है और इनके लिए हर मुश्किल से टकरा जाना है।#BharatJodoYatra pic.twitter.com/24R5Jvm9gY
— Congress (@INCIndia) September 26, 2022
(చదవండి: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment